.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hindi To Telugu Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hindi To Telugu Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఆగస్టు 2020, బుధవారం

మెరిసింది మేఘం మేఘం



మెరిసింది మేఘం మేఘం 
ఉరిమింది మేఘం మేఘం





మెరిసింది మేఘం మేఘం 
ఉరిమింది మేఘం మేఘం
వర్షించే మేఘం వచ్చింది 

ముద్దిచ్చే వానంట మురిపించే వానంట 
గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంత వానంట
ముద్దిచ్చే వానంట మురిపించే వానంట 
గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంత వానంట

ఝల్ ఝల్  ఝల్  ఝల్  
ఝల్  ఝల్  ఝల్  ఝల్  
ఝల్ ఝల్  ఝల్  ఝల్ జల్లుల్తోనా 

మెరిసింది .. మెరిసింది మేఘం మేఘం 
ఉరిమింది మేఘం మేఘం
వర్షించే మేఘం వచ్చింది 

గిలిగిలి గిలిగిలి గా హహ్హహ్హ హా .. హహ్హహ్హ హా
గిలిగిలి గిలిగా తడి తడి  మట్టేసి 
పదండి కడదాం బొమ్మరిల్లునే 

మామిడి కొమ్మ కొమ్మకు ఓ రెమ్మా 
పట్టుకు డోలలు ఊగుదమా .. హా.. 
నాగలి పట్టుకుని సాగెను సాగుబడి 
కోడెల మెడ గంట భలె  మోగెను తాళములో 

 ఆ తీరమట్టట్టా నే చేరుదులే 
 ఆ తీరమట్టట్టా నే చేరుదులే
దూర దూర తీరమేదొ చేరుతుందో ఏమో మేఘం 

తహతహలాడే కలలే కళ్ళల్లో  దాచి 
పయనిస్తున్నా  వలచే  దారుల్లో 
అడవుల మీద నా మనసే ఉంచి 
సొంత ఊరు విడిచి పోతున్నా 

కొమ్మల ఊగినవి మామిడి పూవులవే 
ముద్దుగ పాడినవీ కసి పుట్టిన కోకిలలే 
మా ఇంటి ముగ్గమ్మా నిను వీడిపోతున్నా 
నను తోడు కోరింది మరి నాలో వున్న కన్నె ప్రాయం
 
మెరిసింది మేఘం మేఘం 
ఉరిమింది మేఘం మేఘం
వర్షించే మేఘం వచ్చింది 


చిత్రం - గురుకాంత్ (2007)
సంగీతం -  A.R. రెహమాన్ 
గీతరచన - వేటూరి 
గానం - శ్రేయాఘోషాల్ 

10, ఆగస్టు 2020, సోమవారం

నువ్వు లేక వెన్నెలంత వేసవాయే



నువ్వు లేక వెన్నెలంత వేసవాయే 
సఖియా .. ఓ సఖియా





దందర దందర మస్తు మస్తు
దర దందర దందర మస్తు మస్తు
దర దందర దం దం
నీ తోనే జీవితమెంతైనా

దందర దందర మస్తు మస్తు
దర దందర దందర మస్తు మస్తు
దర దందర దం దం
నీ నీడై నేనిక సాగేనా

నువ్వు లేక వెన్నెలంత వేసవాయే
సఖియా .. ఓ సఖియా
నువ్వు లేక వెన్నెలంత వేసవాయే
సఖియా .. ఓ సఖియా

హో ... రుచేలేదు ఏ రాత్రి .. కాటేసే కదా కలైనా

నువ్వు లేక వెన్నెలంత వేసవాయే
సఖియా .. ఓ సఖియా
నువ్వు లేక వెన్నెలంత వేసవాయే
సఖియా .. ఓ సఖియా

దందర దందర మస్తు మస్తు
దర దందర దందర మస్తు మస్తు
దర దందర దం దం
నీ తోనే జీవితమెంతైనా

దందర దందర మస్తు మస్తు
దర దందర దందర మస్తు మస్తు
దర దందర దం దం
నీ నీడై నేనిక సాగేనా

ఏదో చాకిరీకి పోకే సవతీ ఊసు ఎత్తబోకె
నీకై వసంతాలు వెతికీ  వేసారే
బిక్కు బిక్కు బెంగపడ్డ ఆ రాతిరి
గడవదుగా ఈ ఘడియ

