.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

3, సెప్టెంబర్ 2014, బుధవారం

నాదం నీ దీవెనే .. నీ రాగాలాపనే ..

నా మరో కొత్త వీడియో ప్రయోగం "నాదం నీ దీవెనే నీ రాగాలాపనే"... ఈ పాట తమిళ్ డబ్బింగ్ సినిమా రాగమాలిక లోది రాధ,కన్నన్ నటించారు . ఈ పాట వింటుంటే నాదం,రాగం, ఇలా ఏదో శాస్త్రీయ సంగీతం పాటలగా అనిపిస్తుంది తన ప్రేమను తెలియచేస్తూ అమ్మాయి పాడే ఈ పాట ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం తో పాటూ జానకమ్మ స్వరం లో చాలా బాగుంటుంది .. నాకు ఇష్టమైన పాట. 


పాటకి వీడియో తెలుగులో లేదు .. 
నాకు నచ్చిన చిత్రాలతో ఈ పాట వీడియో చేశాను ..

నాదం నీ దీవెనే నీ రాగాలాపనే





సినిమా - రాగమాలిక (1982)
సంగీతం - ఇళయరాజా 
రచన - వేటూరి 
గానం - Sజానకి

7 కామెంట్‌లు:

  1. సూపర్...మనసుకి హాయిని , ఉత్సాహాన్ని కలిగించే మంచి సాహిత్యం, సంగీతం...మంచి టేస్ట్....కీప్ ఇట్ అప్...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Vijay Veerapaneni గారు నా సంగీత ప్రపంచం నచ్చినందుకు,మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండీ

      Thank you so much ..

      తొలగించండి
  2. ఈ పాటకు మీ చిత్ర దృశ్య కూర్పు చక్కగా వుందండి. జానకమ్మ గొంతులో పదాలు ఎన్ని హొయలు పోయారో చూసారా!
    తమిళ పాట ఇక్కడ చూడవచ్చు.
    Naadham En Jeevane Vaa Vaa En Devane
    https://www.youtube.com/watch?v=Vmy8XleGAEM

    ....శ్రీనివాసుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. B Sreenivasu గారు ఈ పాటకి తెలుగులో వీడియో దొరకలేదండి.అందుకే నాకు నచ్చిన చిత్రాలతో వీడియో చేశాను.నా ప్రయత్నం నచ్చినందుకు,మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.. మీరన్నట్లు ఈ పాటలో అందమంతా జానకమ్మ స్వరమే అనిపిస్తుంది.

      Thank you..

      తొలగించండి
  3. ఓహ్ ! ఎన్నేళ్లయిందో ఈ పాట విని - Thanks for posting, Raaji garu!

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.