.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

29, అక్టోబర్ 2020, గురువారం

నీ పదముల ప్రభవించిన గంగా యమునానీ పదముల ప్రభవించిన గంగా యమునా 
 మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా

 

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చితానంద సమర్ధ సద్గురు
సాయినాథ మహరాజ్ కీ జై

నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా
ఏ జీవమైన భావమైన నీవేగా

నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ

మనుజులలో దైవము నీవు
కోసల రాముడివై కనిపించావూ
గురి తప్పని భక్తిని పెంచావు
మారుతిగా అగుపించావూ
భక్త సులభుడవై కరుణించావూ
భోళా శంకరుడిగ దర్శనమిచ్చావు

ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ

ఆరడుగుల దేహము కావు
భక్తుల అనుభూతికి ఆకృతి నీవూ
తరతమముల భేదము చెరిపావు
మతమన్నది లేదన్నావూ
అన్ని జీవులలో కొలువైనావూ
అత్మా పరమాత్మలు ఒకటేనన్నావూ

అణురేణు బ్రహ్మాండ విశ్వమూర్తి నీవూ
సృష్టి విలాసమునకే సూత్రధారి నీవు
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ


చిత్రం - శిరిడిసాయి (2012)
సంగీతం - M.M ..కీరవాణి
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - M.M .కీరవాణి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.