.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

5, మే 2020, మంగళవారం

ఏ దారమో పంపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం

ఏ దారమో పంపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టితో తన చుట్టరికం

ఏ దారమో పంపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టితో తన చుట్టరికం

ఉన్నపాటు గా కలగ లేదుగా చందమామనే చేరే ఙ్ఞానం
చిన్ననాటనే మొదలయిందిగా 
దాయి దాయనే ఊహా గానం

నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ గడిచిన కాలం
వెన్నంటే ఆ బరువేగా చూపించిందీ నేడీ తీరం
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవ సారం
ఆ మాటే మళ్ళీ కొత్తగ చెబుతోందీ 
అమ్మమ్మా డాట్ కామ్

ఏ దారమో పంపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టితో తన చుట్టరికం

అప్పుడు అపుడు గతమే వెతుకు 
సుడిలో పడితే సలహా అడుగు
గడిచిన రోజులు తలవటమెందుకు  ఏం లాభం అనకూ
ఏ దిక్కులు తోచని చిక్కుల దారిని
దాటిన నాటి స్మృతీ చూపద నీ ప్రగతీ 

వేగంగా రివ్వు రివ్వునా గాల్లో దూసుకు పోయే బాణం
తననొదిలిన విల్లేదంటే ఏమో ఆంటే చేరదు గమ్యం
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవ సారం
ఆ మాటే మళ్ళీ కొత్తగ చెబుతోందీ 
అమ్మమ్మా డాట్ కామ్

ఏ దారమో పంపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టితో తన చుట్టరికం

అమ్మమ్మ డాట్ కామ్ 
2007 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం

చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..

రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.

♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.