అబ్బ నువ్వు లేక సఖియా సఖియా
కావే కలైనా కాలాలు కాటేసే ఓ ప్రియా
నువ్వు లేక వెన్నెలంత
వేసవాయే  సఖియా .. ఓ సఖియా .. హో

దందర దందర మస్తు మస్తు
దర దందర దందర మస్తు మస్తు
దర దందర దం దం
నీ తోనే జీవితమెంతైనా

నీవు లేక జాబిలి జాలి కోరెనే
పసిడి పచ్చ దూళి ఊరంతా చల్లెనే
నువ్వు లేక సిరులే కరిగే
నువ్వు తాక చీకటి వెలిగే జతే చేరుకో నాప్రియా

దందర దందర మస్తు మస్తు
దర దందర దందర మస్తు మస్తు
దర దందర దం దం
నీ నీడై నేనిక సాగేనా

నువ్వు లేక వెన్నెలంత వేసవాయే
సఖియా .. ఓ సఖియా
నువ్వు లేక వెన్నెలంత వేసవాయే
సఖియా .. ఓ సఖియా .. హో
రుచేలేదు ఏ రాత్రి .. కాటేసే కదా కలైనా

దందర దందర మస్తు మస్తు
దర దందర దందర మస్తు మస్తు
దర దందర దం దం
నీ తోనే జీవితమెంతైనా

దందర దందర మస్తు మస్తు
దర దందర దందర మస్తు మస్తు
దర దందర దం దం
నీ నీడై నేనిక సాగేనా


చిత్రం - గురుకాంత్ (2007)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - వేటూరి
గానం - A.R.రెహమాన్ , చిన్మయి, కదిర్

1, ఆగస్టు 2020, శనివారం

మన్ మోహనా మన్ మోహనా



మన్ మోహనా మన్ మోహనా 
కృష్ణా మొర వినవా కుదురే లేదు నువ్వు లేక



మన్ మోహనా మన్ మోహనా 
కృష్ణా మొర వినవా కుదురే లేదు నువ్వు లేక 
ఎద కోరేనే  నీ రాక 

వీడి రావయ్యా కాశీ  మధురా 
వీడి రావయ్యా కాశీ  మధురా 
నా దరి చేరగ రా 

కుదురే లేదు నువ్వు లేక 
కృష్ణా .. కోరేనే  నీ రాక


చిత్రం - జోధా అక్బర్ (2008)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - రాజశ్రీ
గానం -సాధనా సర్గమ్ 

30, జులై 2020, గురువారం

ఆమని ఋతువు వచ్చినదే



ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే



ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే

పరిమళములతో  వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా 
ఏవో చింతలు ముసిరేనే .. మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హో.. హో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో  వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా 

వేదనలే రగిలేనె రోదనలే మిగిలేనె
తన జ్ఞాపకాలు నాలోన సైయ్యాటలాడే
అడుగులను కలిపామే జతగాను నడిచామె
విపరీతమిలా ఇద్దరిని విడదీసినదే

చేరువనున్న చేరదురా  ఆవేదన ఇక తీరదులె
చీకటి తెర ఏదో మా నడుమా ఉన్నదే

ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనే  హో.. హో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో  వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట

గానమునే విన్నాను హృదయమునే ఇచ్చాను
ఆ జాలిలేని విధి మా పాలిట వికటించినదీ
నేనిచటా బికారిని తను అచట విరాగిణి
ఏకాంతము ఇద్దరి నీడగ మారినది

కలయికలో ఎడబాటు జరిగినదే పొరపాటు
కన్నులలోనా వసంతమెదలో శిశిరం

ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హో.. హో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట 


చిత్రం - జోధా అక్బర్ (2006)
సంగీతం -  A.R.రెహమాన్
గీతరచన - రాజశ్రీ
గానం - శ్రీనివాస్ 

28, జులై 2020, మంగళవారం

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా



చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 



ఎంత అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మాని
ఎంత అలకే కిన్నెరసాని

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 

చెలి కిలకిలలే చిటికేయ హోయ్య 
చెలి కిలకిలలే చిటికేయ
మది చెదిరి కథాకళి చెయ్య .. హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 

