.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

Saturday, December 31, 2011

Happy New Year 2012


ఆనందం మన సొంతం
ఆవేశం
మన సొంతం





ఆనందం మన సొంతం ...ఆవేశం మన సొంతం
ఏనాటికీ ఇది నిన్నగా మారని నిజం కదా నేస్తం
అందాల అనుబంధం ...వందేళ్లు మన సొంతం
తన కాంతిలో ఈ ప్రతిక్షణం వెలిగించదా నేస్తం

ఆనందం మన సొంతం ఆవేశం మన సొంతం
ఏనాటికీ ఇది నిన్నగా మారని నిజం కదా నేస్తం
అందాల అనుబంధం వందేళ్లు మన సొంతం
తన కాంతిలో ఈ ప్రతిక్షణం వెలిగించదా నేస్తం

ఆ తారలే సాక్ష్యం ఈ చిరునవ్వులు సాక్ష్యం
వరమల్లె అందిన స్నేహం మన సొంతం
సొంతం సొంతం భూమి మొత్తం మన సొంతం
సొంతం సొంతం ఆకాశం మన సొంతం

ఊపిరిలో ఉరకలేసే ఉత్సాహం మనకు సొంతం
ఉప్పెనతో పందెమేసే ఉల్లాసం మనకు సొంతం
రెప్పల్లో స్వప్నాలు సొంతం గుప్పిట్లో పంతాలు సొంతం
అనుకుంటే ఏదైనా సొంతం అనిపించే నమ్మకం సొంతం
మనకేలే ప్రతి నిమిషమూ సొంతము

సొంతం సొంతం ప్రతి ఋతువు మన సొంతం
సొంతం సొంతం ప్రతి మలుపు మన సొంతం

దిక్కులనే ధిక్కరించే దుడుకుతనం మనకు సొంతం
చిక్కులనే వెక్కిరించే చిలిపితనం మనకు సొంతం
గువ్వల్లో వేగాలు సొంతం ఊహల్లో లోకాలు సొంతం
ఎగిరొచ్చే ఉదయాలు సొంతం ఎదిరించే శిఖరాలు సొంతం
అణువణువు ఈ యవ్వనం సొంతము

సొంతం సొంతం ఆశలన్నీ మన సొంతం
సొంతం సొంతం సరదాలే మన సొంతం
ఆనందం మన సొంతం ఆవేశం మన సొంతం
ఏనాటికీ ఇది నిన్నగా మారని నిజం కదా నేస్తం

అందాల అనుబంధం వందేళ్లు మన సొంతం
తన కాంతిలో ఈ ప్రతిక్షణం వెలిగించదా నేస్తం
సొంతం సొంతం భూమి మొత్తం మన సొంతం
సొంతం సొంతం ఆకాశం మన సొంతం

ఆశలన్నీ మన సొంతం సరదాలే మన సొంతం
లోకమంతా మన సొంతం ఈ సృష్టే మన సొంతం







4 వ్యాఖ్యలు:

  1. మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. జయ గారూ మీకు కూడా హృదయపూర్వక
    నూతన సంవత్సర శుభాకాంక్షలు..
    Wish You A Happy New Year 2012

    ReplyDelete
  3. థాంక్యూ మాలాకుమార్ గారు
    మీకు కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు..
    Wish You A Happy New Year 2012

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ పాడే పాట నుంచి..
ఇప్పటి అమ్మాయి /అబ్బాయి కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


Raaji.