.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - వినీత్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - వినీత్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జులై 2020, బుధవారం

ఓ వెన్నెలా తెలిపేదెలా



ఓ వెన్నెలా తెలిపేదెలా 
ఓ నేస్తమా పిలిచేదెలా



ఓ వెన్నెలా తెలిపేదెలా 
ఓ నేస్తమా పిలిచేదెలా

కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వై  పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వై పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా

జడివాన నింగిని తడిచేయునా 
గంధాలు పువ్వుని విడిపోవునా
నన్నడిగి ప్రేమ ఎద చేరెనా 
వలదన్న ఎదను విడిపోవునా

మరిచాను అన్నా మరిచేదెలా 
మరిచాక నేను బ్రతికేదెలా

ఓ వెన్నెలా తెలిపేదెలా

వలపించు హృదయం ఒకటే కదా 
ఎడమయితే బ్రతుకు బరువే కదా
నిలిపాను ప్రాణం నీకోసమే 
కలనైన కూడా నీ ధ్యానమే

మదిలోని ప్రేమ చనిపోదులే 
ఏనాటికైనా నిను చేరులే

ఓ వెన్నెలా తెలిపేదెలా 
ఓ నేస్తమా పిలిచేదెలా

కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వై పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వై పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా


చిత్రం - ప్రేమదేశం (1996)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - భువనచంద్ర 
గానం - ఉన్నికృష్ణన్ 


6, జులై 2020, సోమవారం

ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా



ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా



Ooh yeah friendship
Ooh yeah friendship
Friendship is what we are looking for

ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా

Day by day ... Day by day 
కాలం ఒడిలో day by day
పయనించే shipఏ friend ship రా
ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా

జూన్ పోయి జులై పుడితే
సీనియర్  కి జూనియర్  కి
కాలేజ్ క్యాంపస్  లోనే రాగింగ్ ఆరంభం

స్టూడెంట్ మనసో  నందనవనం
మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్
స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందోయ్  సాయం

వాడిపోనిది స్నేహమొక్కటే
వీడిపోనిది నీడ ఒక్కటే
హద్దంటూ లేనే లేనిదీ ఫ్రెండ్ షిప్  ఒక్కటే

కష్టమొచ్చినా నష్టమొచ్చినా
మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే
కాలేజ్  స్నేహం ఎపుడు అంతం కానిదే

ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
Day by day ... Day by day 
కాలం ఒడిలో day by day
పయనించే shipఏ friend ship రా

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలూ
ఏడనించో గోరు వంకలు
కాలేజ్ క్యాంపస్ లోన నాట్యం చేసెనే

కన్నెపిల్లల కొంటె నవ్వులు
కుర్ర మనసుల కౌగిలింతలు
కాలేజ్ కాంపౌండ్ అంటే కొడైకెనాలే

Course ముగిసే రోజు వరకు
తుళ్ళిపడిన కుర్ర ఎదలో
కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి

స్నేహితుల్ని వీడిపోయే
రోజు మాత్రం కంటినిండా
కన్నీటి తోనేనంట ఫేర్ వెల్ పార్టీ 

ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా

Day by day ... Day by day 
కాలం ఒడిలో day by day
పయనించే shipఏ friend ship రా

ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా


చిత్రం - ప్రేమ దేశం (1996)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - భువనచంద్ర 
గానం - A.R. రెహమాన్

4, జులై 2020, శనివారం

హల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే



 హల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే
పల్స్ చూస్తే ఫాస్ట్ బీటాయే



 హల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే
పల్స్ చూస్తే ఫాస్ట్ బీటాయే
కేడ్బరీస్ సహించదే కాలేజ్ బోర్ ఆయే
కుషన్ బెడ్ తరించదే నిదరోయి నెలలాయే   

 హల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే


బుక్స్ పట్టి కాలేజ్ పోతే పుట్టుకొచ్చే L O V E
రిలాక్స్ కోసం మూవీ కెళ్తే మూవీ అంతా L O V E
హాలివుడ్ లండన్ పేరిస్ బెహరైన్ లోకమంతా L O V E
రాకెట్ ఎక్కి మూన్ కి పోతే అక్కడ కూడా L O V E

 హల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే

పల్స్ చూస్తే ఫాస్ట్ బీటాయే
కేడ్బరీస్ సహించదే కాలేజ్ బోర్ ఆయే
కుషన్ బెడ్ తరించదే నిదరోయి నెలలాయే   

నో  క్రెడిట్ కార్డ్ ..  నో లవ్
నోనో కార్ ..  నో లవ్
నో లైస్ ..  నో లవ్

స్కానింగ్ చేసి బబ్రెయిన్ ని చూస్తే సెల్స్ లోన L O V E
టెస్ట్ కోసం రక్తాన్నిస్తే బ్లడ్ గ్రూపే L O V E
ఓపెన్ చేసి హార్ట్ ని చూస్తే వాల్వ్ లోన  L O V E
నాడిని పట్టి పల్స్ ని చూస్తే నరాలు పాడే L O V E