ఓ కన్నియపై చూపున్నదయా ఎదట పడే చొరవుండదయా
మనసాపలేక మాటాడలేక ఒక ఖయ్యామై తయ్యారయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా

ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా
ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా

తన వెంటపడే నా మనవి విని ఏనాటికి కనిపించేనయ్యా
తన వెంటపడే నా మనవి విని  ఏనాటికి కనిపించేనయ్యా

ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా
 తన వెంటపడే నా మనవి విని  ఏనాటికి కనిపించేనయ్యా

తొలగేన మరీ ఈ మాయ తెరా
తన చెలిమి సిరీ నా కలిమి అనీ
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి

జాలిపడైనా ఓయ్ అనదే మర్యాదకైన పరదా విడదే
అపరంజి చిలక శ్రమ పడిన ఫలితమై
నా వైపే వస్తూ ఉన్నదయా

చెలి కిలకిలలే చిటికెయ్య  హోయ్య
చెలి కిలకిలలే చిటికెయ్య
మది చెదిరి కథాకళి చెయ్యా హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
  చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా

మదినూయలలూపే సొగసయ్యా
తొలి తూర్పు కాంతులే చెలి ఛాయా
పరువాల తరంగమే తానయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా

 ఎంతటి అలకే కిన్నెరసాని మావని చేరే అల్లరి మానీ
ఎంతటి అలకే కిన్నెరసాని  మావని చేరే అల్లరి మానీ
చెప్పరయ్య నా జాణ తోటి  తన కంటపడే దారేదయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 

చెలి కిలకిలలే చిటికెయ్య హోయ్య
చెలి కిలకిలలే చిటికెయ్య
మది చెదిరి కథాకళి చెయ్యా హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 

ఓ కన్నియపై చూపున్నదయా ఎదట పడే చొరవుండదయా
మనసాపలేక మాటాడలేక  ఒక ఖయ్యామై తయ్యారయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా  


చిత్రం - ప్రేమతో (దిల్ సే) (1998)
సంగీతం - ఏ.ఆర్.రహ్మాన్ 
 గీతరచన - - సిరివెన్నెల 
గానం -  Sukhwinder Singh

26, జులై 2020, ఆదివారం

ఎపుడో అపుడు కలంటు రాని



ఎపుడో అపుడు కలంటు రాని
కన్నులు ఎందుకు



ఎపుడో అపుడు కలంటు రాని
కన్నులు ఎందుకు
ఎవరో ఒకరు జతంటు లేని బ్రతుకింకెదుకూ

తపించూ ప్రేమ కోసం
జపించూ ప్రేమ మంత్రం
ఏ తోడూ లేకపోతే అలసిపోదా జీవితం

ప్రపంచానికొస్తావు ఏకాకి లాగా
ఏదో నాడు వెలతావు ఏకాకి లాగా
ప్రతి నిమిషం ఒంటిగా నడకెందుకంట
ఒక హృదయం దొరికితే అలుపుండదంట

నీ వెంట నీడై నడిచే ఇంకొకరి ప్రాణం
విసుగురాదు ఎన్నాలైనా చేసే ప్రయాణం

నేలతోటి ఆకాశం మాటాడుతుంది
తీరంతో ప్రతి కెరటం ఆటాడుతుంది
ఏ బదులూ అడగనీ పిలుప్పెక్కడుందీ
ఏ చెలిమీ కోరని మనసెక్కడుందీ

భాషుంది భావముందీ మనిషైన నీకు
అందించకుండా లోలో బంధించుకోకు

ఎపుడో అపుడు కలంటు రాని
కన్నులు ఎందుకు
ఎవరో ఒకరు జతంటు లేని బ్రతుకింకెదుకూ

తపించూ ప్రేమ కోసం
జపించూ ప్రేమ మంత్రం
ఏ తోడూ లేకపోతే అలసిపోదా జీవితం


చిత్రం - రంగీలా (1995)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - లతా మంగేష్కర్


24, జులై 2020, శుక్రవారం

హాయ్ రామ ఊరికే



హాయ్ రామ  ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగ ఉండేదెలా



హాయ్ రామ  ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగ ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది

