అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీ హరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీ హరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీద నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మ వెన్నేలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయానా
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయానా
కనులకు దొరకని కళ గల జంటను పదిమంది చూడండి
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి
చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీద నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మ వెన్నేలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
సీతారాముల కల్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపాన
గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మధుని వొళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి
చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీద నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మ వెన్నేలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
గోగులు పూచె గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి
గోగులు పూచె గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి
గోగులు పూచె గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి
పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మాడి
పుత్తడి వెలుగులు .. ఓ లచ్చా గుమ్మాడి
ముద్దొచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉంది
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ
ముద్దొచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ
నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ
నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ
ఒక్కట్టయేందుకే ఇద్దరం ఉన్నదీ
నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవి
నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నవి
వెల వెల వెల వెల ఉప్పెన నేనై వస్తా
నీ కల కల కల కల మోముని చూస్తూ ఉంటా
గల గల గల గల మువ్వని నేనై వస్తా
నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లొ చోటున్నది
నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది
అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉంది
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే వుందీ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నాకోసమే తళుక్కందో నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
యే వూరే అందమా ఆచూకి అందుమా
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
కులుకులొ ఆ మెలికెలు మెఘాలలో మెరుపులు
పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులు ఆ చూపులు చురుకైన చుర కత్తులు
పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు
నా గుండెలో అదోమాదిరి నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలల పందిరి అల్లేయకోయి మహాపోకిరి
మబ్బులో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది
ఒహూ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటని
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని
మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని
ఎన్నాళిలా తనొస్తాడని చూడాలటా ప్రతి దారిని
యేతోటలో తనుందోనని యెటు పంపనూ నా మనసుని
ఏ నాడు ఇంతిదిగా ఖంగారే యెరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా
యే వూరే అందమా ఆచూకి అందుమా
అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నాకోసమే తళుక్కందో నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
యే వూరే అందమా ఆచూకి అందుమా
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
కులుకులొ ఆ మెలికెలు మెఘాలలో మెరుపులు
పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులు ఆ చూపులు చురుకైన చుర కత్తులు
పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు
నా గుండెలో అదోమాదిరి నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలల పందిరి అల్లేయకోయి మహాపోకిరి
మబ్బులో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది
ఒహూ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటని
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని
మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని
ఎన్నాళిలా తనొస్తాడని చూడాలటా ప్రతి దారిని
యేతోటలో తనుందోనని యెటు పంపనూ నా మనసుని
ఏ నాడు ఇంతిదిగా ఖంగారే యెరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా
యే వూరే అందమా ఆచూకి అందుమా
అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పేసెయ్ అంటుంది ఓ ఆరాటం..








కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా?
ReplyDeleteకన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా నాకెంతో ఇష్టమయిన భావం!
okappudu gundamma katha malleswari elano neti kaalaniki murai nuvvu naku nacchav chithralu alaa
ReplyDeletenice
gurthu chesinanduku
thanks
?!
రసజ్ఞ గారూ నిజమేనండీ చాలా మంచి భావం వుంటుంది ఈ పాటల్లో
ReplyDeleteఅందుకే ఈ పాటలకి లిరిక్స్ కూడా పోస్ట్ చేశాను..
మీ స్పందనకి ధన్యవాదములు
శివ గారూ చాలా బాగా చెప్పారండీ ..
ReplyDeleteనిజంగా అప్పటి గొప్ప సినిమాలతో పోల్చగలిగిన సినిమాలు
కొన్ని మాత్రమె ఇప్పుడు వున్నాయి ..
నా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు..