జీవితంలో విలువైన, అందమైన ఆనందాల్ని కోల్పోయి తరువాతి దశకు వెళ్లిపోయిన ఓ అమ్మాయికి అలా వెళ్లిపోయిన వయసు సీతాకోక చిలుకలా మళ్లీ వచ్చి గుప్పెట్లో వాలితే ఏమవుతుంది? ఆ ఆనందం నుంచి ఓ పాట పుడితే ఎలా ఉంటుంది? అలాంటి సందర్భంలో నాయిక పాడుకునే పాట ఇది.
- భాస్కరభట్ల రవికుమార్
నేనే నేనా వేరే ఎవరోనా
నేనే ఉన్నా సందేహంలోనా
చిత్రం - ఓ బేబీ (2019) సంగీతం - మిక్కీ జే.మేయర్
గీత రచన - భాస్కరభట్ల రవికుమార్ గానం - నూతన మోహన్
చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి.. ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ.. ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం.. కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి.. కొన్ని పులకరింపజేస్తాయి.. కొన్ని నిద్ర పుచ్చుతాయి.. కొన్ని మేలుకొలుపు పాడుతాయి.. మరి కొన్ని స్పందింపజేస్తాయి.. కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి.. కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి.. కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి.. కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి.. రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను. ఇందులో పాటలన్నీ నాకుఇష్టమైనపాటలు.. ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.
♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫ నాబెస్ట్ఫ్రెండ్సంగీతం...మనసుకుహాయికలిగినా, బాధఅనిపించినాపాటలు నాకుమంచితోడు.