ఇంట బయట నన్ను వెంటాడే నీ కన్ను
మాటే విననంటున్నది
పోనీలే అనుకుంటే ఇంకా ఇంకా అంటూ
తెరలే దాటొస్తున్నది

నా కళ్ళతోటి నీ అందం నువ్వే చూడు ఒకసారి
నాలాగే నీకు నిలువెల్లా రాదా ఆవిరి

హాయ్ రామ  ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగ ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది.
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది

నాదే తప్పా అంతా నేనేం చేశా అంత
నేరం మరి నీదేకదా
వేళాపాళ లేక వేడెక్కిస్తూ ఇట్టా
దూరం అంటే ఎలా

ఆపొద్దు నన్ను అల్లరిగా మరీ అంత ఆకలిగా
లాగొద్దు ఒడికి తుంటరిగా ప్రాణం తీయకా 

హాయ్ రామ ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగ ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది.
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది


చిత్రం - రంగీలా (1995)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల
గానం - హరిహరన్, స్వర్ణలత 

22, జులై 2020, బుధవారం

ఏమిటో ఏమో ఈ ప్రేమా



ఏమిటో ఏమో ఈ ప్రేమ 
శాపమో వరమో ఈ ప్రేమ



ఏమిటో ఏమో ఈ ప్రేమ శాపమో వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమ
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో అమృతమో చెప్పేవారే లేరమ్మా

ఏమిటో ఏమో ఈ ప్రేమ  శాపమో వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమ
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో అమృతమో చెప్పేవారే లేరమ్మా

ఏ నిముషం ఇది మొదలవుతుందో తెలియదు
గుండెల్లో చేరేముందు అనుమతి అడగదు
మనసుంటే ప్రేమించక మానదు
ప్రేమిస్తే మనదంటూ మనకే మిగలదు

అక్షరాలు రెండే అయినా 
లక్షలాది కధలను రాసే
ఈ ప్రేమలో పడి నిలబడ తరమా

ఏమిటో ఏమో ఈ ప్రేమ శాపమో వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమ
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో అమృతమో చెప్పేవారే లేరమ్మా 

పగలేమో తరగని అల్లరి ఊసులు
రాత్రంతా తరగని తేనెనీ ఊహలు
కలిసిన క్షణమున నిలవని తపనలు
ఏకాంతంలో నయినా విడువని తలపులు

ఋతువులకే రంగులు మార్చే
మెలకువకే కళలను నేర్పే
ఈ ప్రేమ గారడి  ఎవ్వరి మహిమా 

ఏమిటో ఏమో ఈ ప్రేమ శాపమో వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమ
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో అమృతమో చెప్పేవారే లేరమ్మా 


చిత్రం - రంగీలా (1995)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - హరిహరన్,కవితా కృష్ణ మూర్తి 


20, జులై 2020, సోమవారం

యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే



యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే



యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే

జనమందరిలో మనమెవరంటే
తెలిసుండాలి ఒక విలువుండాలి
ఘనచరితలు గల కొందరిలో
మన పేరుండాలి తగు ప్లేసుండాలి

నలుగురూ గొప్పగా చూడగా
ప్రతిదినం కొత్తగా ఉండగా
బతకడం అప్పుడే పండుగా

యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే

లోకంలోనే ఉంటూ
 చుట్టూ బతుకును చూస్తూ
జీవించటమంటేనే 
తెలియనివాళ్ళను చూస్తే జాలి

కనిపించని తలరాత అరచేతుల్లో గీత
బతుకును నడిపిస్తాయని 
నమ్మే వాళ్ళను ఏం చెయ్యాలి

ఊరికే ఊహలో ఉండకా 
నిజముగా మార్చుకో  కోరికా 
నింగిలో నిలిచిపో తారగా

యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే


చిత్రం - రంగేళి (Hindi - రంగీలా)(1995)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - సిరివెన్నెల
గానం - S.జానకి

8, ఏప్రిల్ 2019, సోమవారం

ఓ ప్రియతమా బదులియ్యుమా ఏచోట నీవు ఉన్నా



ఓ ప్రియతమా బదులియ్యుమా ఏచోట నీవు ఉన్నా 
ఈ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా





చిత్రం - ప్రేమతో - DilSe (1998)
సంగీతం - A.R రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - మనో, స్వర్ణలత


