.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
సీరియల్ టైటిల్ సాంగ్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సీరియల్ టైటిల్ సాంగ్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మే 2020, ఆదివారం

కృష్ణమ్మకు గోదారికి తోడెవరమ్మా



కృష్ణమ్మ కు గోదారికి తోడెవరమ్మా
మమతల మందాకిని మగువేనమ్మా



కృష్ణమ్మ కు గోదారికి తోడెవరమ్మా
మమతల మందాకిని మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండా కోనలులు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో  దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి

కృష్ణమ్మ కు గోదారికి తోడెవరమ్మా
మమతల మందాకిని మగువేనమ్మా

కడలిని చేరిన నదికి విశ్రాంతి
తరుణికి మాత్రం తీరని భ్రాంతి.
పచ్చని పైరుకు నది ఆధారం
బ్రతుకున వెలుగుకు ఆడది మూలం

గంగ పొంగి పొరలిందా ప్రళయ తాండవం రాదా
సీత గీత దాటిందా యుద్ధకాండ మొదలేగా
ఆ నది ఆడది శక్తి స్వరూపాలే

కృష్ణమ్మకు గోదారికి తోడెవరమ్మా
మమతల మందాకిని మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండా కోనలులు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో  దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి


పిన్ని సీరియల్ టైటిల్ సాంగ్ 
1999 & 2020


30, డిసెంబర్ 2016, శుక్రవారం

15, డిసెంబర్ 2016, గురువారం

13, డిసెంబర్ 2016, మంగళవారం

అంతరంగాలు అనంత మానస చదరంగాలు




అంతరంగాలు అనంత మానస చదరంగాలు
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు 




సీరియల్ - అంతరంగాలు 
సంగీతం - వాసురావు 
గీతరచన - సుమన్ 
గానం - S.P. బాలు 

12, డిసెంబర్ 2016, సోమవారం

గుండెకి సవ్వడెందుకో పెదవులకీ వణుకెందుకో



గుండెకి సవ్వడెందుకో పెదవులకీ వణుకెందుకో
పరువానికో పరుగెందుకు తనువుకీ తపనెందుకో




 సీరియల్ - అంతరంగాలు
 సంగీతం - సుమన్
గీతరచన - సుమన్
గానం - సునీత

11, డిసెంబర్ 2016, ఆదివారం

ఆగదేనాడు కాలమూ ఆగినా గడియారమూ



ఆగదేనాడు కాలమూ ఆగినా గడియారమూ
 



సీరియల్ - రాధా మధు
సంగీతం - వైభవ్
గీతరచన - చిర్రావూరి విజయకుమార్
గానం - S.K.బాలచంద్రన్, ప్రణవి

10, డిసెంబర్ 2016, శనివారం

వాసంత సమీరం లా నునువెచ్చని గ్రీష్మం లా


పాత జ్ఞాపకాల్లో చాలా ఇష్టమైన జ్ఞాపకాల్లో ఋతురాగాలు సీరియల్ టైటిల్ సాంగ్ ఒకటి .అప్పట్లో సాయంత్రం కాగానే  ప్రతి ఇంట్లోనుండి ఈ పాట సున్నితంగా వినపడుతూ ఉండేది. ఈ మధ్యకాలంలో డైలీ సీరియల్స్ మరీ వెటకారంగా తయారవుతున్నా,అప్పటిరోజుల్లో వచ్చిన డైలీ సీరియల్ టైటిల్ సాంగ్స్ కొన్ని చాలా బాగుండేవి.


వాసంత సమీరం లా నునువెచ్చని గ్రీష్మం లా



ఋతురాగాలు 
సంగీతం - బంటి 
గానం - సునీత
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.