.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

Wednesday, August 3, 2011

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు





ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా
ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో
ఇటో ఎటో వైపు......

మొదటి
వాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి
అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక
వచ్చు వాళ్ళకు బాట అయినది ..

ఎవరో
ఒకరు... ఎపుడో అపుడు
నడవరా
ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో
ఇటో ఎటో వైపు

కదలరు
ఎవ్వరూ వేకువ వచ్చినా అనుకొని కోడికూత నిదరపోదుగా
జగతికి
మేలుకొలుపు మానుకోదుగా..
మొదటి
చినుకు సూటిగా దూకి రానిదే
మబ్బు
కొంగు చాటుగా ఒదిగి దాగితే..
వాన
ధార రాదుగా నేల దారికి ... ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా
ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో
ఇటో ఎటో వైపు

చెదరక
పోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి
దానికి
లెక్క లేదు కాళరాతిరి..
పెదవి
ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని
రెప్ప
వెనక ఆపని కంటి నీటిని
సాగలేక
ఆగితే దారి తరుగునా? జాలి చూపి తీరమే దరికి చేరునా..?

ఎవరో
ఒకరు... ఎపుడో అపుడు
నడవరా
ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో
ఇటో ఎటో వైపు

యుగములు
సాగినా నింగిని తాకకా ఎగసిన అలల ఆశ అలసిపోదుగా
ఓటమి
ఒప్పుకుంటూ ఆగిపోదుగా
ఎంత
వేడి ఎండకే ఒళ్ళు మండితే.. అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత
గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా?.. నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా?

ఎవరో
ఒకరు... ఎపుడో అపుడు
నడవరా
ముందుగా అటో ఇటో ఎటో వైపు




♫♫♫♫♥♥♥♥♥♥♫♫♫♫♫

సినిమా:అంకురం
లిరిక్స్:సిరివెన్నెల సీతారామశాస్త్రి

♫♫♫♫♥♥♥♥♥♥♫♫♫♫♫



4 వ్యాఖ్యలు:

  1. చాలా మంచి పాట.. మంచి సినిమా.... గుర్తు తెచ్చినందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  2. ధన్యవాదములు voleti గారు

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ పాడే పాట నుంచి..
ఇప్పటి అమ్మాయి /అబ్బాయి కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


Raaji.