6, ఏప్రిల్ 2019, శనివారం

ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో



ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో అలజడే రేగిందిలే
ఈడు బరువయ్యిందిలే




చిత్రం - ప్రేమతో --  Dil Se (1998)
సంగీతం - ఏ.ఆర్.రహ్మాన్   
గీతరచన -  సిరివెన్నెల  
గానం - K.S. చిత్ర 

4, ఏప్రిల్ 2019, గురువారం

మళ్ళీ అమ్మమ్మో వచ్చాడే



మళ్ళీ అమ్మమ్మో వచ్చాడే
కలలో ముద్దే దోచినాడే





చిత్రం - ప్రేమించి పెళ్ళాడుతా (1995)
Dilwale Dulhaniya Lejayenge
సంగీతం - జతిన్ లలిత్ 
గీతరచన  - వెన్నెలకంటి
గానం - K.S.చిత్ర

2, ఏప్రిల్ 2019, మంగళవారం

పందిట్లో సందడుంది పల్లకి రెడీగ ఉంది



పందిట్లో సందడుంది పల్లకి రెడీగ ఉంది 
పందిట్లో సందడుంది పల్లకి రెడీగ ఉంది




చిత్రం - ప్రేమించి పెళ్లాడుతా (1995)
Dilwale Dulhania Le Jayenge
సంగీతం - జతిన్ లలిత్ 
గీతరచన - వెన్నెలకంటి 
గానం - S.P. బాలు, K.S.  చిత్ర


31, మార్చి 2019, ఆదివారం

నీ ఆశే నాకు ఆరాధనం



నీ ఆశే నాకు ఆరాధనం
ప్రేమించే గుండే ఒక నందనం






చిత్రం - ప్రేమించి పెళ్ళాడుతా(1995)
Dilwale Dulhania Le Jayenge 
సంగీతం - జతిన్-లలిత్
గీతరచన - వెన్నెలకంటి
గానం - S.P. బాలు, K.S. చిత్ర 

29, మార్చి 2019, శుక్రవారం

ఎదో ఏమిటో తెలియని కలవరం



ఎదో ఏమిటో తెలియని కలవరం 
ఇదే ఎన్నడూ ఎరుగనీ  కలకలం





చిత్రం - ప్రేమించి పెళ్లాడుతా (1995)
Dilwale Dulhania Le Jayenge
సంగీతం - జతిన్ లలిత్ 
గీతరచన - వెన్నెలకంటి 
గానం - S.P. బాలు,K.S. చిత్ర


27, మార్చి 2019, బుధవారం

వినవే యశోదా.. నీ చిన్నీ కన్నయ్యా



వినవే యశోదా నీ చిన్నీ కన్నయ్యా
చల్లనమ్మబోతే మధురాపురానా



చిత్రం - ప్రేమానురాగం -  Hum Saath Saath Hain (1999)
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన  - వెన్నెలకంటి 
గానం - K.S.చిత్ర

25, మార్చి 2019, సోమవారం

మది నెమలిగ ఆడేనోయ్ తకతయ్యా తయ్యా



మది నెమలిగ ఆడేనోయ్ తకతయ్యా తయ్యా 
తుమ్మెద కవ్వించేనోయ్ విరజాజిని చెలియా


చిత్రం - ప్రేమానురాగం - Hum Saath Saath Hain (1999)
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన - వెన్నెలకంటి 
గానం - S.P. బాలు,చిత్ర, కోరస్

23, మార్చి 2019, శనివారం

ఇలకు దిగివచ్చె భగవంతుడే



ఇలకు దిగివచ్చె భగవంతుడే
పంచగా ప్రేమ తల్లి దండ్రిగా



చిత్రం - ప్రేమానురాగం - Hum Saath Saath Hain(1999)
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన - వెన్నెలకంటి 
గానం - S.P. బాలు


21, మార్చి 2019, గురువారం

నాలో నేను రేయీ పగలూ



నాలో నేను రేయీ పగలూ 
ఆలోచించానే మదిలో ఇదేలే 



చిత్రం - ప్రేమపావురాలు - Maine Pyar Kiya (1989)
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన - రాజశ్రీ 
గానం - S.P. బాలు,K.S. చిత్ర


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.