
కొందరు గాయకుల గాత్రంలో సమ్మోహన శక్తి వుంటుంది.
వాళ్ళు పాడిన గీతాలు శ్రోతలను రంజింప చేస్తాయి.
ఆబాల గోపాలాన్ని ఆనంద సాగరంలో తేలియాడిస్తాయి.
ఆ పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచిపోతాయి.
ప్రేక్షకుల్ని మంత్రముగ్దులి చేసే అటువంటి గాయకుల్లో
k.j.ఏసుదాస్ గారు ఒకరు..అనేక భారతీయ భాషల్లో
55 వేలకు పైగా పాటల్ని పాడి,అనేక జాతీయ,రాష్ట్రీయ అవార్డుల్ని గెలుచుకున్న ఈ సమ్మోహన గాయకుడి
పుట్టినరోజు సందర్భంగా
నాకు నచ్చిన k.j.ఏసుదాస్ - All Time Hits
"నా సంగీత ప్రపంచం"లో..