.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

1, సెప్టెంబర్ 2020, మంగళవారం

మతమేల గతమేల మనసున్ననాడు



మతమేల గతమేల మనసున్ననాడు
హితమేదొ తెలియాలి మనిషైనవాడు
 


మతమేల గతమేల మనసున్ననాడు
హితమేదొ తెలియాలి మనిషైనవాడు
నీ దేశమే పూవనం .. పూవై వికసించనీ జీవితం

కన్నీట కడగాలి కులమన్న పాపం
మన రక్త సింధూర వర్ణాలు అరుణం
గాయాల నీ తల్లికీ కన్నా జోలాలి  పాడాలిరా

సరిహద్దులే దాటు ఆ గాలిలా
ప్రసరించనీ  ప్రేమనే  హాయిగా
నదులన్ని కలిసేది కడలింటిలో
తారల్లు మెరిసేది గగనాలలో

కలలోకి  జారేను ఈ రాత్రులే
వెలిగించి నవ్యోదయం 

మతమేల గతమేల మనసున్ననాడు
హితమేదొ తెలియాలి మనిషైనవాడు
నీ దేశమే పూవనం .. పూవై వికసించనీ జీవితం

తల ఎత్తి నిలవాలి నీ దేశమూ
ఇల మీద నీ స్వర్గమై
భయమన్నదే లేని భవితవ్యమూ
సాధించరా సంఘమై

ఒక మాట ఒక బాట ఒక ప్రాణమై
సాగాలిరా ఏకమై

మతమేల గతమేల మనసున్ననాడు
హితమేదొ తెలియాలి మనిషైనవాడు
నీ దేశమే పూవనం .. పూవై వికసించనీ జీవితం


 చిత్రం - బొంబాయి (1995)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - వేటూరి 
గానం - సుజాతా మోహన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.