.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

7, జులై 2014, సోమవారం

శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు - 4 పాటలునిన్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా వారి జీవిత విశేషాలను సాక్షి ఫామిలీ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. . ఆ ఇంటర్వ్యూ లోతెలుగులో ఆయనకి ఇష్టమైన పాటలని 4 పాటలు చెప్పారు . ఆ పాటలు  చాలా మందికి పరిచయం ఉన్న పాటలు .. నచ్చిన పాటలు కూడా."మౌనమే నీ భాష ఓ మూగ మనసా పాట" నాకు చాలా చాలా ఇష్టం .. "ఏటిలోని కెరటాలు రు విడిచి పోవు" పాట ఇప్పుడే విన్నాను.   మనసును కదిలించే పాటల్లో ఇది ఒకటని చెప్పొచ్చు .మిగతా 2 పాటలు కూడా అప్పుడప్పుడు విన్న,నచ్చినపాటలే 
బాల మురళీకృష్ణ గారి జన్మదిన కానుకగా ఆయనకు నచ్చిన ఆ నాలుగు పాటలు నా సంగీత ప్రపంచం లో .. 


సలలిత రాగ సుధారస సారం 


చిత్రం - నర్తనశాల ( 1963 )
రచన - సముద్రాల 
గానం - శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, లత
పాడనా వాణి కళ్యాణిగా చిత్రం - మేఘ సందేశం ( 1982 )
రచన - వేటూరి
గానం - శ్రీ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ
 
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు


చిత్రం  - ఉయ్యాల జంపాల (1960)
రచన - కొసరాజు 
గానం - శ్రీ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ


మౌనమే నీ భాష ఓ మూగ మనసా


సినిమా - గుప్పెడు మనసు 
రచన - ఆత్రేయ 
గానం -శ్రీ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ 
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.