ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మా మా కనకదుర్గమ్మా
వెలసినావు మాయమ్మ
ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మా మా కనకదుర్గమ్మా
వెలసినావు మాయమ్మ
పసుపు కుంకుమ పూజలు నీకు
పాలకడలితో సేవలు నీకు
ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మా మా కనకదుర్గమ్మా
వెలసినావు మాయమ్మ
ఆ కొండా కోనలందు కొండ దేవతా
ఆ కోటి ఉదయభాను వెలుగు నీవమ్మా
ఆ కోటి ఉదయభాను వెలుగు నీవమ్మా
కోటొక్క భక్తులను బ్రోచినావమ్మా
కో అంటూ పిలువగానే పలికినావమ్మా
కో అంటూ పిలువగానే పలికినావమ్మా
నీ దివ్యనామం సంకీర్తనముగా
జపియిస్తు ఉన్నాము మా కనకదుర్గమ్మా
నీ దివ్యనామం సంకీర్తనముగా
జపియిస్తు ఉన్నాము మా కనకదుర్గమ్మా
ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మా మా కనకదుర్గమ్మా
వెలసినావు మాయమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి