.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

29, సెప్టెంబర్ 2020, మంగళవారం

కు కు కు .. కు కు కు.. కోకిల రావేకు కు కు..కు కు కు..  కోకిల రావే కు కు కు కు కూ కు కు కు కూ కూ 
కు కు కు కు కూ కు కు కు కూ కూ కోకిల రావే 
కు కు కు కు కు కూ కోకిల రావే 
రాణివాసము నీకు ఎందుకో రెక్క విప్పుకో చుక్కలందుకో 

రంగుల లోకం పిలిచే వేళ 
రాగం నీలో పలికే వేళ 
విరుల తెరలే తెరచి రావే 
బిడియం విడిచి నడచీ రావే 

నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో 
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో 
స్వరమై రావే విరి పొదల ఎదలకు 

కు కు కు కు కూ కు కు కు కూ కూ 
కు కు కు కు కూ కు కు కు కూ కూ కోకిల రావే 
కు కు కు కు కు కూ కోకిల రావే 

సూర్యుడు నిన్నే చూడాలంట 
చంద్రుడు నీతో ఆడాలంతా 
బురుజు బిరుదు విడిచి రావే 
గడప తలుపు దాటి రావే 

నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో 
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో 
లయగా రావే ప్రియ హృదయ జతులకు


చిత్రం - సితార (1983)
సంగీతం - ఇళయరాజ
గీతరచన - వేటూరి
 
గానం - S.P. బాలసుబ్రమణ్యం

27, సెప్టెంబర్ 2020, ఆదివారం

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైది ఎన్నాళ్ళయినా ... అభిమానుల గుండెల్లో పాట రూపంలో ఎప్పటికి చెదరని స్థానాన్ని పొందిన S.P. బాలు గారి మధురగీతాలు నా సంగీతప్రపంచంలో 


జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై 

<>
 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై 

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ 
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ 
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా

ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా 
ఊహల్లో తేలి ఉర్రూతలూగి మేఘాలతోటి రాగాల లేఖ 
నీకంపినాను రావా దేవి

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైది ఎన్నాళ్ళయినా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది 
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా

ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే 
దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే 
నాదన్నదంతా నీవే నీవే

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... వేచాను నీ రాకకై


చిత్రం - మంచి మనసులు (1985)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన  - వేటూరి 
గానం - S.P.  బాలు

23, సెప్టెంబర్ 2020, బుధవారం

19, సెప్టెంబర్ 2020, శనివారం

చేస్తారా లవ్రోజుకొక్క రోజా తెచ్చి పూటకొక్క షాపుకొచ్చి
గంటకొక్క లక్ష పోసి 5 స్టార్ లైఫ్ ఇస్తేరోజుకొక్క రోజా తెచ్చి పూటకొక్క షాపుకొచ్చి
గంటకొక్క లక్ష పోసి 5 స్టార్ లైఫ్ ఇస్తే
చేస్తారా లవ్  చేస్తారా లవ్
చేస్తారా లవ్  చేస్తారా లవ్

రోజు రోజు రోజాలొద్దు ముప్పూట షాపులొద్దు
గంటకొక్క లక్ష వద్దు 5 స్టార్ లైఫ్ బోరు
తియ్యనైన మాట చెప్పవోయ్
తియ్యనైన మాట చెప్పవోయ్

సల్మాన్లా సెక్సీగుండి బచ్చన్లా బారుగుండి
సచ్చిన్లా సిక్స్ కొట్టి టైసన్లా మజిల్స్ ఉంటే
చేస్తారా లవ్ చేస్తారా లవ్
చేస్తారా లవ్ చేస్తారా లవ్

సల్మాన్ లాంటి హీరోలొద్దు బారుగున్న బచ్చన్లొద్దు
ఫోరులొద్దు సిక్సులొద్దు నల్లరాతి కండలొద్దు
గుండె తాకు చూపే చాలునోయ్
గుండె తాకు చూపే చాలునోయ్

