.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, జులై 2020, గురువారం

ఆమని ఋతువు వచ్చినదేఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదేఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే

పరిమళములతో  వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా 
ఏవో చింతలు ముసిరేనే .. మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హో.. హో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో  వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా 

వేదనలే రగిలేనె రోదనలే మిగిలేనె
తన జ్ఞాపకాలు నాలోన సైయ్యాటలాడే
అడుగులను కలిపామే జతగాను నడిచామె
విపరీతమిలా ఇద్దరిని విడదీసినదే

చేరువనున్న చేరదురా  ఆవేదన ఇక తీరదులె
చీకటి తెర ఏదో మా నడుమా ఉన్నదే

ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనే  హో.. హో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో  వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట

గానమునే విన్నాను హృదయమునే ఇచ్చాను
ఆ జాలిలేని విధి మా పాలిట వికటించినదీ
నేనిచటా బికారిని తను అచట విరాగిణి
ఏకాంతము ఇద్దరి నీడగ మారినది

కలయికలో ఎడబాటు జరిగినదే పొరపాటు
కన్నులలోనా వసంతమెదలో శిశిరం

ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హో.. హో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట 


చిత్రం - జోధా అక్బర్ (2006)
సంగీతం -  A.R.రెహమాన్
గీతరచన - రాజశ్రీ
గానం - శ్రీనివాస్ 

28, జులై 2020, మంగళవారం

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యాచల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా ఎంత అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మాని
ఎంత అలకే కిన్నెరసాని

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 

చెలి కిలకిలలే చిటికేయ హోయ్య 
చెలి కిలకిలలే చిటికేయ
మది చెదిరి కథాకళి చెయ్య .. హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 

ఓ కన్నియపై చూపున్నదయా ఎదట పడే చొరవుండదయా
మనసాపలేక మాటాడలేక ఒక ఖయ్యామై తయ్యారయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా

ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా
ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా

తన వెంటపడే నా మనవి విని ఏనాటికి కనిపించేనయ్యా
తన వెంటపడే నా మనవి విని  ఏనాటికి కనిపించేనయ్యా

ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా
 తన వెంటపడే నా మనవి విని  ఏనాటికి కనిపించేనయ్యా

తొలగేన మరీ ఈ మాయ తెరా
తన చెలిమి సిరీ నా కలిమి అనీ
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి

జాలిపడైనా ఓయ్ అనదే మర్యాదకైన పరదా విడదే
అపరంజి చిలక శ్రమ పడిన ఫలితమై
నా వైపే వస్తూ ఉన్నదయా

చెలి కిలకిలలే చిటికెయ్య  హోయ్య
చెలి కిలకిలలే చిటికెయ్య
మది చెదిరి కథాకళి చెయ్యా హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
  చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా

మదినూయలలూపే సొగసయ్యా
తొలి తూర్పు కాంతులే చెలి ఛాయా
పరువాల తరంగమే తానయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా

 ఎంతటి అలకే కిన్నెరసాని మావని చేరే అల్లరి మానీ
ఎంతటి అలకే కిన్నెరసాని  మావని చేరే అల్లరి మానీ
చెప్పరయ్య నా జాణ తోటి  తన కంటపడే దారేదయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 

చెలి కిలకిలలే చిటికెయ్య హోయ్య
చెలి కిలకిలలే చిటికెయ్య
మది చెదిరి కథాకళి చెయ్యా హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 

ఓ కన్నియపై చూపున్నదయా ఎదట పడే చొరవుండదయా
మనసాపలేక మాటాడలేక  ఒక ఖయ్యామై తయ్యారయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా  


చిత్రం - ప్రేమతో (దిల్ సే) (1998)
సంగీతం - ఏ.ఆర్.రహ్మాన్ 
 గీతరచన - - సిరివెన్నెల 
గానం -  Sukhwinder Singh

26, జులై 2020, ఆదివారం

ఎపుడో అపుడు కలంటు రానిఎపుడో అపుడు కలంటు రాని
కన్నులు ఎందుకుఎపుడో అపుడు కలంటు రాని
కన్నులు ఎందుకు
ఎవరో ఒకరు జతంటు లేని బ్రతుకింకెదుకూ

తపించూ ప్రేమ కోసం
జపించూ ప్రేమ మంత్రం
ఏ తోడూ లేకపోతే అలసిపోదా జీవితం

ప్రపంచానికొస్తావు ఏకాకి లాగా
ఏదో నాడు వెలతావు ఏకాకి లాగా
ప్రతి నిమిషం ఒంటిగా నడకెందుకంట
ఒక హృదయం దొరికితే అలుపుండదంట

నీ వెంట నీడై నడిచే ఇంకొకరి ప్రాణం
విసుగురాదు ఎన్నాలైనా చేసే ప్రయాణం

నేలతోటి ఆకాశం మాటాడుతుంది
తీరంతో ప్రతి కెరటం ఆటాడుతుంది
ఏ బదులూ అడగనీ పిలుప్పెక్కడుందీ
ఏ చెలిమీ కోరని మనసెక్కడుందీ

భాషుంది భావముందీ మనిషైన నీకు
అందించకుండా లోలో బంధించుకోకు

ఎపుడో అపుడు కలంటు రాని
కన్నులు ఎందుకు
ఎవరో ఒకరు జతంటు లేని బ్రతుకింకెదుకూ

తపించూ ప్రేమ కోసం
జపించూ ప్రేమ మంత్రం
ఏ తోడూ లేకపోతే అలసిపోదా జీవితం


చిత్రం - రంగీలా (1995)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - లతా మంగేష్కర్


24, జులై 2020, శుక్రవారం

హాయ్ రామ ఊరికేహాయ్ రామ  ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగ ఉండేదెలాహాయ్ రామ  ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగ ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది

ఇంట బయట నన్ను వెంటాడే నీ కన్ను
మాటే విననంటున్నది
పోనీలే అనుకుంటే ఇంకా ఇంకా అంటూ
తెరలే దాటొస్తున్నది

నా కళ్ళతోటి నీ అందం నువ్వే చూడు ఒకసారి
నాలాగే నీకు నిలువెల్లా రాదా ఆవిరి

హాయ్ రామ  ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగ ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది.
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది

నాదే తప్పా అంతా నేనేం చేశా అంత
నేరం మరి నీదేకదా
వేళాపాళ లేక వేడెక్కిస్తూ ఇట్టా
దూరం అంటే ఎలా

ఆపొద్దు నన్ను అల్లరిగా మరీ అంత ఆకలిగా
లాగొద్దు ఒడికి తుంటరిగా ప్రాణం తీయకా 

హాయ్ రామ ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగ ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది.
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది


చిత్రం - రంగీలా (1995)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల
గానం - హరిహరన్, స్వర్ణలత 

22, జులై 2020, బుధవారం

ఏమిటో ఏమో ఈ ప్రేమాఏమిటో ఏమో ఈ ప్రేమ 
శాపమో వరమో ఈ ప్రేమఏమిటో ఏమో ఈ ప్రేమ శాపమో వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమ
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో అమృతమో చెప్పేవారే లేరమ్మా

ఏమిటో ఏమో ఈ ప్రేమ  శాపమో వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమ
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో అమృతమో చెప్పేవారే లేరమ్మా

ఏ నిముషం ఇది మొదలవుతుందో తెలియదు
గుండెల్లో చేరేముందు అనుమతి అడగదు
మనసుంటే ప్రేమించక మానదు
ప్రేమిస్తే మనదంటూ మనకే మిగలదు

అక్షరాలు రెండే అయినా 
లక్షలాది కధలను రాసే
ఈ ప్రేమలో పడి నిలబడ తరమా

ఏమిటో ఏమో ఈ ప్రేమ శాపమో వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమ
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో అమృతమో చెప్పేవారే లేరమ్మా 

పగలేమో తరగని అల్లరి ఊసులు
రాత్రంతా తరగని తేనెనీ ఊహలు
కలిసిన క్షణమున నిలవని తపనలు
ఏకాంతంలో నయినా విడువని తలపులు

ఋతువులకే రంగులు మార్చే
మెలకువకే కళలను నేర్పే
ఈ ప్రేమ గారడి  ఎవ్వరి మహిమా 

ఏమిటో ఏమో ఈ ప్రేమ శాపమో వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమ
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో అమృతమో చెప్పేవారే లేరమ్మా 


చిత్రం - రంగీలా (1995)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - హరిహరన్,కవితా కృష్ణ మూర్తి 


20, జులై 2020, సోమవారం

యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరేయాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారేయాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే

జనమందరిలో మనమెవరంటే
తెలిసుండాలి ఒక విలువుండాలి
ఘనచరితలు గల కొందరిలో
మన పేరుండాలి తగు ప్లేసుండాలి

నలుగురూ గొప్పగా చూడగా
ప్రతిదినం కొత్తగా ఉండగా
బతకడం అప్పుడే పండుగా

యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే

లోకంలోనే ఉంటూ
 చుట్టూ బతుకును చూస్తూ
జీవించటమంటేనే 
తెలియనివాళ్ళను చూస్తే జాలి

కనిపించని తలరాత అరచేతుల్లో గీత
బతుకును నడిపిస్తాయని 
నమ్మే వాళ్ళను ఏం చెయ్యాలి

ఊరికే ఊహలో ఉండకా 
నిజముగా మార్చుకో  కోరికా 
నింగిలో నిలిచిపో తారగా

యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే


చిత్రం - రంగేళి (Hindi - రంగీలా)(1995)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - సిరివెన్నెల
గానం - S.జానకి

18, జులై 2020, శనివారం

స్ట్రాబెర్రి కన్నే ... ఊర్వశి వన్నే
స్ట్రాబెర్రి కన్నే ... ఊర్వశి వన్నే
సిల్వర్ స్పూన్ చేత్తోనే పుట్టినదానస్ట్రాబెర్రి కన్నే ... ఊర్వశి వన్నే
సిల్వర్ స్పూన్ చేత్తోనే పుట్టినదాన
ఫ్రిడ్జ్ లోన ఆపిల్ లా నవ నవ కన్నా
వెండి కంచం జోడు బెంజ్ AC కారు
ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేల
తనువు విడిపోయిందా  చనువు కరువయ్యిందా
ఉలుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేల

ఏంట్రా రియాక్షనే లేదు .. వాల్యూం పెంచాలేమో  

స్ట్రాబెర్రి కన్నే ... ఊర్వశి వన్నే
సిల్వర్ స్పూన్ చేత్తోనే పుట్టినదాన
ఫ్రిడ్జ్ లోన ఆపిల్ లా నవ నవ కన్నా
వెండి కంచం జోడు బెంజ్ AC కారు
ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేల
తనువు విడిపోయిందా  చనువు కరువయ్యిందా
ఉలుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేల

నీ ఆడతనం బేలతనం ఇప్పుడు మరుగై
నీ కల్పనలే అద్భుతమై నిప్పులు చెరిగే
ముగించవే..  పైత్యం..  ఫలించనీ .. వైద్యం

పాత పైత్యం పిచ్చితనం రెండు చెల్లే
నీది వైద్యం వెర్రితనం నాడే చెల్లే
ముందు తరతరాలెవ్వరు మూఢులు కాదే
నాలోన గొడవేదింక

అతని సేవలో ఎప్పుడు లాభం లేదు
మనిషి సేవలే చేసినా తప్పేం లేదు
నేను ఎన్నడు భూమికి భారం కాను
నా బాటలో నరకం లేదు 
నిన్న కలలే కన్నా నేడు కలిసే కన్నా
నాడు తాళితో చితికైన జత కాలేను
ముందు మాల యోగం వెనక సంకెల బంధం
ఇంక గజిబిజి కళ్యాణం దోవే రద్దు

అయ్యో పెళ్లొద్దంట .. రూట్ మార్చు

కన్నె కళ్ళు ఎన్నో కళలు ఈ చెక్కిళ్ళు ఎంత ఇష్టం
తల్లో పూసిన తామర నేత్రం
ఏం పెదవి అది ఏం పెదవి
చెర్రి పండు వంటి చిన్ని పెదవి

నోసే కొంచెం ఓవర్ సైజు
ఇట్స్ ఓకే ప్లాస్టిక్ సర్జరీ చేయిద్దాం

ఏయ్ స్ప్రింగ్ బాడీ ఇలా రా
నిద్దర లేవగానే మొహం చూస్కునే అలవాటుందా
అఫ్ కోర్స్  .. ఏం చూశావ్
అందమైన ఫేసమ్మా
కాదు జూనుంచి తప్పించుకొచ్చిన కోతిని

ఎవరి ముక్కు ఎవరి పాలు చేసి పెట్టినదెవరో
ఉన్న మెదడు తమకు నిండు సున్నా చేసినదేవరో
ఎవరహో..  పురుషుడో..   మంకీయా.. మనిషియా


చిత్రం - మెరుపుకలలు (1997)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన -  వేటూరి 
గానం - మనో, స్వర్ణలత

16, జులై 2020, గురువారం

మచిలీపట్నం మామిడి చిగురులోమచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంటఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి

ఊ..లలల్లా ఉహూ..లలల్లా  ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా  ఉహూ లల లలలలా

మెట్టదారి ఇదే బండికి వాలు ఇదే ఓ పొంకాల పోరి ఒకతి
పోరి కట్టుకున్న చీర పొగరు చూశా వాన విల్లు వర్ణం ఆహా
మనసున మల్లె వాన చింది చింది సుధ చిలికే నయగారం
మరి ఎద వాలి గిల్లి కొత్త తాళమడిగినదే చెలగాటం

ఊ..లలల్లా ఉహూ..లలల్లా  ఉహూ లల లలలలా

తందానా తందానా తాకి మరి తందానా  
ఏ తాళం వాయించాడే
తందానా తందానా పాట వరస తందానా 
ఏ రాగం పాడిస్తాడే

సిరి వలపో మతిమరుపో అది హాయిలే
సిరి పెదవో విరి మధువో ప్రియమేనులే
తందానా తందానా కన్నె ప్రేమ తందానా 
వచ్చిపోయె వాసంతాలే

మనసిజ మల్లెవీణ సిగ్గు సిగ్గు లయలొలికే వ్యవహారం
అది అలవాటుకొచ్చి గుచ్చి చూసి మనసడిగే చెలగాటం

హూ ..లలల్లా ఉహూ..లలల్లా  ఉహూ లల లలలలా
ఓహో హూ..లలల్లా ఉహూ..లలల్లా  ఉహూ లల లలలలా

మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి

తందానా తందానా ఊసుకనుల తందానా 
ఊరించే తెట్టు తేవె
తందానా తందానా పాటకొక తందానా 
చెవి నిండా గుమ్మత్తేలే

వయసులలో వరసలలో తెలియందిదే
మనసుపడే మౌన సుఖమే విరహానిదే
తందానా తందానా మేఘరాగం తందానా
వచ్చె వచ్చె వానజల్లే

మధురస మాఘ వేళ కన్నుగీటి కథ నడిపే సాయంత్రం
తొలిచెలి గాలి సోలి కొత్త తోడు కలిసినదే చెలగాటం

ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా

మచిలీపట్నం మామిడి చిగురులో
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మా చిలక మా చిలక మా చిలక
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా


చిత్రం - మెరుపుకలలు (1997)
సంగీతం - A.R.రెహమాన్ 
గీతరచన -  వేటూరి
గానం - శ్రీని, ఉన్నిమీనన్, చిత్ర
 

14, జులై 2020, మంగళవారం

అది అరబిక్ కడలందం తడి తళుకే కన్నాలేఅది అరబిక్ కడలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వణుక్కు కౌగిళ్ళడిగానేఅది అరబిక్ కడలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వణుక్కు కౌగిళ్ళడిగానే
హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హే. .హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా

విప్పారే తామరవే రూపంతా కన్నాలే
నీ పట్టూ రైకల విదియ తదియ వైనం చూశాలే
హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హేహే .. హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా

ఈడే వచ్చి ముందు జారే మోజులకు అహా ఎంత సుఖమో
పైలాపచ్చి పసి వేళ్ళే తగిలినపుడు అహా ఎంత ఇహమో
చిత్రాంగీ చిలక రాత్రీపగలనక ముక్తాయించే నడుమో
అందం దాని మొత్తం అంతేలేని విదం అయ్యో దివ్య పథమో

హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హేహే..హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా

అది అరబిక్ కడలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వనుక్కు.కన్నా కన్నే తీరా

హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హేహే.. హమ్మా హమ్మ హమ్మ హమ్మా

విప్పారే తామరవే రూపంతా కన్నాలే
నీ పట్టూ రైకల విదియ తదియ వైనం చూశాలే
హమ్మా  హేహే...  హమ్మా

ఏదో సరసమిది ఎంతో విరహమిది మొత్తం మీద చిలకో
తాపం మంచమెక్కి దీపం కొండ ఎక్కి కంట్లో వెలిగె మనసు
ఫనా పొలింత మీద భూమీ వాడంత పొంగి తల్లో సెగలు పెరిగే
తాపం కరిగిపోయె కళ్ళే నిదరపోయె కాని మనసు బెణికె

హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హేహే .. హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా

అది అరబిక్ కడలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వనుక్కు కౌగిళ్ళడిగానే

హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హే. .హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హే.. హమ్మా హమ్మా హమ్మా
 

చిత్రం - బొంబాయి (1995)
సంగీతం - A..R. రెహమాన్ 
గీతరచన - వేటూరి
గానం - రెమో ఫెర్నాండెజ్ 

12, జులై 2020, ఆదివారం

పూలకుంది కొమ్మపూలకుంది కొమ్మ పాపకుంది అమ్మ
గుల్లగుల్ల హల్లగుల్ల
పూలకుంది కొమ్మ పాపకుంది అమ్మ
గుల్లగుల్ల హల్లగుల్ల
నింగి నేల డీడిక్కి నీకు నాకు ఈడెక్కి
గుల్లగుల్ల హల్లగుల్ల

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల

పున్నాగపూలకేల దిగులు
మిన్నేటి పక్షికేది కంటి జల్లు
రవి ఎన్నడూ రాత్రి చూడలేదు
స్వర్గానికి హద్దూ పొద్దు లేనే లేదు
గుల్లగుల్ల హల్లగుల్ల .. గుల్లగుల్ల హల్లగుల్ల

కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్ళు
మేఘాలు గాయపడితే మెరుపల్లె నవ్వుకుంటాయ్
కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీల్లు
మేఘాలు గాయపడితే  మెరుపల్లె నవ్వుకుంటాయ్

ఓటమిని తీసేయ్ జీవితాన్ని మోసేయ్
వేదాలు జాతిమత బేధాలు లేవన్నాయ్

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా

మౌనంలోని గానం ప్రాణంలోని బంధం
ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎదనింక తారల్లోకి
ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎదనింక తారల్లోకి
విజయం కోరే వీరం చిందిస్తుందా రక్తం
అనురాగం నీలో ఉంటే  ఆకాశం నీకు మొక్కు

గుల్లగుల్ల హల్లగుల్ల గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల గుల్లగుల్ల హల్లగుల్ల
కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్ళు 
జీవితాన్ని మోసేయ్ ఓటమిని తీసేయ్
మౌనంలోని గానం ప్రాణంలోని బంధం
విజయం కోరే వీరం

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
నీలో నేనే ఉన్నానా రూప్  తేరా మస్తానా


చిత్రం - బొంబాయి (1994)
సంగీతం - ఏ.ఆర్.రెహమాన్
గీతరచన  - వేటూరి 
గానం అనుపమ,నోయల్, పల్లవి,శ్రీనివాస్ 

10, జులై 2020, శుక్రవారం

పదహారు ప్రాయంలో ..పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ
నేటి సరికొత్త జాజి పువ్వల్లె నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీనేడే నేడే నేడే నేడే కావాలీ .. నేడే కావాలీ
పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ
నేటి సరికొత్త జాజి పువ్వల్లె నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ

వెబ్సైటు కెళ్ళి లవ్ ఫైలు తెరచి
ఇ-మెయిల్ హసుకే కొట్టాలీ
చెమట పడితే వానలో తడిస్తే
ముఖము ముఖముతో తుడవాలి

