.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

11, జులై 2016, సోమవారం

శీత వేళ రానీయకు .. రానీయకు


మేఘసందేశంలో అన్ని పాటలు చాలా రోజుల క్రితమే పోస్ట్ చేశాను ఇది తప్ప. పాట చాలా బాగుంది,అప్పటి రోజుల్లో ఇన్స్పిరేషన్ సాంగ్ అనిపిస్తుంది.ఈ పాట వీడియో లేదు ఆడియో మాత్రమే అప్ లోడ్ చేశాను.దేవులపల్లి కృష్ణశాస్త్రి  గీతాన్ని అద్భుతమైన సినిమా పాటగా ‘ మేఘసందేశం ‘ సినిమాలో ఉపయోగించి ఎప్పటికీ గుర్తుండేలా చేసిన దర్శకులు దాసరి.నారాయణరావు గారు.మంచి సాహిత్యం అందించే కవుల గొప్పతనాన్ని సినిమాల ద్వారా ప్రజల మనసుల్లో  నిలిచిపోయేలా చేసే దర్శకులు కూడా  గొప్పవారే..
 

 
 శీత వేళ రానీయకు..



చిత్రం - మేఘసందేశం (1982)
సంగీతం - రమేష్  నాయుడు
గీతరచన - దేవులపల్లి
గానం - K.J.ఏసుదాస్, P.సుశీల

6 కామెంట్‌లు:


  1. 'శీతవేళ రానీయకు..' పాట రికార్డు చేశారు కానీ, సినిమాలో లేదండీ..
    కానీ, ఈ పాట చాలాసార్లు వినడం వల్ల చూసిన ఫీలింగ్ నాకు.. డెజావూ అన్నమాట!!
    చాలా మంచి పాట..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాది కూడా మురళి గారి ఫీలింగే. ఎప్పుడో long back
      చూసి ఉండటంతో సరిగా గుర్తు లేక నేను కూడా పాట
      సినిమాలో ఉన్నాడనే భ్రమలోనే ఉన్నానిన్నాళ్ళు.
      really a very beautiful song. thanks for the post.

      తొలగించండి
    2. పాట గురించి వివరాలు చెప్పినందుకు Thank you "మురళి" గారు .. ఈ సినిమా ఎప్పుడో చూశానండీ,
      కానీ పాటలు మాత్రం అప్పుడప్పుడు రిలేటెడ్ వీడియోస్ లో కనపడుతూనే ఉంటాయి. సినిమాలో లేదు కాబట్టేనేమో ఈపాట మాత్రం ఎక్కడా కనపడలేదు. నేను కూడా సినిమాలో పాట ఉందేమో అనే అనుకుంటున్నాను.

      Thank You ..

      తొలగించండి
    3. పాట గురించి మీ స్పందన తెలిపినందుకు Thank you "nmrao bandi" గారు..ఈ పాట సినిమాలో లేదని నాకు కూడా ఇప్పడే తెలిసింది.
      నిజంగా పాట చాలా బాగుంది...

      Thank you ..

      తొలగించండి
  2. రాజిగారూ! నేనడిగిన పాట పోస్ట్ చేసినందుకు చాలా థాంక్స్!
    అప్పుడెప్పుడో వినడమే కానీ ఈ పాట అసలు సినిమాలో చూసిన గుర్తు లేదు - అసలు సినిమాలోనే లేదని పైన మురళి గారి కమెంట్ వలన తెలిసింది.
    Thanks once again!
    ~ లలిత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేఘసందేశం పాటలు అప్పుడప్పుడు చూస్తూంటానండీ .. ఆకులో ఆకునై, ఆషాఢ మాసాన,నిన్నటిదాకా శిలనైనా పాటలు హిట్ సాంగ్స్ కదా .. ఈ పాట మాత్రం నాకు ఈ మధ్యకాలంలో ఎక్కడా విన్న గుర్తు లేదు. మంచి పాట గుర్తుచేసినందుకు మీకు కూడా థ్యాంక్సండీ .. మీ వలన ఈ పాటకి ఇంత మంచి అభిమానులున్నారని కూడా తెలిసింది :)

      Thank You

      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.