గుండు గీసి గుండీ విప్పి
బ్లడ్ తీసి బొట్టే పెట్టి రఫ్ కట్ ఫేస్ తోటి
అడుగు అడుగు వెంట వస్తే
చేస్తారా లవ్ చేస్తారా లవ్
చేస్తారా లవ్ చేస్తారా లవ్

గుండు ఉన్న గూండాలొద్దు
 బ్లడ్ చూపే సైకోలొద్దు
రఫ్ కట్ రాంగు బాసు ఊరకుక్కల్ వెంట వద్దు
చందమామ చందం నచ్చునోయ్
 చందమామ చందం నచ్చునోయ్

హీరోలంటే ఏంటి మీకు చెప్పి చావవొచ్చు మాకు
ఎందుకింత పాడు లొల్లి సింగిల్ హింట్ ఇచ్చి చూడు
చూపిస్తాం లవ్ చూపిస్తాం లవ్
 చూపిస్తాం లవ్ చూపిస్తాం లవ్

వట్టి మాటల్ కట్టి పెట్టు ఉన్నదాన్ని పదును పెట్టు
సొంత సొత్తు కొంచెం చూపు
టైమింగ్ చూసి లవ్ చెప్పు
పెళ్లి కార్డు మాకు పంపరో
 పెళ్లి కార్డు మాకు పంపరో
 

చిత్రం - వెన్నెల (2005)  

సంగీతం - మహెష్ శంకర్   
గీతరచన - దేవా కట్ట   
గానం - రవివర్మ , దేవాకౌశిక్

17, సెప్టెంబర్ 2020, గురువారం

ప్రేయసి కావు నేస్తం కావుప్రేయసి కావు నేస్తం కావు
గుండెల్లో నిండున్నావు గుప్పెట్లో దాగున్నావుప్రేయసి కావు నేస్తం కావు
గుండెల్లో నిండున్నావు గుప్పెట్లో దాగున్నావు
చీకట్లో వెలుగిస్తావు జగమంతా కనిపిస్తావు
పండుగ నీవు నా పచ్చిక నీవు
పండుగ నీవు నా పచ్చిక నీవు

మోహమే మంటగా రగులుతున్నా
లోకమే నీవుగా మునిగి పోతున్నా
గాలిలో ఈకలా తేలుతున్నా
నీటిలో రాతలా చెదిరిఉన్నా

నీ శ్వాస కోసం మానై ఉంటా
నీ మాట కోసం మునినైపోతా
నీ చూపు కోసం శిలనై ఉంటా
నీ నవ్వు కోసం అలుసైపోతా

జాబిలికే వెన్నెల నీవు సూర్యునికే వేకువ నీవు
ఊపిరిలో ఉష్ణం నీవు ఊరించే తృష్ణం నీవు
శూన్యం నీవు నా శోకం నీవు
శూన్యం నీవు నా శోకం నీవు

వేసవి వర్షమై కురిసిపోవా
వెచ్చని వేకువై వెలిగిరావా
మాటతో రూపమై తరలిరావా
నిర్ణయం చెప్పీ నన్నాదుకోవా

నీ తోడు కోసం ఆవిరైపోనా
నీ స్పర్శ కోసం చినుకైరానా
నీ అడుగు తాకి గుడినైపోనా
నీ గుండెలోకి సడినై రానా

నీలానికి నింగివి నీవు కాలానికి గమ్యం నీవు
చలనానికి శక్తివి నీవు భావానికి మూలం నీవు
 
ఎవ్వరికోసం జాబిలి వేషం
కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం
ఎవ్వరికోసం జాబిలి వేషం
కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం


చిత్రం - వెన్నెల(2005)
సంగీతం - మహేష్ శంకర్ 
గీతరచన - దేవా కట్టా 
గానం - సుదీప్, సైన్ధవి,రజని,దేవన్ 

15, సెప్టెంబర్ 2020, మంగళవారం

శివంగివే శివంగివే తలవంచే మగ జాతి నీకేశివంగివే శివంగివే .. తలవంచే మగ జాతి నీకే
నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదామానినీ... మానినీ..

