.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, మే 2020, ఆదివారం

ముదినేపల్లి మడిచేలో



ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా



ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా

బుట్ట మీద బుట్టపెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి
వాగల్లే నడిచావే
నీ బుట్టలోన పువ్వులన్నీ గుట్టులన్నీ రట్టుచేసి
నన్నీడ పిలిచేనే

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
పల్లి పల్లి ముదినేపల్లి .. పల్లి పల్లి ముదినేపల్లి

కాటుక కళ్ల వాడల్లో కట్టుకుంటా గుడిసెంటా
పసుపుతాడు పడకుండా ఆగడాలే వద్దంటా
చింతపల్లి చిన్నోణ్ని చూడు నీకు వరసంటా
వరస కాదు నాకంట మనసు ఉంటే చాలంటా

పగలు రేయి .. నీతో ఉంటా
ఉన్నావంటే .. అది తప్పంట
కలిసి వస్తే ఎన్నెలమాసం చెయ్యాలి జాగారం

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా

బుట్టమీద బుట్టపెట్టి నేను పువ్వులమ్ముతుంటే
కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు
గాలాలే యేస్తావే

తమలపాకు తడిలోనా  పండెనే నీ నోరంటా
నోటి పంట కాదంటా  పాడిపంట చూడంటా
నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట
ఆశపడిన మావయ్యది అందమైన మనసంట

అందం చందం .. నీకే సొంతం
ఎన్నెల్లోనే .. యేస్తా మంచం
పైరగాలుల పందిరిలోన కరిగిపోదాం మనం

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా

బుట్టమీద బుట్టపెట్టి నేను పువ్వులమ్ముతుంటే
కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు
గాలాలే యేస్తావే


 చిత్రం - జెంటిల్‌మెన్ (1993)
సంగీతం  - ఎ.ఆర్.రెహమాన్
గీతరచన - రాజశ్రీ
గానం - సాహుల్ హమీద్,స్వర్ణలత

29, మే 2020, శుక్రవారం

సీతాలు నువ్వు లేక నేను లేనే



సీతాలు నువ్వు లేక నేను లేనే
ఉన్నావే ఊపిరల్లె  గుండెలోనే






సీతాలు నువ్వు లేక నేను లేనే
ఉన్నావే ఊపిరల్లె  గుండెలోనే
ఎళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే
ఆ కబురూ చేరే లోగా చేరు నన్నే
సీతాలూ నువ్వు లేక నేను లేనే

సందేపొద్దు ముద్దరాలు జాజిపూలు కోయు వేళా
పూలు కోయలేదె మనసే కోసెనంట
పెళ్ళి చీరా పసుపు నీటా పిండారవేయు వేళ
మనసు పడిన వాడి మనసే పిండెనంట

గడ్డివాము చాటులోన బాస చేసి కూడా పోయేవే
పోయేవు పోయేవులే ప్రేమ తీసి గట్టు నెట్టి
నీ చీర చెంగు లోనె కన్నీళ్ళు మూట గట్టి పోయేవే
పోయేవు పోయేవు లే కోరుకున్న తోడు వీడీ

ఇచ్చిన మల్లెలన్ని నట్టేట ఇసిరేసి
నన్ను కన్నీటి వాగులోన అల చేసి

ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట
మాటలు కావవి నీటి పైన రాతలంట
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట
మాటలు కావవి నీటి పైన రాతలంట


సీతాలు నువ్వు లేక నేను లేనే
ఉన్నావే ఊపిరల్లే గుండెలోనే
ఎళ్ళిపోతే చేరుకుంట మట్టిలోనే
ఆ కబురు చేరే లోగా చేరు నన్నే
సీతాలు నువ్వు లేక నేను లేనే

బొట్టునీకు పెట్టినా వేలి రంగు ఆరలేదే
పూసుకున్న చందనాల వాసనింకా తగ్గలేదే
గాజువాకలోన కొన్న గాజులింక వెయ్యలేదే
పెళ్ళి పంచెకంటుకున్న పసుపు వన్నె మాయలేదే

కళ్యాణ బుగ్గ చుక్క కళ్ళార చూసేది ఎప్పుడమ్మా
మల్లెల పక్కమిద బంతులాట ఎప్పుడమ్మ
నీ కంటి కొనసూపు కొసరి రువ్వేది ఎప్పుడమ్మ
సీకటి ఎలుగులోన సిందులాట ఎప్పుడమ్మ

ఎలమావి తోటలోనా ఏకాకి గోరువంక
శృతి మారి కూసేనమ్మ జతకోసం వేచేనమ్మ

ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట
మాటలు కావవి నీటి పైన రాతలంట
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట
మాటలు కావవి నీటి పైన రాతలంట

సీతాలు నువ్వు లేక నేను లేనే
ఉన్నావే ఊపిరల్లె  గుండెలోనే
ఎళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే
ఆ కబురు చేరే లోగా చేరు నన్నే
సీతాలు నువ్వు లేక నేను లేనే


చిత్రం - దొంగ దొంగ (1993)
సంగీతం -A.R రెహమాన్ 
 గీతరచన - రాజశ్రీ
గానం -  సాహుల్ హమీద్, కోరస్

27, మే 2020, బుధవారం

తీ తీ తీయని ..



తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులా ఈల వేసె పరువం



తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులా ఈల వేసె పరువం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం

సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగనీ
సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగనీ

ఉరికే నా కులుకే కొంటె తలపులు పలికెనులే
నా పాల వన్నెలే కన్నె వలపులు చిలికెనులే
సందేళ అందాల వంపులలో పరువము పంచేనా
నాజూకు నా చూపు చురకలలో చుక్కలను చూపేనా

సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని
సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని

తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులా ఈల వేసె పరువం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం

జతగా కలిసి జంట గువ్వలల్లె ఎగిరిపోదాం
గాలిలో తేలి నీలి గగనము ఏలుకుందాం

విను వీధి జాబిలితొ ఆడుకుందాం 
వెన్నెలను పంచుకుందాం
స్వర్గాల తీరాలు చేరుకుందాం 
తనువులు మరిచిపోదాం

సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని
సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని

తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులా ఈల వేసె పరువం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం 


చిత్రం - దొంగ దొంగ (1993)
సంగీతం -A.R. రెహమాన్
గీతరచన - రాజశ్రీ
గానం -సుజాతా మోహన్ 

25, మే 2020, సోమవారం

కొంచెం నీరు కొంచెం నిప్పు



కొంచెం  నీరు కొంచెం నిప్పు 
ఉన్నాయి నా మేనిలోన



కొంచెం  నీరు కొంచెం నిప్పు 
ఉన్నాయి నా మేనిలోన
కొంచెం గరళం కొంచెం అమృతం 
ఉన్నాయి నా కళ్ళల్లోన

కొంచెం నరకం కొంచెం స్వర్గం 
ఉన్నాయి నా గుండెలోనా  
చంద్రలేఖా .. ఆ .. ఆ.. చంద్రలేఖా 

కొంచెం  నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన

నా కలలో ఎవరో ఒచ్చే .. నా కనుల వెలుగై నిలిచే
ఓ స్వాతి చినుకై కురిసే 
అహ నా మదిలో మెరుపై మెరిసే

ఈ పెదవి విరి తేనె మడుగంట
అహ నా వగలే ధర లేని నగలంట
నేడు ఈ భూమికే నీ కోసం దిగివచ్చే ఈ తార
తోడుగ వస్తే మురిపాలు తీరేరా

కాలాలు అడిగేసే బంగారం ఈ వన్నె
నీ ఓర చూపుల్లో వరహాలే ఒలికెనే
నీ నవ్వుల పువ్వుల్లో ముత్యాలే దొరికెనే
ఊరించే వంపుల్లో హరివిల్లే విరిసేనే

కొంచెం  నీరు కొంచెం నిప్పు 
ఉన్నాయి నా మేనిలోన
కొంచెం గరళం కొంచెం అమృతం 
ఉన్నాయి నా కళ్ళల్లోన

కొంచెం నరకం కొంచెం స్వర్గం 
ఉన్నాయి నా గుండెలోనా 
 చంద్రలేఖా .. ఆ .. ఆ.. చంద్రలేఖా

మనసైన నీ వాడు వినువీధిన వస్తాడే
అందాలకు బహుమతిగా సిరివెన్నెలనిస్తాడే

కొంచెం  నీరు కొంచెం నిప్పు 
ఉన్నాయి నా మేనిలోన
కొంచెం గరళం కొంచెం అమృతం 
ఉన్నాయి నా కళ్ళల్లోన

కొంచెం నరకం కొంచెం స్వర్గం 
ఉన్నాయి నా గుండెలోనా 
 చంద్రలేఖా .. ఆ .. ఆ.. చంద్రలేఖా 


చిత్రం - దొంగ దొంగ (1993)
సంగీతం - A.R రెహమాన్ 
గీతరచన - భువనచంద్ర 
గానం - అనుపమ


23, మే 2020, శనివారం

వీర బొబ్బిలి కోటలో



వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో



వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
ఊరే నిద్దర పోయే యేళ సద్దేమణిగిన రాతిరి యేళ
అందెల సడి నా మనసే దోసింది

వీర బొబ్బిలి కోటలో మాటు మణిగిన సీకటిలో
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో
గాజుల సడి నా ఎదనే దోసింది

వీర బొబ్బిలి కోటలో ఎన్నెల కాసే యేళల్లో
పడుసుల మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే
అందెలసడి మీ మనసులు దోసిందా

వడ్డాణం వేస్తా వయ్యారి నడుముకి
వజ్రాల అందెలు వేస్తా వగలాడి కాళ్ళకి
మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి
ముత్యాల బేసరి వేస్తా కోపాల కొమ్మకి

మీ ఆశలన్నీ అడిఆశలంట
ఈ ఏలం పాట మీ ఊహల పంట
నీ నోటి మాటల్లోనే నా  మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే   నా నోరే పండాలంటా

వీర బొబ్బిలి కోటలో మాటు మణిగిన సీకటిలో
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో
గాజుల సడి నా ఎదనే దోసింది

ఇద్దరు సూరీళ్ళొచ్చిరమ్మా ఒంటరి తామర నలిగెనమ్మా
కత్తుల బోనే స్వయంవరమే కలిగెను నాలో ఒక భయమే
దమయంతిని నేనమ్మా నల మహారాజు ఎవరమ్మా
మనసైన వాణ్ణి నేనమ్మా  మహరాజును నేనే చిలకమ్మా

ఇది పరవశం నాకు నా తనువున ఒణుకు
వెలువడదే పలుకు
తను ఎవరికి సొంతమో చెప్పాలంటే 
ఏం చెబుతుందీ  మూగప్రాయం

నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంటా

వీర బొబ్బిలి కోటలో మాటు మణిగిన సీకటిలో
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో
గాజుల సడి నా ఎదనే దోసింది

వీర బొబ్బిలి కోటలో ఎన్నెల కాసే యేళల్లో
పడుసుల మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే
అందెలసడి మీ మనసులు దోసిందా


చిత్రం - దొంగదొంగ (1993)
సంగీతం - ఏ.ఆర్.రెహ్మాన్
గీతరచన - రాజశ్రీ
గానం - మనో,ఉన్నిమీనన్, చిత్ర

21, మే 2020, గురువారం

కనులు కనులను దోచాయంటే




కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం



కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం

వాగులై ఉరికితే వయసు కులుకే అని అర్ధం
కడలియె పొంగితే నిండు పున్నమేనని అర్ధం
ఈడు పకపక నవ్విందంటే ఊహు అని దానర్ధం
అందగత్తెకు అమ్మై  పుడితే ఊరికత్తని అర్ధం అర్ధం

కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం

కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం

పడవలే  నదులకు బంధుకోటి అని అర్ధం
చినుకులే వానకు బోసినవ్వులే అని అర్ధం
వెల్లవేస్తే  చీకటికి అది వేకువౌనని అర్ధం
ఎగిరితే నువు ఎముకలిరిస్తే విజయమని దానర్ధం అర్ధం

కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం


చిత్రం - దొంగ దొంగ (1993)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - రాజశ్రీ 
గానం - మనో


19, మే 2020, మంగళవారం

అరె ఇంకా జంక జింక



అరే ఇంక జంక జింక పెంకితనంగా 
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా



అరే ఇంక జంక జింక పెంకితనంగా 
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా 
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

సరే అంటావా సంతోషంగా సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావా అల్లేయంగా

అరే ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

బంగారం పిచ్చుకా భాగోతం పెంచకా నా భాగం పంచియ్యంగా
శృంగారం చిచ్చుగా గారం చూపించక బండారం బైటెయ్యంగా
బాగుందా బొత్తిగా బలవంతం పెట్టగా బులపాటం చెలరేగంగా
పంతాల పచ్చిగా పొలిమేరేతెంచగా పొంగుల్లో పొలమారంగా

మరేం చేస్తానే చెంగువల చిందెయ్యంగా
ఇదే సందంటూ చేతబడి చాల్లే ఇంకా
మరీ స్వాతంత్ర్యం గా మహా బాహాటంగా 
అలా జెండాలా ఎగరెయ్యంగా .. అరెరరెరరె ఇంక

అరే ఇంక జంక జింక పెంకితనంగా 
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా 
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

సరే అంటావా సంతోషంగా సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావా అల్లేయంగా

అరే ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

ఏకాంతం సాక్షిగా ఏమాత్రం దాచకా ఇస్తాగా నిక్షేపంగా
ఆసాంతం వెచ్చగా ఆశంతా తీర్చగా వస్తాగా ప్రత్యేకంగా
ఆమాత్రం ఓర్చగా ఉండొద్దా ఓపికా ఆపొద్దే నిష్టూరంగా 
చెప్పిందే చెప్పకా వింటుందా దప్పికా చంపొద్దే చాదస్తంగా

చమత్కారాలు కారాల విడ్డూరంగా 
అలా వారాలూ వర్జాలూ ఒద్దే ఇంక
మరీ అంగా ఉంగా అనీ గారాబంగా 
మొరాయిస్తావే మోహనరంగా .. అరెరరెరరె ఇంక

ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా 
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
అరే ఇంక జంక జింక పెంకితనంగా 
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా

సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావా అల్లేయంగా
సరే అంటావా సంతోషంగా సగం ఇస్తావా సావాసంగా

అరే ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
 

చిత్రం - ధర్మక్షేత్రం (1992)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P. బాలు, S.జానకి 


17, మే 2020, ఆదివారం

రేపటి రేపటి రేపటి కల..



రేపటి  రేపటి రేపటి కలా  రెప్పలు దాటిన రేపటి కలా
రెక్కలు సాచిన రేపటి కలా ఎగరవే అలా



చిత్రం -కౌసల్యకృష్ణ మూర్తి (2019)
సంగీతం - Dhibu Ninan Thomas
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - waraag Keerthan , Manisha Errabathini

15, మే 2020, శుక్రవారం

మరుపేలేని సంతకం.. పెళ్లిపుస్తకం



మరుపేలేని సంతకం .. పెళ్లిపుస్తకం
మరుజన్మకే తొలి స్వాగతం .. పెళ్లిపుస్తకం



తన ప్రాణాలె  నీవని .. ధర్మేఛగా
తన మనసంత నీదని .. అర్దేఛగా
తన వలపంత నీకని .. కామేఛగా
అవధులు లేని ప్రేమకై .. మోక్షేగా 