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా
గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్టే కదా
గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫె వేస్టే కదా

గర్ల్ ఫ్రెండ్ కావాలీ 
పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ
నేటి సరికొత్త జాజి పువ్వల్లె నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ

ఫ్రెండ్ యొక్క కవితను తెచ్చి 
నాయొక్క కవిత అని చెప్పి
హృదయంలో చోటే పట్టంగా
ఫ్లాపైన సినిమాకు వెళ్ళి కార్నర్ లొ సీటొకటి పట్టి
బబుల్గం చిరుపెదవుల మార్చంగా
 సెల్ఫొను బిల్ల్ పెరగ జోకులతో చెవి కొరక
ఎస్ ఎం ఎస్ పంప కావలె గర్ల్ ఫ్రెండులే

నాతోటి నడిచేటి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ
కాలం మరిచేటి కబురులాడేటి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి
చంద్రుని చెణుకై గదిలో చినుకై సంపంగి మొలకై ఉండాలీ
ఇంకొక నీడై ఇంకొక ప్రాణమై ఇరవై వేళ్ళై ఉండాలి

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా
గర్ల్ ఫ్రెండ్స్ అంటే బొయ్స్ కి బూస్టే కదా
గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫె వేస్టే కదా .. గర్ల్ ఫ్రెండ్ కావలె

బైకెక్కి ఊరంత తిరగ .. ఆ  అంటే ట్రీట్ ఇచ్చు కొనగ
ఊః అంటే గ్రీటింగ్ కార్డ్ ఇవ్వంగ
హాచ్చ్ అంటే కర్చీఫు ఇచ్చి
ఊ..  అంటె కుడిబుగ్గ చూపి
టక్ అంటే తలమీద కొట్టంగ
చూస్తే బల్బ్ వెలగ బార్బిడాల్ వంటి
పోనీ టెయిల్ తోటి కావాలె గర్ల్ ఫ్రెండ్ లే

గర్ల్ ఫ్రెండ్స్ అంటే బొయ్స్ కి బూస్టే కదా
గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫె వేస్టే కదా
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా


చిత్రం - బాయ్స్ (2003)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన  -  A.M.రత్నం, శివగణేష్
గానం - కార్తీక్, డిమ్మి,టిప్పు

8, జులై 2020, బుధవారం

ఓ వెన్నెలా తెలిపేదెలాఓ వెన్నెలా తెలిపేదెలా 
ఓ నేస్తమా పిలిచేదెలాఓ వెన్నెలా తెలిపేదెలా 
ఓ నేస్తమా పిలిచేదెలా

కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వై  పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వై పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా

జడివాన నింగిని తడిచేయునా 
గంధాలు పువ్వుని విడిపోవునా
నన్నడిగి ప్రేమ ఎద చేరెనా 
వలదన్న ఎదను విడిపోవునా

మరిచాను అన్నా మరిచేదెలా 
మరిచాక నేను బ్రతికేదెలా

ఓ వెన్నెలా తెలిపేదెలా

వలపించు హృదయం ఒకటే కదా 
ఎడమయితే బ్రతుకు బరువే కదా
నిలిపాను ప్రాణం నీకోసమే 
కలనైన కూడా నీ ధ్యానమే

మదిలోని ప్రేమ చనిపోదులే 
ఏనాటికైనా నిను చేరులే

ఓ వెన్నెలా తెలిపేదెలా 
ఓ నేస్తమా పిలిచేదెలా

కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వై పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వై పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా


చిత్రం - ప్రేమదేశం (1996)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - భువనచంద్ర 
గానం - ఉన్నికృష్ణన్ 


6, జులై 2020, సోమవారం

ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫాముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫాOoh yeah friendship
Ooh yeah friendship
Friendship is what we are looking for

ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా

Day by day ... Day by day 
కాలం ఒడిలో day by day
పయనించే shipఏ friend ship రా
ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా

జూన్ పోయి జులై పుడితే
సీనియర్  కి జూనియర్  కి
కాలేజ్ క్యాంపస్  లోనే రాగింగ్ ఆరంభం

స్టూడెంట్ మనసో  నందనవనం
మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్
స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందోయ్  సాయం

