ఎపుడో అపుడు కలంటు రాని
కన్నులు ఎందుకు
ఎవరో ఒకరు జతంటు లేని బ్రతుకింకెదుకూ
తపించూ ప్రేమ కోసం
జపించూ ప్రేమ మంత్రం
ఏ తోడూ లేకపోతే అలసిపోదా జీవితం
ప్రపంచానికొస్తావు ఏకాకి లాగా
ఏదో నాడు వెలతావు ఏకాకి లాగా
ప్రతి నిమిషం ఒంటిగా నడకెందుకంట
ఒక హృదయం దొరికితే అలుపుండదంట
నీ వెంట నీడై నడిచే ఇంకొకరి ప్రాణం
విసుగురాదు ఎన్నాలైనా చేసే ప్రయాణం
నేలతోటి ఆకాశం మాటాడుతుంది
తీరంతో ప్రతి కెరటం ఆటాడుతుంది
ఏ బదులూ అడగనీ పిలుప్పెక్కడుందీ
ఏ చెలిమీ కోరని మనసెక్కడుందీ
భాషుంది భావముందీ మనిషైన నీకు
అందించకుండా లోలో బంధించుకోకు
ఎపుడో అపుడు కలంటు రాని
కన్నులు ఎందుకు
ఎవరో ఒకరు జతంటు లేని బ్రతుకింకెదుకూ
తపించూ ప్రేమ కోసం
జపించూ ప్రేమ మంత్రం
ఏ తోడూ లేకపోతే అలసిపోదా జీవితం
చిత్రం - రంగీలా (1995)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - సిరివెన్నెల
గానం - లతా మంగేష్కర్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి