.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Private Album Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Private Album Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, మే 2020, శుక్రవారం

మరుపేలేని సంతకం.. పెళ్లిపుస్తకం



మరుపేలేని సంతకం .. పెళ్లిపుస్తకం
మరుజన్మకే తొలి స్వాగతం .. పెళ్లిపుస్తకం



తన ప్రాణాలె  నీవని .. ధర్మేఛగా
తన మనసంత నీదని .. అర్దేఛగా
తన వలపంత నీకని .. కామేఛగా
అవధులు లేని ప్రేమకై .. మోక్షేగా 

మూడుముళ్లతో  ఏడు అడుగులా 
అగ్నిసాక్షిగా 
ఇద్దరూ  ఒకటిగా మారెగా

మరుపేలేని సంతకం .. పెళ్లిపుస్తకం
మరుజన్మకె తొలి స్వాగతం .. పెళ్లిపుస్తకం

ప్రేమ పెళ్లి పేరుతో ఇరువురిలోన 
ప్రేమ మాత్రమే
బంధుమిత్ర ప్రేమలే కలిసిన 
నాదేలే పెళ్లనగా

కన్నవాళ్ళ ఆశలే 
కలిసిన స్వర్గలోక దీవెనే
నువ్వు నేను మాటనే మార్చే మాటే 
ఈ పెళ్లనగా

తోడు నీడగా ప్రాణబంధమా
నీతొ  ఉండనా 
శాశ్వతం శాశ్వతం మనమికా

మరుపేలేని సంతకం .. పెళ్లిపుస్తకం
మరుజన్మకె తొలి స్వాగతం .. పెళ్లిపుస్తకం 


పెళ్లిపుస్తకం Short  Film 
సంగీతం - వంశీకృష్ణ 
గీతరచన - దినేష్ గౌడ్ కక్కెర్ల 
గానం - సురేంద్రనాథ్ ,దీపు పార్ధసారధి 

13, మే 2020, బుధవారం

చెలి నా గుండెలో ఉండిపోవే



చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే
నువ్వే నా దానివే వేదానివే నవ్వే గోదారివే నా దారివే



చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే
చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే
నువ్వే నా దానివే వేదానివే నవ్వే గోదారివే నా దారివే
ప్రాణానివే గానానివే నా కోటలో రారాణివే

చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే

లేత చిరుగాలివే స్వాతిముత్యానివే
వేణుగానానివే పైన జాబిల్లివే
నమ్మవే నా చెలి అన్న హృదివేదన
గానమై సాగెనే ప్రేమ అభినందన

నువ్వు కావాలి రావాలి ఓ నేస్తమా
నీతో ఆడాలి పాడాలి నా ప్రియతమా
ప్రేమ నీవేలే నాలోని రాగానివే
ప్రేమ నీవేలే నా గుండె నా దానివే

చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే

వేల భావాలని నీకు తెలపాలని
గుండెలో భాషని విన్నవించాలని
ఎందుకో మనసులో ఇంత ఈ యాతన
నిన్ను చేరేదెలా చెప్పవే నా చెలి

నిన్ను చేరేటి దారేది ఓ కోయిలా
నిన్ను చూడాలి పాడాలి ప్రతిరోజిలా
అందుకే నీవు కావాలి ఓ అందమా
అందుకో ప్రేమ రాగాలు ప్రియబంధమా

చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే
నువ్వే నా దానివే వేదానివే నవ్వే గోదారివే నా దారివే
ప్రాణానివే గానానివే నా కోటలో రారాణివే
చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే


రాజ్ కుమార్ .వి 
Private Album

19, అక్టోబర్ 2019, శనివారం

మట్టిమనిషినండి నేను మాణిక్యమన్నారు నన్ను



మట్టిమనిషినండి నేను మాణిక్యమన్నారు నన్ను
పల్లెకోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట




సంగీతం - రఘు కుంచె
గీతరచన  - లక్ష్మీ భూపాల
గానం. - బేబి పసల

18, మార్చి 2012, ఆదివారం

నాప్రాణమా నను వీడిపోకుమా ...



వరంగల్ కు చెందిన నాగరాజు రాసిన అనిత అనితా అనే ప్రైవేట్ సాంగ్ ఒకప్పుడు
చాలా గుర్తింపు పొందింది.
ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే
ఆ భగ్నప్రేమికుడు పాడుకునే విరహ గీతం.
ఈ పాట వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరి మొబైల్ లో,ప్రతి చోటా ఈ పాట వినపడేది.సినిమా పాటలతో సమానం గా పాపులర్ అయ్యింది. ఈ పాటని ఇష్టపడినంత మాత్రాన ఇష్టపడే వాళ్ళందరూ భగ్న ప్రేమికులు కాదు..కొన్ని పాటలు అలా ఎప్పటికీ గుర్తుండి పోతాయి."అనితా ... అనితా ..."  పాట తర్వాత  భగ్న ప్రేమికుడిని ఓదారుస్తూ ప్రేమికురాలు పాడే " ఓ నేస్తమా నా స్నేహ బంధమా " పాట కూడా బాగుంటుంది.
 
నాప్రాణమా నను వీడిపోకుమా





Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.