చిత్ర వేలకొద్ది సినిమా పాటలు మరియు సినిమాయేతర పాటలు రికార్డు చేసిన గాయని . తన గాత్ర జీవితములో ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా ఆరు జాతీయపురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకొన్నది. ఇన్ని పురస్కారాలు మరే ఇతర నేపథ్య గాయకురాలు అందుకోలేదు. జాతీయ పురస్కారాలు అందుకున్న సినిమాలు
- 1986 - సింధుభైరవి, తమిళ సినిమా
- 1987 - నఖక్షతంగళ్, మలయాళ సినిమా
- 1989 - వైశాలీ, మలయాళ సినిమా
- 1996 - మిన్సార కనువు, తమిళ సినిమా
- 1997 - విరాసత్, హిందీ సినిమా
- 2004 - ఆటోగ్రాఫ్, తమిళ సినిమా
ఇవేకాక చిత్ర ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 15 అవార్డులు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి 7 అవార్డులు,
తమిళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 4 అవార్డులు,
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము నుండి 2 అవార్డులు అందుకొన్నది.
ఈ విధంగా దక్షిణ భారతదేశములోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది.
ఈమె పాడిన పాటల్లో చాలా పాటలు నాకు ఇష్టమైనవి ,మళ్ళీ మళ్ళీ వినే పాటలు చాలా వున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి