బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ
బంగారు పల్లకిలో
బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ
బంగారు పల్లకిలో
దివ్యంగ వెలుగుతుందిరయ్యో మాయమ్మ
దీపాల కాంతుల్లో
ఏటేట జాతరలంట .. ఓహో
ఎటుచూడు భక్తుల సంత .. ఆహా
డోలు దరువుల్లతోటి .. ఓహో
మాతల్లి ఊరేగింపంట .. ఆహా
ఏకాడ లేని జాతరంటే జాతరంట
జగన్మాత కనకదుర్గకూ
బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ
బంగారు పల్లకిలో
దివ్యంగ వెలుగుతుందిరయ్యో మాయమ్మ
దీపాల కాంతుల్లో
పగడాల మాతల్లికంట .. ఓహో
పసుపు కుంకుమలంట . ఆహా
పచ్చాని గాజులంట .. ఓహో
పట్టుపీతాంబరాలంట .. ఆహా
రాజ్యాలు కలిగించే బంగారు తల్లిని
భక్తకోటి కొలవబట్టెరో
బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ
బంగారు పల్లకిలో
దివ్యంగ వెలుగుతుందిరయ్యో మాయమ్మ
దీపాల కాంతుల్లో
తప్పులుంటే మన్నించమంటూ .. ఓహో
తడిబట్ట స్నానాలు చేసి .. ఆహా
చుక్కాని మాతల్లికేమో .. ఓహో
ఒక్కాపొద్దులు పట్టినారు .. ఆహా
లెక్కలేని భక్తులచ్చి దిక్కూ నీవేనని
మొక్కుతున్న తీరు చూడరో
బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ
బంగారు పల్లకిలో
దివ్యంగ వెలుగుతుందిరయ్యో మాయమ్మ
దీపాల కాంతుల్లో
సాయంకాలం సంధ్యవేళా .. ఓహో
ఊరంత దీపాల ఓల .. ఆహా
బెజవాడలో దండి మేళా .. ఓహో
కోటొక్క భక్తుల గోలా .. ఆహా
కనకదుర్గ మాతల్లి బయలెల్లి వస్తుంటే
కన్నుల పండుగయ్యో
బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ
బంగారు పల్లకిలో
దివ్యంగ వెలుగుతుందిరయ్యో మాయమ్మ
దీపాల కాంతుల్లో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి