.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

25, మే 2020, సోమవారం

కొంచెం నీరు కొంచెం నిప్పు



కొంచెం  నీరు కొంచెం నిప్పు 
ఉన్నాయి నా మేనిలోన



కొంచెం  నీరు కొంచెం నిప్పు 
ఉన్నాయి నా మేనిలోన
కొంచెం గరళం కొంచెం అమృతం 
ఉన్నాయి నా కళ్ళల్లోన

కొంచెం నరకం కొంచెం స్వర్గం 
ఉన్నాయి నా గుండెలోనా  
చంద్రలేఖా .. ఆ .. ఆ.. చంద్రలేఖా 

కొంచెం  నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన

నా కలలో ఎవరో ఒచ్చే .. నా కనుల వెలుగై నిలిచే
ఓ స్వాతి చినుకై కురిసే 
అహ నా మదిలో మెరుపై మెరిసే

ఈ పెదవి విరి తేనె మడుగంట
అహ నా వగలే ధర లేని నగలంట
నేడు ఈ భూమికే నీ కోసం దిగివచ్చే ఈ తార
తోడుగ వస్తే మురిపాలు తీరేరా

కాలాలు అడిగేసే బంగారం ఈ వన్నె
నీ ఓర చూపుల్లో వరహాలే ఒలికెనే
నీ నవ్వుల పువ్వుల్లో ముత్యాలే దొరికెనే
ఊరించే వంపుల్లో హరివిల్లే విరిసేనే

కొంచెం  నీరు కొంచెం నిప్పు 
ఉన్నాయి నా మేనిలోన
కొంచెం గరళం కొంచెం అమృతం 
ఉన్నాయి నా కళ్ళల్లోన

కొంచెం నరకం కొంచెం స్వర్గం 
ఉన్నాయి నా గుండెలోనా 
 చంద్రలేఖా .. ఆ .. ఆ.. చంద్రలేఖా

మనసైన నీ వాడు వినువీధిన వస్తాడే
అందాలకు బహుమతిగా సిరివెన్నెలనిస్తాడే

కొంచెం  నీరు కొంచెం నిప్పు 
ఉన్నాయి నా మేనిలోన
కొంచెం గరళం కొంచెం అమృతం 
ఉన్నాయి నా కళ్ళల్లోన

కొంచెం నరకం కొంచెం స్వర్గం 
ఉన్నాయి నా గుండెలోనా 
 చంద్రలేఖా .. ఆ .. ఆ.. చంద్రలేఖా 


చిత్రం - దొంగ దొంగ (1993)
సంగీతం - A.R రెహమాన్ 
గీతరచన - భువనచంద్ర 
గానం - అనుపమ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.