.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

24, ఆగస్టు 2020, సోమవారం

తొలిసారి తలుపులు తీసి



తొలిసారి తలుపులు తీసి
పిలిచిందీ మననే పచ్చని సీమా




తొలిసారి తలుపులు తీసి
పిలిచిందీ మననే పచ్చని సీమా
మనదే ఈ ప్రాంతం మొత్తం
తొలిజంటై పరిపాలిద్దాం రామ్మా

మంచిమూర్తం మించకముందే
వలసపోయే పిట్టల మవుతూ
ఈ వనం లో మజిలీ చేద్దాం చల్
గోరువంకల గానం విందాం
వాగువంకల వేగం చూద్దాం
కొండకోనల నేస్తం చేద్దాం చల్

నువ్వు నేనే లోకం  నవ్వులోనే స్వర్గం
ఆరారు ఋతువుల రాగం ఆనందమే
సంకురాత్రే నిత్యం  సంబరాలే సాక్ష్యం
ఏడేడు జన్మలు ఉన్నవి మనకోసమే

తొలిసారి తలుపులు తీసి
పిలిచింది మననే పచ్చని సీమా
మనదే ఈ ప్రాంతం మొత్తం
తొలిజంటై పరిపాలిద్దాం రామ్మా

ఏనాడు మన ఏకాంతం జంటను వీడదూ
మనతోట విరులకు బరువై ఎన్నడు వాడదూ
ఇటు రారే ఎవ్వరూ ఇటుగా చూసేదెవ్వరూ
ఈ భావనలో శ్రుతి మించిన స్వరఝరి 
చల్ చల్ చల్ అంటే
అయ్యయ్యో వెల్లువ ఈ వన్నెల జిలుగులలో
నవ యవ్వన లీలలో మనసెటు పయనించునో

కడలి చేరే ఏరే చెలి చిందులూ
మొలక నవ్వే ఎదకీ గిలిగింతలూ
దాహం తో దాడి చేసి మేఘాన్ని వేడి చేసి
దివి గంగై ప్రణయం రాదా రాదా
రాదా రాదా రాదా  రాగం తీసీ

తొలిసారి తలుపులు తీసి
పిలిచింది మననే పచ్చని సీమా
మనదే ఈ ప్రాంతం మొత్తం
తొలిజంటై పరిపాలిద్దాం రామ్మా 

మంచిమూర్తం మించకముందే
వలసపోయే పిట్టల మవుతూ
ఈ వనం లో మజిలీ వేద్దాం చల్
గోరువంకల గానం విందాం
వాగువంకల వేగం చూద్దాం
కొండకోనల నేస్తం చేద్దాం చల్

నువ్వు నేనే లోకం నవ్వులోనే స్వర్గం
ఆరారు ఋతువుల రాగం ఆనందమే
సంకురాత్రే నిత్యం  సంబరాలే సాక్ష్యం
ఏడేడు జన్మలు ఉన్నవి మనకోసమే

కనికట్టే కట్టీ కట్టీ ముడి వేసే చూపూ
పసిపెట్టే రహస్యమేదో నాక్కూడా చెప్పూ
ఆ చూపుల్లో మెరుపూ  కాలానికి మైమరపూ
తన కళ్ళెదుటే జత వేడుక సాగుతూ
నిలూ నిలూ నిలూ అంటే
ఆహాహ అంటూ కాలం శిలగా మారినదా
మన కథగా ఆగినదా  వింతగ అనిపించదా

ప్రణయగీతం అంటే జలపాతమే.
శిలను సైతం మీటే అనురాగమే
అడుగడుగూ పూల పొందు
హృదయం లో వలపు వాగు
ప్రతి సంధ్యా మన్నూ మిన్నుల వలపే పాడూ

తొలిసారి తలుపులు తీసి
పిలిచింది మననే పచ్చని సీమా
మనదే ఈ ప్రాంతం మొత్తం
తొలిజంటై పరిపాలిద్దాం

మంచిమూర్తం మించకముందే
వలసపోయే పిట్టల మవుతూ
ఈ వనం లో మజిలీ వేద్దాం చల్
గోరువంకల గానం విందాం 
వాగువంకల వేగం చూద్దాం
కొండకోనల నేస్తం చేద్దాం చల్


చిత్రం - ప్రేమంటే ప్రాణమిస్తా (1999)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - సిరివెన్నెల
గానం - ఉన్నికృష్ణన్, K.S. చిత్ర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.