ఎందుకో నాకు ఈ ఆశలు ఎందుకో నాకు ఆశలు
మనసా మనసా నువ్వు పాడలేవులే మాట్లాడలేవులే
అయినా అయినా నిను వీడలేనులే నా నీడ నువ్వు లే
ప్రేమే నాకు కావాలని రేగిపోతానిలా
మనసా మనసా నువ్వు పాడలేవులే మాట్లాడలేవులే
అయినా అయినా నిను వీడలేనులే నా నీడ నువ్వు లే
ప్రేమే నాకు కావాలని రేగిపోతానిలా
నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా
ఎందుకో నాకు ఈ ఆశలు ఎందుకో నాకు ఆశలు
నువ్వే నా ప్రాణం మనసా నువ్వే నాలోకం మనసా
నువ్వే సర్వస్వం తెలుసా
నేనే నీవుగా .. నేనే నీవుగా
చూడకే నన్ను ఓ వెర్రిలా వీడకే నన్ను నాజూకుగా
వొదిగి వొదిగి ఇక ఉండలేనులే నీ అండ చాలులే
వెరచి వెరచి నే ఓడిపోనులే పోరాడతానులే
ఎన్నో స్వేచ్ఛ రాగాలనే పాడుకుందామిలా
ఏవో స్వప్న ద్వారాలనే చేరుకుందామిలా
చూడకే నన్ను ఓ వెర్రిలా వీడకే నన్ను నాజూకుగా
నువ్వే నా ధైర్యం మనసా నువ్వే నా గర్వం మనసా
నువ్వే ప్రతిబింబం తెలుసా
నువ్వే నేనుగా .. నువ్వే నేనుగా
తోడుగా నాకు నువ్వుండవే జాడనే నాకు చూపించవే
తరలే తెరలా నువ్వు ఆడబోకులే వేటాడబోకులే
కలలా కధలా నువ్వు సాగబోకులే వెంటాడబోకులే
నింగే నాకు అందాలని రేగిపోతానిలా
ఇలపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా
తోడుగా నాకు నువ్వుండవే జాడనే నాకు చూపించవే
నువ్వే నా స్వార్ధం మనసా నువ్వే నా అర్ధం మనసా
నువ్వే నా నేస్తం తెలుసా
నేనే ఛాయనా .. నేనే ఛాయనా
చక్రవాకం (2003) టీవీ సీరియల్
దర్శకత్వం - మంజులా నాయుడు
రచన - బలభద్రపాత్రుని మధు
సంగీతం,గానం - బంటీ
దర్శకత్వం - మంజులా నాయుడు
రచన - బలభద్రపాత్రుని మధు
సంగీతం,గానం - బంటీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి