వరంగల్ కు చెందిన నాగరాజు రాసిన అనితఓఅనితా అనే ప్రైవేట్ సాంగ్ ఒకప్పుడు చాలా గుర్తింపు పొందింది.ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ భగ్నప్రేమికుడు పాడుకునే విరహ గీతం.ఈ పాట వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరి మొబైల్ లో,ప్రతి చోటా ఈ పాట వినపడేది.సినిమా పాటలతో సమానం గా పాపులర్ అయ్యింది. ఈ పాటని ఇష్టపడినంత మాత్రాన ఇష్టపడే వాళ్ళందరూ భగ్న ప్రేమికులు కాదు..కొన్ని పాటలు అలా ఎప్పటికీ గుర్తుండి పోతాయి."అనితా ... అనితా ..."పాట తర్వాత భగ్న ప్రేమికుడిని ఓదారుస్తూ ప్రేమికురాలు పాడే" ఓ నేస్తమా నా స్నేహ బంధమా "పాట కూడాబాగుంటుంది.
చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి.. ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ.. ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం.. కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి.. కొన్ని పులకరింపజేస్తాయి.. కొన్ని నిద్ర పుచ్చుతాయి.. కొన్ని మేలుకొలుపు పాడుతాయి.. మరి కొన్ని స్పందింపజేస్తాయి.. కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి.. కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి.. కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి.. కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి.. రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను. ఇందులో పాటలన్నీ నాకుఇష్టమైనపాటలు.. ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.
♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫ నాబెస్ట్ఫ్రెండ్సంగీతం...మనసుకుహాయికలిగినా, బాధఅనిపించినాపాటలు నాకుమంచితోడు.