కులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని తడబడు పరువం నిమిరిన వయసు ఇది
కొసరే విరహం ముసిరే సమయం అడిగెను వలపు వరం
పిలిచే ప్రణయం తొలిచే హృదయం మదనుడి విరుల శరం
అదిరిన చెలి అధరం .. కుదిరిన జత మధురం
హిమగిరి శిఖరములో సెగలై రగిలే వగల జ్వరం
కులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని తడబడు పరువం నిమిరిన వయసు ఇది
పొంగే ప్రాయం చేసే మాయా జాలం
పులకింతేదో కోరిందమ్మా కొత్తగా
చనువిచ్చే మోజులకి చెంతకొచ్చి స్వప్నమల్లె మెదిలీ
అప్పుడే ముద్దు అప్పు ఇమ్మంది
కౌగిలింత దుప్పటైనది
కులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని తడబడు పరువం నిమిరిన వయసు ఇది
కొసరే విరహం ముసిరే సమయం అడిగెను వలపు వరం
పిలిచే ప్రణయం తొలిచే హృదయం మదనుడి విరుల శరం
అదిరిన చెలి అధరం .. కుదిరిన జత మధురం
హిమగిరి శిఖరములో సెగలై రగిలే వగల జ్వరం
చలి కాగాలా వెన్నెల్లోనా ఈడు
తొలి కౌగిలిని వేడిందమ్మా వేడిగా
విచ్చే ఎదలో మొహం వెచ్చనైన ఇచ్ఛకాలు తెలిపి
సుందర నేపాల్ నగరం మోజు తీరా నిన్ను నన్ను కలిపే
స్వర్గమీ రాగం సొంతమే బంధం
సుందరం ప్రేమ సంగమం
కులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని తడబడు పరువం నిమిరిన వయసు ఇది
కొసరే విరహం ముసిరే సమయం అడిగెను వలపు వరం
పిలిచే ప్రణయం తొలిచే హృదయం మదనుడి విరుల శరం
అదిరిన చెలి అధరం .. కుదిరిన జత మధురం
హిమగిరి శిఖరములో సెగలై రగిలే వగల జ్వరం
చిత్రం - యోధ (1992)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన -
గానం - S.P. బాలు, S.P. శైలజ
గీతరచన -
గానం - S.P. బాలు, S.P. శైలజ
రిప్లయితొలగించండికులుకుల్ చెలినడకలుగా
పలువిధముల నాట్యమాడె వయసు పరువమై
పిలిచె మదనుడి విరుల శర
ములు గురియ నధరపు శిఖరమునకై నెగడై !