అడుగులే ఝుళిపించు పిడుగులై ఒళ్ళు విరుచుకో
విను వీధి దారిన మెరుపుల
భూమినే బంతాడు కాలమే
మీదే ఇక పై లోకం వీక్షించేనిక మగువల వీరంగం

శివంగివే శివంగివే .. తలవంచే మగ జాతి నీకే  
నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా
రారా రాణీ కానీ కానీ నీ హాసం లాసం వేషం రోషం
గర్వించేలా దేశమే ఏరై పారే తీరై ఏరి పారెయ్ తీరాలన్నీ 
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక 
కోరే భవితకి బాట వేయి 

జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి  
శివంగివే శివంగివే .. తలవంచే మగ జాతి నీకే

నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా
ఏరై పారే తీరై ఏరి పారెయ్ తీరాలన్నీ
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక 
కోరే భవితకి బాట వేయి
జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి

నువ్వీపని చేయ్యాలంటూ నిర్దేశిస్తే నమ్మద్దు
నీ పైన జాలే చూపే గుంపే నీకు అసలొద్దు
ఊరే నిను వేరె చేసి వెలివేస్తున్నా ఆగద్దు
నీలోనీ విద్వత్తెంతో చూపియ్యాలి యావత్తు

లోకం నిను వేధించి బాధిస్తున్నా పోనీవే
ప్రసవాన్ని ఛేదించి సాధించే అగ్గిమొగ్గవే

కదిలి రా భువిని ఏలగా ఎగసి రా
అగ్గిమొగ్గవే కదిలి రా నీ సరదా కలల్ని కందాం రా
ఏ పరదాలైనా తీద్దం రా 

ఏరై పారే తీరై   ఏరి పారెయ్ తీరాలన్నీ
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకి బాట వేయి 
జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి

ఎదే గాయాలు దాటే సమయం ఇదే
నీ బాధే మారె గాధలా
నీ భారం నీవే మోయాలమ్మా
విజయాల ఆశయమే
తరుణోదయమై కాంతి నిండగా
తరుణోదయమై కాంతి నిండగా

శివంగివే శివంగివే తలవంచే మగ జాతి నీకే
నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా
రారా రాణీ కానీ కానీ

నీ హాసం లాసం వేషం రోషం గర్వించేలా దేశమే
ఏరై పారే తీరై  ఏరి పారెయ్ తీరాలన్నీ 
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకి బాట వేయి

జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
నీ భయముకి నీ భయముకి బదులునీయి  
 

చిత్రం - విజిల్ (2019)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన -  - రాకేందు మౌళి
గానం - ఏ.ఆర్.రెహమాన్, శరత్ సంతోష్
షషా తిరుపతి

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

నా ప్రియమౌ ప్రియమౌ బాటరివేనా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే అసలేం తరగొద్దేనా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే అసలేం తరగొద్దే

యంతర లోకపు సుందరివే
అంకెల కవితలు సెండుదువే
ఇంజన్ నీ అల్లి చిందుదువే
హే.. నా వైఫై వైఫే నువ్వే

రక్తంలేని చెక్కిళ్ళకి ముద్దు పెట్టేస్తా
పొద్దు పొద్దు జావా రోజా పూయించి ఇస్తా
శుద్ది చేసి డేటా విందు వడ్డిస్తా ఇట్టా
హే.. నీ బస్ కి కండక్టర్ నే

నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే అసలేం తరగొద్దే

యంతర లోకపు సుందరివే
అంకెల కవితలు సెండుదువే
ఇంజన్ నీ అల్లి చిందుదువే
హే.. నా  వైఫై  వైఫే నువ్వే

నా సెన్సరుకి భావం నువ్వేనే
నా కేబుల్లల్లో జీవం నువ్వేనే
నా ప్రతి సెల్లో చల్లావు మైకాన్నే
నా న్యూరాన్లలో నింపావు వెన్నెల్నే

నా పాస్వర్డ్ నువ్వే నా లాగిన్ వే
హే యంత్రాలల్లో నువ్వొక రజనీవే
హహహహహ .. కరిగే కరిగే ఇనప్పువ్వా
నేడే కరిగి ఒకటై ఉందామా

ఆల్ఫా నా ఆల్ఫా నీవే ఇకా
మేగా ఒమేగా నీవే ఇకా
లవ్యూ ఫ్రమ్ జీరో టు ఈ..న్ఫీ..నిటీ

నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే అసలేం తరగొద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే

యంతర లోకపు సుందరివే
అంకెల కవితలు సెండుదువే
ఇంజన్ నీ అల్లి చిందుదువే
హే.. నా వైఫై వైఫే నువ్వే

రక్తంలేని చెక్కిళ్ళకి ముద్దు పెట్టేస్తా
పొద్దు పొద్దు జావా రోజా పూయించి ఇస్తా
శుద్ది చేసి డేటా విందు వడ్డిస్తా ఇట్టా
హే.. నీ బస్ కి కండక్టర్ నే

నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే అసలేం తరగొద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే అసలేం తరగొద్దే


చిత్రం  - రోబో 2.0 (2018)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన -  - అనంత శ్రీరామ్ 
గానం - సిద్ శ్రీరాం, షషా తిరుపతి

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లాఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళాఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా
ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా

మన మాటలింక చినుకవక
మనసు తడిసి మొలకవకుండ
నన్నె వీడి పొరాదే .. నన్నె వీడి పొరాదే
మన మాటలింక చినుకవక
మనసు తడిసి మొలకవకుండ
మెరుపల్లె నువ్వు పొతె మసకల్లే నేనుంటా

ఇంకా కొంచెం సేపుకూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా

కనపడని వలే వేసి హృదయమునే ఒడిసి పట్టి
ఒడిసి పట్టి… ఒడిసి పట్టావే
వినపడని ఈలె వేసి పరువమునే హడలు గొట్టి
హడలు గొట్టీ .. హడలు గొట్టావే 

ఇటు రావా రావా రావా అలలాగ వచ్చి పో వా
వచ్చి నీ చేతిని చుట్టెయనా చిట్టి గాజు లాగా
అరే ఆలస్యాలే అమృతం అలవాటు చేసుకో  సహనం
ఆ అమృతం ఏదొ చేదంటా నీ మాటలే మధురం

ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వు
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు నీకు
ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వూ
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు నీకు
 
కడదాక కడలిలోని నీరల్లె నిలుచుంటా 
నీకొసమే .. నీ కొసమేలే
నా చెంపల్లోన  ఎరుపయే ఎరుపయే
నీకది ఎరుకనీ  బెరుకయ్యే 

ఉప్పు గాలుల్లోన ఎగసెనే 
కుప్పల తెప్పల తీయదనం
కప్పుకుందాం కప్పుకుందాం వడగాలి వెచ్చదనం 

నీ మేను చేప వాసన
నిన్ను పట్టుకుంటె ఫూల పరిమళం
ఈ రేయంతా మాట్లాడు మాటల్తో వేటాడు

ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా

నువ్వే రెప్పవి నా కంటి పాపకి
నువ్వు  తండ్రివి నా చంటి పాపలకి
అలలాగా మన పాపలు ఆడి పాడుకొవాలే
నీ మాటలన్ని నిజమై ఇక నువ్వు నేను మనమై
మన తనివి తీరా మునుగుదాం మది సంధ్రమే


చిత్రం - మరియన్ (2015)
సంగీతం  - A.R. రెహమాన్
గీతరచన - చంద్రబోస్
గానం - విజయ్ ప్రకాష్, సునీత 
 

9, సెప్టెంబర్ 2020, బుధవారం

చిటికెలు వినవే బేబీ ..హంసరో .. మ్యారీ మీ మ్యారీ మీ హంసరో
ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరోచిటికెలు వినవే బేబీ .. కిలకిలమనవే బేబీ

అకటా ఏమననే నిను చూసి కాస్త మతిచెడెనే
జాలైనా చూపలేవా బింకమా బిడియమా
ఓ లలనా నీ వలన పిచ్చిపట్టి ఇలా తిరుగుతున్నా
ఈ నేరం నీదేనంటే నిందిస్తున్నాననుకున్నావా

హంసరో .. మ్యారీ మీ మ్యారీ మీ హంసరో
ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరో
ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ
హంసరో ఓహ్ హంసరో
హంసరో ఓహ్ హంసరో

హంసరో .. మ్యారీ మీ మ్యారీ మీ హంసరో
ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో .. సిద్ధంగా నేను ఉన్నా బీ రెఢీ
హంసరో  ఓహ్ హంసరో

ఆశకొద్దే అడిగానే అనుకోవే ఆ టెక్కెందుకే
పిడివాదం మాని పోనీలే అంటే పోయిందేముందే
వెతకగనే కలిసొచ్చే వేళ పిలిచిందే బాలా 
సందేహించాలా మరుగెందుకే
తగువేలనీ తెరదాటనీ దరిచేరనీ .. నీ నీ నీ నీ నీ

హంసరో .. మ్యారీ మీ మ్యారీ మీ హంసరో
ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరో
ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ
హంసరో ఓహ్ హంసరో
హంసరో ఓహ్ హంసరో


చిత్రం - చెలియా (2017)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన -  - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం - అర్జున్, హరిచరణ్, జొనిత

7, సెప్టెంబర్ 2020, సోమవారం

మైమరుపా మెరుపా మెరుపామైమరుపా మెరుపా మెరుపా
 నిన్నిలా నడిపిందెవరో తెలుసామైమరుపా మెరుపా మెరుపా
మైమరుపా మెరుపా మెరుపా
మైమరుపా మైమరుపా
మైమరుపా మైమరుపా
మైమరుపా మెరుపా

నిన్నిలా నడిపిందెవరో తెలుసా
ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకునే వన్నెలా వలనే కనవా

సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
 ఏ మంచు ఆమనిలో కుహుహూ అనవా

మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరో తెలుసా
ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకునే వన్నెలా వలనే కనవా

నీతో కలిసి వేసే అడుగు
ఏ తోవంటు తననే అడుగు
తరిమే చొరవా ఏమంటుందో
కొండా కోనల్లో ఆపదుగా తన పరుగు
వెలుగే వెలివేసావనుకో
ఇది కల కాదు ఏ వేళా నీకు

మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరో తెలుసా
ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకునే వన్నెలా వలనే కనవా

సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
 

చిత్రం - చెలియా (2017)
సంగీతం - A.R రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - షషా తిరుపతి


5, సెప్టెంబర్ 2020, శనివారం

ఆశ ఆగనందే నిన్ను చూడకుంటేఆశ ఆగనందే నిన్ను చూడకుంటే
శ్వాస ఆడనందే అంత దూరముంటేఆశ ఆగనందే నిన్ను చూడకుంటే
శ్వాస ఆడనందే అంత దూరముంటే
నన్నే మల్లెతీగలా నువ్వూ అల్లకుంటే
నిలువెత్తు ప్రాణం నిలవదటే

అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా చిట్టి చిలకా జట్టై అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
ఏమంత అలకా చాల్లే అల్లేయ్

నిను వెతికే నా కేకలకు మౌనమె బదులైందే
మౌనములోని మాటిదని మనసె పోల్చుకుందే
లాలన చేసే వీలే లేని పంతం వదిలి పలకవటే

అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
పుప్పొడి తునకా గాలై అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
పన్నీటి చినుకా జల్లై అల్లేయ్

ముడి పడిపోయాం ఒక్కటిగా విడివడీ పోలేకా
కాదనుకున్నా తప్పదుగా వాదనా దేనికికా
పదునుగ నాటే మన్మథ బాణం
నేరం ఏమి కాదు కదే

అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా జత గువ్వా జట్టై అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా చిరునవ్వా జల్లై అల్లేయ్ 


చిత్రం - చెలియా (2017)
సంగీతం - A.R.రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి
 గానం - అభయ్ జోద్పూర్కర్, చిన్మయి

3, సెప్టెంబర్ 2020, గురువారం

కులుకులే చెలి నడకలుగాకులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని  తడబడు పరువం నిమిరిన వయసు ఇదికులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని  తడబడు పరువం నిమిరిన వయసు ఇది
కొసరే  విరహం ముసిరే సమయం అడిగెను వలపు వరం 
పిలిచే ప్రణయం తొలిచే హృదయం మదనుడి విరుల శరం 

