.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

18, జూన్ 2014, బుధవారం

ఊసులాడే ఒక జాబిలట


ఒకప్పటి  ప్రేమపాట " ఊసులాడే ఒక జాబిలట " అప్పటి పాటలని ఒకప్పటి పాటలు అనటం కన్నా ఎప్పటికీ నిలిచిపోయే పాటలు అంటేనే  బాగుంటుందేమో .. సున్నితమైన సంగీతం,ప్రియురాల్ని అందంగా వర్ణిస్తున్న సాహిత్యంతో మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటల్లో ఒకటి ఈ పాట.. ఈ పాట  వినగానే హీరో, హీరోయిన్లు మురళి,హీరా  అప్పటి కాలేజ్ లైఫ్,డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కళ్ళముందు ఉంటాయి .. నాకు ఎప్పటికీ నచ్చే ప్రేమగీతం..



ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట





సినిమా : హృదయం (1992)
రచన :రాజశ్రీ
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.