మూడుముళ్లతో  ఏడు అడుగులా 
అగ్నిసాక్షిగా 
ఇద్దరూ  ఒకటిగా మారెగా

మరుపేలేని సంతకం .. పెళ్లిపుస్తకం
మరుజన్మకె తొలి స్వాగతం .. పెళ్లిపుస్తకం

ప్రేమ పెళ్లి పేరుతో ఇరువురిలోన 
ప్రేమ మాత్రమే
బంధుమిత్ర ప్రేమలే కలిసిన 
నాదేలే పెళ్లనగా

కన్నవాళ్ళ ఆశలే 
కలిసిన స్వర్గలోక దీవెనే
నువ్వు నేను మాటనే మార్చే మాటే 
ఈ పెళ్లనగా

తోడు నీడగా ప్రాణబంధమా
నీతొ  ఉండనా 
శాశ్వతం శాశ్వతం మనమికా

మరుపేలేని సంతకం .. పెళ్లిపుస్తకం
మరుజన్మకె తొలి స్వాగతం .. పెళ్లిపుస్తకం 


పెళ్లిపుస్తకం Short  Film 
సంగీతం - వంశీకృష్ణ 
గీతరచన - దినేష్ గౌడ్ కక్కెర్ల 
గానం - సురేంద్రనాథ్ ,దీపు పార్ధసారధి 

13, మే 2020, బుధవారం

చెలి నా గుండెలో ఉండిపోవే



చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే
నువ్వే నా దానివే వేదానివే నవ్వే గోదారివే నా దారివే



చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే
చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే
నువ్వే నా దానివే వేదానివే నవ్వే గోదారివే నా దారివే
ప్రాణానివే గానానివే నా కోటలో రారాణివే

చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే

లేత చిరుగాలివే స్వాతిముత్యానివే
వేణుగానానివే పైన జాబిల్లివే
నమ్మవే నా చెలి అన్న హృదివేదన
గానమై సాగెనే ప్రేమ అభినందన

నువ్వు కావాలి రావాలి ఓ నేస్తమా
నీతో ఆడాలి పాడాలి నా ప్రియతమా
ప్రేమ నీవేలే నాలోని రాగానివే
ప్రేమ నీవేలే నా గుండె నా దానివే

చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే

వేల భావాలని నీకు తెలపాలని
గుండెలో భాషని విన్నవించాలని
ఎందుకో మనసులో ఇంత ఈ యాతన
నిన్ను చేరేదెలా చెప్పవే నా చెలి

నిన్ను చేరేటి దారేది ఓ కోయిలా
నిన్ను చూడాలి పాడాలి ప్రతిరోజిలా
అందుకే నీవు కావాలి ఓ అందమా
అందుకో ప్రేమ రాగాలు ప్రియబంధమా

చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే
నువ్వే నా దానివే వేదానివే నవ్వే గోదారివే నా దారివే
ప్రాణానివే గానానివే నా కోటలో రారాణివే
చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే


రాజ్ కుమార్ .వి 
Private Album

11, మే 2020, సోమవారం

ఏదో ఏదో మాయాజాలం శ్రావణ సమీరం


ఏదో ఏదో మాయాజాలం శ్రావణ సమీరం 
 శ్రావణ సమీరం 



ఈ సందడి ఏమిటి ఆకాశంలో 
ఆ సవ్వడి మోతలు మెరుపులలో 
ఈ సందడి ఏమిటి ఆకాశంలో 
ఆ సవ్వడి మోతలు మెరుపులలో 

అటు ఉరుముల మేఘ సరాగాలు 
తొలి మెరుపుల చిలిపి పరాగాలు 
 ఈ మాయల శృతిలయలో  
సహజీవన సంగీతాలు  అనువాదమే 

ఏదో ఏదో మాయాజాలం శ్రావణ సమీరం 
 శ్రావణ సమీరం

ఈ ఊహలు ఎందుకు ఆ హృదయంలో
మది ఊయలలూపెను ఊసులలో

అవి మమతలు వెతుకు ప్రభాతాలు
పెనవేసిన మధుర ప్రవాహాలు
ఈ సృష్టికి జతి గతులు
అనుభూతుల సంగీతాలు అపురూపమే

కాదా కాదా ఎదో మైకం శ్రావణ సమీరం
శ్రావణ సమీరం 


శ్రావణ సమీరాలు (2013)
గీతరచన - బలభద్రపాత్రుని మధు
సంగీతం - బంటి
గానం - బంటి ,రమ్య పల్లమాల 

9, మే 2020, శనివారం

విరిసే విరిసే మొగలిరేకులు



చిగురంత ఆశ మదిలోన రేగి చిరునవ్వు మాసిపోనీ
విరిసే విరిసే మొగలిరేకులు 



పచ్చని పసిమి విచ్చిన మిసిమి
పచ్చని పసిమి విచ్చిన మిసిమి
గుసగుసలాడే ఘుమఘుమలాడే 
కమ్మని కమ్మని వాసన చిలికి నవనవలాడే

నును లేత లేత తొలి పూత పూత వసివాడి వాడిపోనీ 
చిగురంత ఆశ మదిలోన రేగి చిరునవ్వు మాసిపోనీ 

విరిసే విరిసే మొగలిరేకులు 
విరిసే విరిసే మొగలిరేకులు 
విరిసే విరిసే మొగలిరేకులు 

ముళ్ళల్లో బ్రతుకు ముచ్చట తనకు 
నాగుల బుసలు తప్పవు తమకు 
జిలిబిలి ఆశ చిగురు హమేషా 
నచ్చిన మెచ్చిన వచ్చిన కల నీకై నిజమయ్యే 
 
నును లేత లేత తొలి పూత పూత వసివాడి వాడిపోనీ 
చిగురంత ఆశ మదిలోన రేగి చిరునవ్వు మాసిపోనీ

విరిసే విరిసే మొగలిరేకులు 
విరిసే విరిసే మొగలిరేకులు 
విరిసే విరిసే మొగలిరేకులు


మొగలిరేకులు (2008)
దర్శకత్వం - మంజులా నాయుడు
గీతరచన - బలభద్రపాత్రుని మధు
సంగీతం, గానం - బంటీ


7, మే 2020, గురువారం

ఎందుకో నాకు ఈ ఆశలు



ఎందుకో నాకు ఈ ఆశలు ఎందుకో నాకు ఆశలు
మనసా మనసా నువ్వు పాడలేవులే మాట్లాడలేవులే



ఎందుకో నాకు ఈ ఆశలు ఎందుకో నాకు ఆశలు

మనసా మనసా నువ్వు పాడలేవులే మాట్లాడలేవులే
అయినా అయినా నిను వీడలేనులే  నా నీడ నువ్వు లే
ప్రేమే నాకు కావాలని రేగిపోతానిలా
నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా

 ఎందుకో నాకు ఈ ఆశలు ఎందుకో నాకు ఆశలు

నువ్వే నా ప్రాణం మనసా నువ్వే నాలోకం మనసా 
నువ్వే సర్వస్వం తెలుసా 
నేనే నీవుగా .. నేనే నీవుగా

చూడకే నన్ను ఓ వెర్రిలా వీడకే నన్ను నాజూకుగా 

వొదిగి వొదిగి ఇక ఉండలేనులే నీ అండ చాలులే
వెరచి వెరచి నే ఓడిపోనులే పోరాడతానులే 
ఎన్నో స్వేచ్ఛ రాగాలనే పాడుకుందామిలా 
ఏవో స్వప్న ద్వారాలనే చేరుకుందామిలా 

