.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

15, సెప్టెంబర్ 2020, మంగళవారం

శివంగివే శివంగివే తలవంచే మగ జాతి నీకే



శివంగివే శివంగివే .. తలవంచే మగ జాతి నీకే
నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా



మానినీ... మానినీ..

అడుగులే ఝుళిపించు పిడుగులై ఒళ్ళు విరుచుకో
విను వీధి దారిన మెరుపుల
భూమినే బంతాడు కాలమే
మీదే ఇక పై లోకం వీక్షించేనిక మగువల వీరంగం

శివంగివే శివంగివే .. తలవంచే మగ జాతి నీకే  
నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా
రారా రాణీ కానీ కానీ నీ హాసం లాసం వేషం రోషం
గర్వించేలా దేశమే ఏరై పారే తీరై ఏరి పారెయ్ తీరాలన్నీ 
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక 
కోరే భవితకి బాట వేయి 

జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి  
శివంగివే శివంగివే .. తలవంచే మగ జాతి నీకే

నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా
ఏరై పారే తీరై ఏరి పారెయ్ తీరాలన్నీ
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక 
కోరే భవితకి బాట వేయి
జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి

నువ్వీపని చేయ్యాలంటూ నిర్దేశిస్తే నమ్మద్దు
నీ పైన జాలే చూపే గుంపే నీకు అసలొద్దు
ఊరే నిను వేరె చేసి వెలివేస్తున్నా ఆగద్దు
నీలోనీ విద్వత్తెంతో చూపియ్యాలి యావత్తు

లోకం నిను వేధించి బాధిస్తున్నా పోనీవే
ప్రసవాన్ని ఛేదించి సాధించే అగ్గిమొగ్గవే

కదిలి రా భువిని ఏలగా ఎగసి రా
అగ్గిమొగ్గవే కదిలి రా నీ సరదా కలల్ని కందాం రా
ఏ పరదాలైనా తీద్దం రా 

ఏరై పారే తీరై   ఏరి పారెయ్ తీరాలన్నీ
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకి బాట వేయి 
జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి

ఎదే గాయాలు దాటే సమయం ఇదే
నీ బాధే మారె గాధలా
నీ భారం నీవే మోయాలమ్మా
విజయాల ఆశయమే
తరుణోదయమై కాంతి నిండగా
తరుణోదయమై కాంతి నిండగా

శివంగివే శివంగివే తలవంచే మగ జాతి నీకే
నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా
రారా రాణీ కానీ కానీ

నీ హాసం లాసం వేషం రోషం గర్వించేలా దేశమే
ఏరై పారే తీరై  ఏరి పారెయ్ తీరాలన్నీ 
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకి బాట వేయి

జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
నీ భయముకి నీ భయముకి బదులునీయి  
 

చిత్రం - విజిల్ (2019)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన -  - రాకేందు మౌళి
గానం - ఏ.ఆర్.రెహమాన్, శరత్ సంతోష్
షషా తిరుపతి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.