  ఫైవ్ స్టార్ బిల్ పడినాదే
మెక్ డొవల్స్ దిగి పోయిందే
ఐస్ ఐస్ మీట్ ఐతే  హై వోల్టేజ్ పాసైందే
స్కూల్ బెబిలా మాటలు వింటే కూల్ బాడిలే హీటాయే
మేరీ స్టెల్లా పోయావే మెంటల్ పేషంట్ అయ్యావే

 హల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే

పల్స్ చూస్తే ఫాస్ట్ బీటాయే
కేడ్బరీస్ సహించదే కాలేజ్ బోర్ ఆయే
కుషన్ బెడ్ తరించదే నిదరోయి నెలలాయే  

ఇది కాలేజ్ ప్రేమ .. పిచ్చి  .. ఓ కన్నె పిల్లని చూసి 


చిత్రం - ప్రేమదేశం (1996)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - భువనచంద్ర
గానం - K.K. శ్రీనివాస్, అనుపమ, నోయల్ జేమ్స్

2, జులై 2020, గురువారం

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే



వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే 
పూల తేనెలే తేవే



వెన్నెలా వెన్నెలా 
మెల్లగా రావే పూల తేనెలే తేవే
వెన్నెలా వెన్నెలా 
మెల్లగా రావే పూల తేనెలే తేవే

కడలి ఒడిలో నదులు ఒదిగి 
నిదురపోయే వేళా
కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళా

వెన్నెలా వెన్నెలా 
మెల్లగా రావే పూల తేనెలే తేవే

ఆశ ఎన్నడు విడువదా 
అడగరాదని తెలియదా
నా ప్రాణం చెలియా నీవేలే

విరగబూసిన వెన్నెలా 
వదిలి వేయకే నన్నిలా
రారాదా ఎద నీదే కాదా

నిదురనిచ్చే జాబిలీ నిదురలేక నీవే వాడినావా

వెన్నెలా వెన్నెలా 
మెల్లగా రావే పూల తేనెలే తేవే

మంచు తెరలో అలిసిపోయి 
మదన సంధ్య తూగెనే
పుడమి ఒడిలో కలలుకంటూ 
పాపా నీవూ నిదురపో

మల్లె అందం మగువకెరుక 
మనసు బాధ తెలియదా
గుండె నిండా ఊసులే 
నీ ఎదుటనుంటే మౌనమే

జోలపాటా పాడినా నే నిదురలేక వాడినా

వెన్నెలా వెన్నెలా 
మెల్లగా రావే పూల తేనెలే తేవే
వెన్నెలా వెన్నెలా 
మెల్లగా రావే పూల తేనెలే తేవే


చిత్రం - ప్రేమదేశం (1996)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - - భువనచంద్ర
గానం - మనో, ఉన్నికృష్ణన్

30, జూన్ 2020, మంగళవారం

నను నేనే మరిచినా నీ తోడు



నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు



ప్రేమా.. ప్రేమా..ఆ.. ఆ..ఆ 
ప్రేమా..  ప్రేమా..ఆ.. ఆ..ఆ

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు .. ప్రేమా

నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే .. ప్రేమా..  ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ .. రావా 
నా వాకిట్లో .. నీకై .. నే వేచానే

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు ప్రేమా

ఆకాశ దీపాన్నై నే వేచివున్నా
నీ పిలుపు కోసం చిన్నారీ
నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా
కరుణించలేవా సుకుమారీ

నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువులేక లోకంలో జీవించలేనే
నీ ఊహతోనే బ్రతికున్నా

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు .. ప్రేమా

నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే .. ప్రేమా..  ప్రేమా

నిముషాలు శూలాలై వెంటాడుతున్నా
ఒడి చేర్చుకోవా వయ్యారీ
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా
ఓదార్చిపోవా  ఓ సారీ

ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ
ప్రేమించినానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు .. ప్రేమా

నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే .. ప్రేమా..  ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ .. రావా 
నా వాకిట్లో .. నీకై .. నే వేచానే

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు .. ప్రేమా


చిత్రం - ప్రేమదేశం(1996)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - భువనచంద్ర
గానం - S.P.బాలు, O.S.అరుణ్

28, జూన్ 2020, ఆదివారం

కనులు తెరిచినా కన్నెపిల్లా


హే కనులు తెరిచినా కన్నెపిల్లా
కనులు మూసినా కన్నెపిల్లా



అల తానై అలరించేది మగువా
తనువు తానై మురిపించేది మగువా
ఒడి తానై మనిషినే మలిచేది మగువా
ఒడి తానై మనిషినె మలిచేది మగువా
నింగినైనా నేలనైనా అమూల్యమైనదీ మగువా
ఎనలేని నిధియే మగువా