అదిరిన చెలి అధరం .. కుదిరిన జత మధురం 
హిమగిరి శిఖరములో సెగలై రగిలే వగల జ్వరం 

కులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని తడబడు పరువం నిమిరిన వయసు ఇది

పొంగే ప్రాయం చేసే మాయా జాలం 
పులకింతేదో కోరిందమ్మా కొత్తగా 
చనువిచ్చే మోజులకి చెంతకొచ్చి స్వప్నమల్లె మెదిలీ 
 

అప్పుడే ముద్దు అప్పు ఇమ్మంది 
కౌగిలింత దుప్పటైనది

కులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని  తడబడు పరువం నిమిరిన వయసు ఇది
కొసరే  విరహం ముసిరే సమయం అడిగెను వలపు వరం 
పిలిచే ప్రణయం తొలిచే హృదయం మదనుడి విరుల శరం 

అదిరిన చెలి అధరం .. కుదిరిన జత మధురం 
హిమగిరి శిఖరములో సెగలై రగిలే వగల జ్వరం 

చలి కాగాలా వెన్నెల్లోనా ఈడు 
తొలి కౌగిలిని వేడిందమ్మా వేడిగా 
విచ్చే ఎదలో మొహం వెచ్చనైన ఇచ్ఛకాలు తెలిపి 
సుందర నేపాల్ నగరం మోజు తీరా నిన్ను నన్ను కలిపే 

స్వర్గమీ రాగం సొంతమే బంధం 
సుందరం ప్రేమ సంగమం

కులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని  తడబడు పరువం నిమిరిన వయసు ఇది
కొసరే  విరహం ముసిరే సమయం అడిగెను వలపు వరం 
పిలిచే ప్రణయం తొలిచే హృదయం మదనుడి విరుల శరం 

అదిరిన చెలి అధరం .. కుదిరిన జత మధురం 
హిమగిరి శిఖరములో సెగలై రగిలే వగల జ్వరం 


చిత్రం - యోధ  (1992)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - 
గానం - S.P. బాలు, S.P. శైలజ

1, సెప్టెంబర్ 2020, మంగళవారం

మతమేల గతమేల మనసున్ననాడుమతమేల గతమేల మనసున్ననాడు
హితమేదొ తెలియాలి మనిషైనవాడు
 


మతమేల గతమేల మనసున్ననాడు
హితమేదొ తెలియాలి మనిషైనవాడు
నీ దేశమే పూవనం .. పూవై వికసించనీ జీవితం

కన్నీట కడగాలి కులమన్న పాపం
మన రక్త సింధూర వర్ణాలు అరుణం
గాయాల నీ తల్లికీ కన్నా జోలాలి  పాడాలిరా

సరిహద్దులే దాటు ఆ గాలిలా
ప్రసరించనీ  ప్రేమనే  హాయిగా
నదులన్ని కలిసేది కడలింటిలో
తారల్లు మెరిసేది గగనాలలో

కలలోకి  జారేను ఈ రాత్రులే
వెలిగించి నవ్యోదయం 

మతమేల గతమేల మనసున్ననాడు
హితమేదొ తెలియాలి మనిషైనవాడు
నీ దేశమే పూవనం .. పూవై వికసించనీ జీవితం

తల ఎత్తి నిలవాలి నీ దేశమూ
ఇల మీద నీ స్వర్గమై
భయమన్నదే లేని భవితవ్యమూ
సాధించరా సంఘమై

ఒక మాట ఒక బాట ఒక ప్రాణమై
సాగాలిరా ఏకమై

మతమేల గతమేల మనసున్ననాడు
హితమేదొ తెలియాలి మనిషైనవాడు
నీ దేశమే పూవనం .. పూవై వికసించనీ జీవితం


 చిత్రం - బొంబాయి (1995)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - వేటూరి 
గానం - సుజాతా మోహన్ 
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.