.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా



ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా



ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా
ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా

మన మాటలింక చినుకవక
మనసు తడిసి మొలకవకుండ
నన్నె వీడి పొరాదే .. నన్నె వీడి పొరాదే
మన మాటలింక చినుకవక
మనసు తడిసి మొలకవకుండ
మెరుపల్లె నువ్వు పొతె మసకల్లే నేనుంటా

ఇంకా కొంచెం సేపుకూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా

కనపడని వలే వేసి హృదయమునే ఒడిసి పట్టి
ఒడిసి పట్టి… ఒడిసి పట్టావే
వినపడని ఈలె వేసి పరువమునే హడలు గొట్టి
హడలు గొట్టీ .. హడలు గొట్టావే 

ఇటు రావా రావా రావా అలలాగ వచ్చి పో వా
వచ్చి నీ చేతిని చుట్టెయనా చిట్టి గాజు లాగా
అరే ఆలస్యాలే అమృతం అలవాటు చేసుకో  సహనం
ఆ అమృతం ఏదొ చేదంటా నీ మాటలే మధురం

ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వు
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు నీకు
ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వూ
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు నీకు
 
కడదాక కడలిలోని నీరల్లె నిలుచుంటా 
నీకొసమే .. నీ కొసమేలే
నా చెంపల్లోన  ఎరుపయే ఎరుపయే
నీకది ఎరుకనీ  బెరుకయ్యే 

ఉప్పు గాలుల్లోన ఎగసెనే 
కుప్పల తెప్పల తీయదనం
కప్పుకుందాం కప్పుకుందాం వడగాలి వెచ్చదనం 

నీ మేను చేప వాసన
నిన్ను పట్టుకుంటె ఫూల పరిమళం
ఈ రేయంతా మాట్లాడు మాటల్తో వేటాడు

ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా

నువ్వే రెప్పవి నా కంటి పాపకి
నువ్వు  తండ్రివి నా చంటి పాపలకి
అలలాగా మన పాపలు ఆడి పాడుకొవాలే
నీ మాటలన్ని నిజమై ఇక నువ్వు నేను మనమై
మన తనివి తీరా మునుగుదాం మది సంధ్రమే


చిత్రం - మరియన్ (2015)
సంగీతం  - A.R. రెహమాన్
గీతరచన - చంద్రబోస్
గానం - విజయ్ ప్రకాష్, సునీత 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.