.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Lyrics - భువన చంద్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Lyrics - భువన చంద్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, జులై 2020, గురువారం

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే



వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే 
పూల తేనెలే తేవే



వెన్నెలా వెన్నెలా 
మెల్లగా రావే పూల తేనెలే తేవే
వెన్నెలా వెన్నెలా 
మెల్లగా రావే పూల తేనెలే తేవే

కడలి ఒడిలో నదులు ఒదిగి 
నిదురపోయే వేళా
కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళా

వెన్నెలా వెన్నెలా 
మెల్లగా రావే పూల తేనెలే తేవే

ఆశ ఎన్నడు విడువదా 
అడగరాదని తెలియదా
నా ప్రాణం చెలియా నీవేలే

విరగబూసిన వెన్నెలా 
వదిలి వేయకే నన్నిలా
రారాదా ఎద నీదే కాదా

నిదురనిచ్చే జాబిలీ నిదురలేక నీవే వాడినావా

వెన్నెలా వెన్నెలా 
మెల్లగా రావే పూల తేనెలే తేవే

మంచు తెరలో అలిసిపోయి 
మదన సంధ్య తూగెనే
పుడమి ఒడిలో కలలుకంటూ 
పాపా నీవూ నిదురపో

మల్లె అందం మగువకెరుక 
మనసు బాధ తెలియదా
గుండె నిండా ఊసులే 
నీ ఎదుటనుంటే మౌనమే

జోలపాటా పాడినా నే నిదురలేక వాడినా

వెన్నెలా వెన్నెలా 
మెల్లగా రావే పూల తేనెలే తేవే
వెన్నెలా వెన్నెలా 
మెల్లగా రావే పూల తేనెలే తేవే


చిత్రం - ప్రేమదేశం (1996)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - - భువనచంద్ర
గానం - మనో, ఉన్నికృష్ణన్

30, జూన్ 2020, మంగళవారం

నను నేనే మరిచినా నీ తోడు



నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు



ప్రేమా.. ప్రేమా..ఆ.. ఆ..ఆ 
ప్రేమా..  ప్రేమా..ఆ.. ఆ..ఆ

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు .. ప్రేమా

నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే .. ప్రేమా..  ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ .. రావా 
నా వాకిట్లో .. నీకై .. నే వేచానే

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు ప్రేమా

ఆకాశ దీపాన్నై నే వేచివున్నా
నీ పిలుపు కోసం చిన్నారీ
నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా
కరుణించలేవా సుకుమారీ

నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువులేక లోకంలో జీవించలేనే
నీ ఊహతోనే బ్రతికున్నా

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు .. ప్రేమా

నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే .. ప్రేమా..  ప్రేమా

నిముషాలు శూలాలై వెంటాడుతున్నా
ఒడి చేర్చుకోవా వయ్యారీ
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా
ఓదార్చిపోవా  ఓ సారీ

ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ
ప్రేమించినానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు .. ప్రేమా

నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే .. ప్రేమా..  ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ .. రావా 
నా వాకిట్లో .. నీకై .. నే వేచానే

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు .. ప్రేమా


చిత్రం - ప్రేమదేశం(1996)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - భువనచంద్ర
గానం - S.P.బాలు, O.S.అరుణ్

24, మార్చి 2020, మంగళవారం

ఝుమ్మనే తుమ్మెద వేట



ఝుమ్మనే తుమ్మెద వేట 
ఘుమ్మనే వలపుల తోట 



చిత్రం - మెకానిక్ అల్లుడు (1993) 
సంగీతం - రాజ్ - కోటి 
గీతరచన -  భువన చంద్ర 
గానం - S.P.బాలు, K.S.చిత్ర

17, ఆగస్టు 2016, బుధవారం

భువనచంద్ర All Time Best Songs ..


సినీ గీతరచయిత శ్రీ "భువనచంద్ర"గారు సినిమాల్లో ఎన్నోరకాల పాటలు రాశారు. అందులో నాకు నచ్చేవి చాలా ఉన్నాయి.పచ్చని చిలుకలు తోడుంటే, జీవితం ఓప్రయాణం,రోజాపూలు,జోడి పాటలు చాలా బాగుంటాయి. ఒకప్పుడు సినిమాలకు సంబంధించిన వాళ్ళంటే సినిమాలో,టీవీల్లో మాత్రమే చూడగలిగే వాళ్ళం.కానీ ఇప్పుడు face Book వల్ల సెలెబ్రిటీలు కూడా మన ఫ్రెండ్స్ అవుతున్నారు.అలా నాకు కూడా ఇప్పుడు భువనచంద్ర గారు face Book ఫ్రెండ్ కావటం వలన,జీవిత విశేషాలు,పాటలు, సినిమాల జ్ఞాపకాలు రోజూ తెలుస్తుంటాయి.

ఈ రోజు భువనచంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ వారు రాసిన ఎన్నో వేల పాటల్లోనుండి నాకు నచ్చే కొన్ని పాటలు నా సంగీత ప్రపంచంలో.. 
 