హే కనులు తెరిచినా కన్నెపిల్లా
కనులు మూసినా కన్నెపిల్లా
కవిత రాసినా కన్నెపిల్లా హోయ్

కకకకక కాలేజీ స్టైలే.. హ .. కాలేజీ స్టైలే
కకక కాలేజీ స్టైలే..  కకక.. కాలేజీ స్టైలే
కకక కాలేజీ స్టైలే.. ఏఏ..ఏ..ఏ..ఏ 

కాటుక కళ్ళ కన్నె చూపు 
తస్సదియ్యా హ ఎంత కైపు
కాశ్మీర్ రోజా వేటా క్యాట్వాకింగే పూటా
ఎవ్రీడే ఫ్యాషన్ షో

కళ్ళలో సిలికాన్ గ్రాఫిక్స్ గర్ల్స్ వస్తేనే జాం ఆన్ ట్రాఫిక్స్
వి ఛానెల్ ఛాయిస్సూ నీ డాల్బీ వాయిస్సూ
లైటినింగ్ కళ్ళలో లేజర్
నీ లవ్ మ్యాటర్ చెప్పింది పేజర్
నే టీనేజ్ కంప్యూటర్ నువ్వే నా సాఫ్ట్ వేర్

సెల్యులార్ ఫోనుల్లాగా మీరున్నట్లైతే
బ్యాగీ ప్యాంట్ పాకెట్లోనా నైస్గా పెట్టుకుంటాం
కాంటాక్ట్ లెన్సుల్లాగా మీరున్నట్లైతే
కళ్ళల్లో పాపల్లాగా మిమ్మే దాచుకొంటాం

అందాలన్నీ ఆహో ఓ ఇన్స్పిరేషన్
ఉప్పొంగదా చూస్తే యంగర్ జనరేషన్
కాలేజీ స్ట్రీటంటేనే కళ్ళల్లో మెరుపొస్తున్నాయే

డేటింగ్ కోసం డైలీ కాలేజ్ క్యాంపస్లో వేచి ఉంటాం
ఓకే అంటే శాన్ ఫ్రాన్సిస్కో డిస్కో చూపెడతాం
బాయ్స్ అండ్ గర్ల్స్ రాక్ ఎన్ రోల్ ఆడేటి
సొంపైన చోటే కాలేజ్ స్ట్రీటు
ఎవ్రీడే లవ్ సీజన్స్ న్యూ ఫ్యాషన్
మేం నేర్చేవన్నీ ప్రేమల పాఠాలే

కకకకక కాలేజీ స్టైలే.. హ .. కాలేజీ స్టైలే


చిత్రం - ప్రేమదేశం (1996)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - భువనచంద్ర
గానం - హరిహరన్, కృష్ణకుమార్

4, ఆగస్టు 2016, గురువారం

ఓహోహో చిలకమ్మా పలికే ఓ పంచదార చిలకమ్మా







ఓహోహో చిలకమ్మా .. 
ఓహోహో చిలకమ్మా





















 చిత్రం - లాహిరి లాహిరిలో (2002)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - సిరివెన్నెల 
గానం -ఉదిత్ నారాయణ్ , K.S. చిత్ర 

5, మే 2016, గురువారం

లాహిరి లాహిరి లాహిరి లో మన అందరి గుండెల సందడిలో



లాహిరి లాహిరి లాహిరి లో


చిత్రం - లాహిరి లాహిరిలాహిరి లో (2002)
సంగీతం - M.M.కీరవాణి 
గీతరచన - సిరివెన్నెల 
గానం -ఉన్ని కృష్ణన్, సునీత 

18, ఫిబ్రవరి 2016, గురువారం

7, జూన్ 2015, ఆదివారం

గోదావరి పయ్యెద.. కృష్ణమ్మ నీ వాల్జడ



గోదావరి  పయ్యెద.. 


చిత్రం - సరిగమలు (1994)
సంగీతం -  బాంబే రవి
గీత రచన - వేటూరి
 గానం - ఎస్.పి.బాలు,చిత్ర 

28, మే 2015, గురువారం

ఎక్కడికి నీ పరుగు ఎందుకనీ ఈ ఉరుకు



ఎక్కడికి నీ పరుగు.. 





 
సినిమా - W/O వరప్రసాద్
సంగీతం - కీరవాణి
లిరిక్స్ - సిరివెన్నెల
ఎస్.పి. బాలు,శ్రీలేఖ

18, అక్టోబర్ 2012, గురువారం

25, మే 2011, బుధవారం

మంత్రమేదో వేసింది మత్తుమందు చల్లింది


మంత్రమేదో వేసింది 


 


చిత్రం - లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - సిరివెన్నెల 
గానం  - ఉదిత్ నారాయణ్ , K.S.చిత్ర

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.