"ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తునో ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించునో" అర్ధవంతమైన భావంతో, సాహిత్యంతో, సున్నితమైన సంగీతంతో మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట...
ప్రేమ అంటేనే స్వార్ధమని నమ్మే విద్యాధరి,ప్రేమ కన్నా గొప్ప శక్తి లేదని నిరూపించటానికి తపస్సు చేసిన అనుదీప్ . ప్రేమకి, ప్రేమ రాహిత్యానికి జరిగిన సంఘర్షణే ముత్యమంత ముద్దు..ఈ సినిమాలో సీత,రాజేంద్రప్రసాద్ ఇద్దరూ సహజంగా, అందంగా మంచి జంటగా సినిమాని ఎవర్ గ్రీన్ గా నిలిచేలా చేశారు... యండమూరి వీరేంద్రనాథ్ నవలలో నాకు చాలా నచ్చే నవల థ్రిల్లర్ ఈ ముత్యమంత ముద్దు సినిమా..
ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు ఈ పాటకి పూర్తిగా అర్ధం తెలియదు కానీ జేసుదాస్ గారి గంభీరమైన స్వరంతో, ఏదో పవిత్రమైన భావంతో వినాలనిపించే పాటల్లో ఇది ఒకటి .. ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా నాకు ఇష్టమైన పాట "స్వర రాగ గంగా ప్రవాహమే"
పాడుతున్న బాలు గారే కాదు వినే వాళ్ళను ఊపిరి తిప్పుకోనివ్వకుండా చేసిన వేటూరి , ఇళయరాజా , sp బాలు గారి అద్భుత ప్రయోగమే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు .. ఇలాంటి ప్రయోగాలు తర్వాత చాలా చేశారు కానీ ఈ పాటంత ఫేమస్ అవ్వలేదు ..
ఒకప్పటి ప్రేమపాట " ఊసులాడే ఒక జాబిలట " అప్పటి పాటలని ఒకప్పటి పాటలు అనటం కన్నా ఎప్పటికీ నిలిచిపోయే పాటలు అంటేనే బాగుంటుందేమో .. సున్నితమైన సంగీతం,ప్రియురాల్ని అందంగా వర్ణిస్తున్న సాహిత్యంతో మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటల్లో ఒకటి ఈ పాట.. ఈ పాట వినగానే హీరో, హీరోయిన్లు మురళి,హీరా అప్పటి కాలేజ్ లైఫ్,డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కళ్ళముందు ఉంటాయి .. నాకు ఎప్పటికీ నచ్చే ప్రేమగీతం..
ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
సినిమా : హృదయం (1992) రచన :రాజశ్రీ సంగీతం : ఇళయరాజా గానం : ఎస్.పి.బాలు
చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి.. ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ.. ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం.. కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి.. కొన్ని పులకరింపజేస్తాయి.. కొన్ని నిద్ర పుచ్చుతాయి.. కొన్ని మేలుకొలుపు పాడుతాయి.. మరి కొన్ని స్పందింపజేస్తాయి.. కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి.. కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి.. కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి.. కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి.. రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను. ఇందులో పాటలన్నీ నాకుఇష్టమైనపాటలు.. ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.
♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫ నాబెస్ట్ఫ్రెండ్సంగీతం...మనసుకుహాయికలిగినా, బాధఅనిపించినాపాటలు నాకుమంచితోడు.