చూడకే నన్ను ఓ వెర్రిలా వీడకే నన్ను నాజూకుగా 
నువ్వే నా ధైర్యం మనసా నువ్వే నా గర్వం మనసా 
నువ్వే ప్రతిబింబం తెలుసా 
నువ్వే నేనుగా .. నువ్వే నేనుగా 

తోడుగా నాకు నువ్వుండవే జాడనే నాకు చూపించవే

తరలే తెరలా నువ్వు ఆడబోకులే వేటాడబోకులే 
కలలా కధలా నువ్వు సాగబోకులే వెంటాడబోకులే 
నింగే నాకు అందాలని రేగిపోతానిలా 
ఇలపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా 

 తోడుగా నాకు నువ్వుండవే జాడనే నాకు చూపించవే
 
నువ్వే నా స్వార్ధం మనసా నువ్వే నా అర్ధం మనసా 
నువ్వే నా నేస్తం తెలుసా 
నేనే ఛాయనా .. నేనే ఛాయనా


చక్రవాకం (2003) టీవీ సీరియల్  
దర్శకత్వం - మంజులా నాయుడు 
రచన - బలభద్రపాత్రుని మధు 
సంగీతం,గానం - బంటీ 

5, మే 2020, మంగళవారం

ఏ దారమో పంపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం



ఏ దారమో పంపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టితో తన చుట్టరికం



ఏ దారమో పంపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టితో తన చుట్టరికం

ఉన్నపాటు గా కలగ లేదుగా చందమామనే చేరే ఙ్ఞానం
చిన్ననాటనే మొదలయిందిగా 
దాయి దాయనే ఊహా గానం

నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ గడిచిన కాలం
వెన్నంటే ఆ బరువేగా చూపించిందీ నేడీ తీరం
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవ సారం
ఆ మాటే మళ్ళీ కొత్తగ చెబుతోందీ 
అమ్మమ్మా డాట్ కామ్

ఏ దారమో పంపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టితో తన చుట్టరికం

అప్పుడు అపుడు గతమే వెతుకు 
సుడిలో పడితే సలహా అడుగు
గడిచిన రోజులు తలవటమెందుకు  ఏం లాభం అనకూ
ఏ దిక్కులు తోచని చిక్కుల దారిని
దాటిన నాటి స్మృతీ చూపద నీ ప్రగతీ 

వేగంగా రివ్వు రివ్వునా గాల్లో దూసుకు పోయే బాణం
తననొదిలిన విల్లేదంటే ఏమో ఆంటే చేరదు గమ్యం
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవ సారం
ఆ మాటే మళ్ళీ కొత్తగ చెబుతోందీ 
అమ్మమ్మా డాట్ కామ్

ఏ దారమో పంపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టితో తన చుట్టరికం


అమ్మమ్మ డాట్ కామ్ 
2007 



3, మే 2020, ఆదివారం

కృష్ణమ్మకు గోదారికి తోడెవరమ్మా



కృష్ణమ్మ కు గోదారికి తోడెవరమ్మా
మమతల మందాకిని మగువేనమ్మా



కృష్ణమ్మ కు గోదారికి తోడెవరమ్మా
మమతల మందాకిని మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండా కోనలులు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో  దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి

కృష్ణమ్మ కు గోదారికి తోడెవరమ్మా
మమతల మందాకిని మగువేనమ్మా

కడలిని చేరిన నదికి విశ్రాంతి
తరుణికి మాత్రం తీరని భ్రాంతి.
పచ్చని పైరుకు నది ఆధారం
బ్రతుకున వెలుగుకు ఆడది మూలం

గంగ పొంగి పొరలిందా ప్రళయ తాండవం రాదా
సీత గీత దాటిందా యుద్ధకాండ మొదలేగా
ఆ నది ఆడది శక్తి స్వరూపాలే

కృష్ణమ్మకు గోదారికి తోడెవరమ్మా
మమతల మందాకిని మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండా కోనలులు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో  దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి


పిన్ని సీరియల్ టైటిల్ సాంగ్ 
1999 & 2020


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.