Happy Birth Day BhuvanaChandra గారు
Many Happy returns of the day




 మహాచండి - 2002
ఊరువాడ కదిలిందిర ఓరన్న

ప్రాణస్నేహితులు - 1988
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

సుమంగళి - 1989
జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ

ఖైదీ నెం 786 - 1988
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట 

 గ్యాంగ్ లీడర్ - 1991
వానా వానా వెల్లువాయే 
యసు వయసు వరసగున్నది వాటం 
పాలబుగ్గ ఇదిగో పట్టు

రౌడీ అల్లుడు - 1991
లవ్ మీ మై హీరో 
ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు

కొబ్బరి బోండం - 1991
చల్లా చల్లని గాలుల్లో సాయం సమయంలో

పెద్దరికం - 1992
ప్రియతమా .. ప్రియతమా
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బులపల్లకి తేవలేనే
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ

చినరాయుడు- 1992
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
స్వాతిముత్యమాల ఒళ్ళు తాకి తుళ్ళిపోయింది

సీతారత్నం గారి అబ్బాయి 
మేఘమా మరువకే 

సూరిగాడు 1992
ఒకే ఒక ఆశ అదే నా శ్వాస

ఆమె - 1994
ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు

పెదరాయుడు
బావవి నువ్వు భామని నేను

రాజేంద్రుడు గజేంద్రుడు - 1993
కు కు కూ కు కు కూ కు కు కూ ఎవరో నీవని అనకు

మాయలోడు - 1993
చలాకి చిలిపి వయసులో ఓహోయ్ 


తొలిముద్దు - 1993
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
తొలిముద్దు తొలిముద్దు తొలిప్రేమ సరిహద్దు

అల్లరి ప్రియుడు- 1993
చెప్పకనే చెబుతున్నది ఇదే ఇదే ప్రేమని

హలో బ్రదర్ - 1994
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా 

అబ్బాయిగారు - 1994
కూసింది కోయిలమ్మ కుకు కుకు .. కుకు కుకు కుకు

సంకల్పం - 1995
ధీంతనక్కు తాళం అలనాటి జ్ఞాపకం


ఆయనకి ఇద్దరు - 1995
మధుమాసపు మన్మధ రాగమా

ముత్తు- 1995
తిలానా తిలానా నా కసి కళ్ళ కూనా
ఒకడే ఒక్కడు మొనగాడు

భారతీయుడు - 1996
పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగిపోయిందే చిన్నమ్మా
మాయా మశ్చీంద్రా మచ్చని చూడ వచ్చావా
టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా

సోగ్గాడి పెళ్ళాం - 1996
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా

దొంగాట- 1996
ఓ చిలకా రా చిలకా నీ కలలే పండెనుగా

ప్రేమలేఖ- 1996
నీ పిలుపే ప్రేమగీతం నీ పలుకే ప్రేమవేదం
ఎరుపు లోలాకు కులికెను కులికెను

ఒక చిన్న మాట- 1997
ఓ మనసా తొందర పడకే
ఎవరిని చూస్తు ఉన్నా నువ్వు కనిపిస్తే ఎలా..?
ప్రతి ఒకరికి తొలి వలపున ఇంతేనా

పెళ్ళిపందిరి- 1997
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్

చిన్నబ్బాయ్ - 1997
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే

ప్రియా ఓ ప్రియా - 1997
కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమి శ్రీకారం 
 
తొలిప్రేమ - 1998
ఈ మనసే సే సే సే సే సే సే
ఏమి సోదరా మనసుకు ఏమయిందిరా

జోడి- 1999
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
నను ప్రేమించానను మాట కలనైన చెప్పేయ్ నేస్తం

స్వయంవరం - 1999
మరల తెలుపనా ప్రియ..మరల తెలుపనా
కీరవాణి  రాగంలో పిలిచిందొక హృదయం
పికాసో చిత్రమా .. ఎల్లోరా శిల్పమా

చెలి - 2001
మనోహరా నా హృదయమునే 
హే వెన్నెల సోనా నిను చేరగ రానా 
ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో 
వర్షించే మేఘంలా నేనున్నా

నువ్వు నాకు నచ్చావ్ - 2001
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తార

రన్ - 2002
మౌనాలు ఏలనే ప్రేయసీ

రోజాపూలు- 2002
ముచ్చటగా ముచ్చటగా మురిపించే విరులారా
ముద్దు ముద్దు రోజావే ముద్దులొలుకు రోజావే
యాపిల్ పిల్లా నీవెవరో ఐస్‌క్రీం చెలియా నీవెవరో

మిస్సమ్మ - 2003
నే పాడితే లోకమే పాడదా

విలన్ - 2003
నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవా

ఒరేయ్ పండు - 2005
 రాలేవా రాలేవా ఒక్కసారి రాలేవా

 బంగారం - 2006
ఎగిరే చిలకమ్మా నా రంగుల మొలకమ్మ

శివాజీ - 2007
సహానా శ్వాసే వీచెనో 

వీడొక్కడే- 2009
కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ నువ్వే నువ్వే 

రోబో - 2010

కిలిమంజారో భళ భళిమంజారో 



Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.