జీవితంలో సంఘటనలన్నీ ఒక దాని వెంట మరొకటి మనిషి ప్రమేయం లేకుండా జరిగిపోతూనే వుంటాయి,అలాగే జరగాల్సినవి ముందే రాసి పెట్టి ఉంటాయని కూడా తెలుసు...కానీ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు,ఆశలు,ఆశయాలు ఆలోచనలు,ఆందోళనలతో ప్రతి మనిషి సతమతమవుతూనే వుంటాడు...
మనిషి జీవితంతో కాలం,విధి ఆడే ఆటను దొంగాటతో పోల్చుతూ జరగాల్సినవి ముందే రాసిపెట్టి వున్నా కాలం తో పందెం వేసి మన ప్రయత్నం మనం చేసి గెలవడమా లేక పోరాడి ఓడటమా అనేది మనిషి కర్తవ్యం అని "సిరివెన్నెల సీతారామశాస్త్రి" గారు రాసిన ఈ పాట "దొంగాట" సినిమాలోది.జగపతిబాబు,సౌందర్య నటించిన ఈ సినిమా నాకు చాలా నచ్చుతుంది..ముఖ్యంగా ఈ పాట నాకు చాలా ఇష్టం..
స్వప్నాల వెంట స్వర్గాల వేట
తుదిలేని దోబూచులాట
తుదిలేని దోబూచులాట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి