ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే...మంత్రి నువ్వే సైన్యం నువ్వే..
ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోనా
పలకా నువ్వే బలపం నువ్వే...ప్రశ్నా నువ్వే బదులు నువ్వే..
అన్నీ నువ్వే కావాలీ అనునిత్యం పోరాడాలీ
అనుకున్నది సాధించాలీ..
అవమానాలే ఆభరణాలు..అనుమానాలే అనుకూలాలు
సందేహాలే సందేశాలు ఛీత్కారాలే సత్కారాలు
అనుకోవాలీ అడుగేయాలీ..ముళ్ల మార్గాన్ని అన్వేషించాలి
అలుపొస్తున్నా కలలేకన్నా..పూల స్వర్గాన్ని అధిరోహించాలి
ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వేసాగాలి

బలము నువ్వే బలగం నువ్వే..ఆటా నీదే గెలుపూ నీదే
నారు నువ్వే నీరు నువ్వే కోతా నీకే పైరూ నీకే
నింగిలోన తెల్లమేఘం..నల్లబడితేనే జల్లులు కురిసేను
చెట్టుపైనా పూలు మొత్తం..రాలిపోతేనే పిందెలు కాసేను
ఒక ఉదయం ముందర చీకట్లు..విజయం ముందర ఇక్కట్లు
రావడమన్నది మామూలు

సాహసమే చెయరా ఢింభకా అన్నది కదరా పాతాళ భైరవీ
చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నదీ
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం..

0 వ్యాఖ్యలు:
Post a Comment