వాడిపోనిది స్నేహమొక్కటే
వీడిపోనిది నీడ ఒక్కటే
హద్దంటూ లేనే లేనిదీ ఫ్రెండ్ షిప్  ఒక్కటే

కష్టమొచ్చినా నష్టమొచ్చినా
మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే
కాలేజ్  స్నేహం ఎపుడు అంతం కానిదే

ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
Day by day ... Day by day 
కాలం ఒడిలో day by day
పయనించే shipఏ friend ship రా

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలూ
ఏడనించో గోరు వంకలు
కాలేజ్ క్యాంపస్ లోన నాట్యం చేసెనే

కన్నెపిల్లల కొంటె నవ్వులు
కుర్ర మనసుల కౌగిలింతలు
కాలేజ్ కాంపౌండ్ అంటే కొడైకెనాలే

Course ముగిసే రోజు వరకు
తుళ్ళిపడిన కుర్ర ఎదలో
కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి

స్నేహితుల్ని వీడిపోయే
రోజు మాత్రం కంటినిండా
కన్నీటి తోనేనంట ఫేర్ వెల్ పార్టీ 

ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా

Day by day ... Day by day 
కాలం ఒడిలో day by day
పయనించే shipఏ friend ship రా

ముస్తఫా ముస్తఫా Don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా


చిత్రం - ప్రేమ దేశం (1996)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - భువనచంద్ర 
గానం - A.R. రెహమాన్

4, జులై 2020, శనివారం

హల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే హల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే
పల్స్ చూస్తే ఫాస్ట్ బీటాయే హల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే
పల్స్ చూస్తే ఫాస్ట్ బీటాయే
కేడ్బరీస్ సహించదే కాలేజ్ బోర్ ఆయే
కుషన్ బెడ్ తరించదే నిదరోయి నెలలాయే   

 హల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే


బుక్స్ పట్టి కాలేజ్ పోతే పుట్టుకొచ్చే L O V E
రిలాక్స్ కోసం మూవీ కెళ్తే మూవీ అంతా L O V E
హాలివుడ్ లండన్ పేరిస్ బెహరైన్ లోకమంతా L O V E
రాకెట్ ఎక్కి మూన్ కి పోతే అక్కడ కూడా L O V E

 హల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే

పల్స్ చూస్తే ఫాస్ట్ బీటాయే
కేడ్బరీస్ సహించదే కాలేజ్ బోర్ ఆయే
కుషన్ బెడ్ తరించదే నిదరోయి నెలలాయే   

నో  క్రెడిట్ కార్డ్ ..  నో లవ్
నోనో కార్ ..  నో లవ్
నో లైస్ ..  నో లవ్

స్కానింగ్ చేసి బబ్రెయిన్ ని చూస్తే సెల్స్ లోన L O V E
టెస్ట్ కోసం రక్తాన్నిస్తే బ్లడ్ గ్రూపే L O V E
ఓపెన్ చేసి హార్ట్ ని చూస్తే వాల్వ్ లోన  L O V E
నాడిని పట్టి పల్స్ ని చూస్తే నరాలు పాడే L O V E

  ఫైవ్ స్టార్ బిల్ పడినాదే
మెక్ డొవల్స్ దిగి పోయిందే
ఐస్ ఐస్ మీట్ ఐతే  హై వోల్టేజ్ పాసైందే
స్కూల్ బెబిలా మాటలు వింటే కూల్ బాడిలే హీటాయే
మేరీ స్టెల్లా పోయావే మెంటల్ పేషంట్ అయ్యావే

 హల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే

పల్స్ చూస్తే ఫాస్ట్ బీటాయే
కేడ్బరీస్ సహించదే కాలేజ్ బోర్ ఆయే
కుషన్ బెడ్ తరించదే నిదరోయి నెలలాయే  

ఇది కాలేజ్ ప్రేమ .. పిచ్చి  .. ఓ కన్నె పిల్లని చూసి 


చిత్రం - ప్రేమదేశం (1996)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - భువనచంద్ర
గానం - K.K. శ్రీనివాస్, అనుపమ, నోయల్ జేమ్స్

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.