.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Director - రామ్ గోపాల్ వర్మ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Director - రామ్ గోపాల్ వర్మ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జులై 2020, ఆదివారం

ఎపుడో అపుడు కలంటు రాని



ఎపుడో అపుడు కలంటు రాని
కన్నులు ఎందుకు



ఎపుడో అపుడు కలంటు రాని
కన్నులు ఎందుకు
ఎవరో ఒకరు జతంటు లేని బ్రతుకింకెదుకూ

తపించూ ప్రేమ కోసం
జపించూ ప్రేమ మంత్రం
ఏ తోడూ లేకపోతే అలసిపోదా జీవితం

ప్రపంచానికొస్తావు ఏకాకి లాగా
ఏదో నాడు వెలతావు ఏకాకి లాగా
ప్రతి నిమిషం ఒంటిగా నడకెందుకంట
ఒక హృదయం దొరికితే అలుపుండదంట

నీ వెంట నీడై నడిచే ఇంకొకరి ప్రాణం
విసుగురాదు ఎన్నాలైనా చేసే ప్రయాణం

నేలతోటి ఆకాశం మాటాడుతుంది
తీరంతో ప్రతి కెరటం ఆటాడుతుంది
ఏ బదులూ అడగనీ పిలుప్పెక్కడుందీ
ఏ చెలిమీ కోరని మనసెక్కడుందీ

భాషుంది భావముందీ మనిషైన నీకు
అందించకుండా లోలో బంధించుకోకు

ఎపుడో అపుడు కలంటు రాని
కన్నులు ఎందుకు
ఎవరో ఒకరు జతంటు లేని బ్రతుకింకెదుకూ

తపించూ ప్రేమ కోసం
జపించూ ప్రేమ మంత్రం
ఏ తోడూ లేకపోతే అలసిపోదా జీవితం


చిత్రం - రంగీలా (1995)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - లతా మంగేష్కర్


24, జులై 2020, శుక్రవారం

హాయ్ రామ ఊరికే



హాయ్ రామ  ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగ ఉండేదెలా



హాయ్ రామ  ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగ ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది

ఇంట బయట నన్ను వెంటాడే నీ కన్ను
మాటే విననంటున్నది
పోనీలే అనుకుంటే ఇంకా ఇంకా అంటూ
తెరలే దాటొస్తున్నది

నా కళ్ళతోటి నీ అందం నువ్వే చూడు ఒకసారి
నాలాగే నీకు నిలువెల్లా రాదా ఆవిరి

హాయ్ రామ  ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగ ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది.
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది

నాదే తప్పా అంతా నేనేం చేశా అంత
నేరం మరి నీదేకదా
వేళాపాళ లేక వేడెక్కిస్తూ ఇట్టా
దూరం అంటే ఎలా

ఆపొద్దు నన్ను అల్లరిగా మరీ అంత ఆకలిగా
లాగొద్దు ఒడికి తుంటరిగా ప్రాణం తీయకా 

హాయ్ రామ ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగ ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది.
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది


చిత్రం - రంగీలా (1995)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల
గానం - హరిహరన్, స్వర్ణలత 

22, జులై 2020, బుధవారం

ఏమిటో ఏమో ఈ ప్రేమా



ఏమిటో ఏమో ఈ ప్రేమ 
శాపమో వరమో ఈ ప్రేమ



ఏమిటో ఏమో ఈ ప్రేమ శాపమో వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమ
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో అమృతమో చెప్పేవారే లేరమ్మా

ఏమిటో ఏమో ఈ ప్రేమ  శాపమో వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమ
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో అమృతమో చెప్పేవారే లేరమ్మా

ఏ నిముషం ఇది మొదలవుతుందో తెలియదు
గుండెల్లో చేరేముందు అనుమతి అడగదు
మనసుంటే ప్రేమించక మానదు
ప్రేమిస్తే మనదంటూ మనకే మిగలదు

అక్షరాలు రెండే అయినా 
లక్షలాది కధలను రాసే
ఈ ప్రేమలో పడి నిలబడ తరమా

ఏమిటో ఏమో ఈ ప్రేమ శాపమో వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమ
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో అమృతమో చెప్పేవారే లేరమ్మా 

పగలేమో తరగని అల్లరి ఊసులు
రాత్రంతా తరగని తేనెనీ ఊహలు
కలిసిన క్షణమున నిలవని తపనలు
ఏకాంతంలో నయినా విడువని తలపులు

ఋతువులకే రంగులు మార్చే
మెలకువకే కళలను నేర్పే
ఈ ప్రేమ గారడి  ఎవ్వరి మహిమా 

ఏమిటో ఏమో ఈ ప్రేమ శాపమో వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమ
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో అమృతమో చెప్పేవారే లేరమ్మా 


చిత్రం - రంగీలా (1995)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - హరిహరన్,కవితా కృష్ణ మూర్తి 


20, జులై 2020, సోమవారం

యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే



యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే



యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే

జనమందరిలో మనమెవరంటే
తెలిసుండాలి ఒక విలువుండాలి
ఘనచరితలు గల కొందరిలో
మన పేరుండాలి తగు ప్లేసుండాలి

నలుగురూ గొప్పగా చూడగా
ప్రతిదినం కొత్తగా ఉండగా
బతకడం అప్పుడే పండుగా

యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే

లోకంలోనే ఉంటూ
 చుట్టూ బతుకును చూస్తూ
జీవించటమంటేనే 
తెలియనివాళ్ళను చూస్తే జాలి

కనిపించని తలరాత అరచేతుల్లో గీత
బతుకును నడిపిస్తాయని 
నమ్మే వాళ్ళను ఏం చెయ్యాలి

ఊరికే ఊహలో ఉండకా 
నిజముగా మార్చుకో  కోరికా 
నింగిలో నిలిచిపో తారగా

యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే


చిత్రం - రంగేళి (Hindi - రంగీలా)(1995)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - సిరివెన్నెల
గానం - S.జానకి
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.