.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
A. R. రెహమాన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
A. R. రెహమాన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, సెప్టెంబర్ 2020, మంగళవారం

శివంగివే శివంగివే తలవంచే మగ జాతి నీకే



శివంగివే శివంగివే .. తలవంచే మగ జాతి నీకే
నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా



మానినీ... మానినీ..

అడుగులే ఝుళిపించు పిడుగులై ఒళ్ళు విరుచుకో
విను వీధి దారిన మెరుపుల
భూమినే బంతాడు కాలమే
మీదే ఇక పై లోకం వీక్షించేనిక మగువల వీరంగం

శివంగివే శివంగివే .. తలవంచే మగ జాతి నీకే  
నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా
రారా రాణీ కానీ కానీ నీ హాసం లాసం వేషం రోషం
గర్వించేలా దేశమే ఏరై పారే తీరై ఏరి పారెయ్ తీరాలన్నీ 
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక 
కోరే భవితకి బాట వేయి 

జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి  
శివంగివే శివంగివే .. తలవంచే మగ జాతి నీకే

నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా
ఏరై పారే తీరై ఏరి పారెయ్ తీరాలన్నీ
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక 
కోరే భవితకి బాట వేయి
జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి

నువ్వీపని చేయ్యాలంటూ నిర్దేశిస్తే నమ్మద్దు
నీ పైన జాలే చూపే గుంపే నీకు అసలొద్దు
ఊరే నిను వేరె చేసి వెలివేస్తున్నా ఆగద్దు
నీలోనీ విద్వత్తెంతో చూపియ్యాలి యావత్తు

లోకం నిను వేధించి బాధిస్తున్నా పోనీవే
ప్రసవాన్ని ఛేదించి సాధించే అగ్గిమొగ్గవే

కదిలి రా భువిని ఏలగా ఎగసి రా
అగ్గిమొగ్గవే కదిలి రా నీ సరదా కలల్ని కందాం రా
ఏ పరదాలైనా తీద్దం రా 

ఏరై పారే తీరై   ఏరి పారెయ్ తీరాలన్నీ
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకి బాట వేయి 
జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి

ఎదే గాయాలు దాటే సమయం ఇదే
నీ బాధే మారె గాధలా
నీ భారం నీవే మోయాలమ్మా
విజయాల ఆశయమే
తరుణోదయమై కాంతి నిండగా
తరుణోదయమై కాంతి నిండగా

శివంగివే శివంగివే తలవంచే మగ జాతి నీకే
నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా
రారా రాణీ కానీ కానీ

నీ హాసం లాసం వేషం రోషం గర్వించేలా దేశమే
ఏరై పారే తీరై  ఏరి పారెయ్ తీరాలన్నీ 
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకి బాట వేయి

జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
నీ భయముకి నీ భయముకి బదులునీయి  
 

చిత్రం - విజిల్ (2019)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన -  - రాకేందు మౌళి
గానం - ఏ.ఆర్.రెహమాన్, శరత్ సంతోష్
షషా తిరుపతి

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే



నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే అసలేం తరగొద్దే



నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే అసలేం తరగొద్దే

యంతర లోకపు సుందరివే
అంకెల కవితలు సెండుదువే
ఇంజన్ నీ అల్లి చిందుదువే
హే.. నా వైఫై వైఫే నువ్వే

రక్తంలేని చెక్కిళ్ళకి ముద్దు పెట్టేస్తా
పొద్దు పొద్దు జావా రోజా పూయించి ఇస్తా
శుద్ది చేసి డేటా విందు వడ్డిస్తా ఇట్టా
హే.. నీ బస్ కి కండక్టర్ నే

నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే అసలేం తరగొద్దే

యంతర లోకపు సుందరివే
అంకెల కవితలు సెండుదువే
ఇంజన్ నీ అల్లి చిందుదువే
హే.. నా  వైఫై  వైఫే నువ్వే

నా సెన్సరుకి భావం నువ్వేనే
నా కేబుల్లల్లో జీవం నువ్వేనే
నా ప్రతి సెల్లో చల్లావు మైకాన్నే
నా న్యూరాన్లలో నింపావు వెన్నెల్నే

నా పాస్వర్డ్ నువ్వే నా లాగిన్ వే
హే యంత్రాలల్లో నువ్వొక రజనీవే
హహహహహ .. కరిగే కరిగే ఇనప్పువ్వా
నేడే కరిగి ఒకటై ఉందామా

ఆల్ఫా నా ఆల్ఫా నీవే ఇకా
మేగా ఒమేగా నీవే ఇకా
లవ్యూ ఫ్రమ్ జీరో టు ఈ..న్ఫీ..నిటీ

నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే అసలేం తరగొద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే

యంతర లోకపు సుందరివే
అంకెల కవితలు సెండుదువే
ఇంజన్ నీ అల్లి చిందుదువే
హే.. నా వైఫై వైఫే నువ్వే

రక్తంలేని చెక్కిళ్ళకి ముద్దు పెట్టేస్తా
పొద్దు పొద్దు జావా రోజా పూయించి ఇస్తా
శుద్ది చేసి డేటా విందు వడ్డిస్తా ఇట్టా
హే.. నీ బస్ కి కండక్టర్ నే

నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే అసలేం తరగొద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే విడిచి వెళ్ళిపోవద్దే
నా ప్రియమౌ ప్రియమౌ బాటరివే అసలేం తరగొద్దే


చిత్రం  - రోబో 2.0 (2018)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన -  - అనంత శ్రీరామ్ 
గానం - సిద్ శ్రీరాం, షషా తిరుపతి

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా



ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా



ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా
ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా

మన మాటలింక చినుకవక
మనసు తడిసి మొలకవకుండ
నన్నె వీడి పొరాదే .. నన్నె వీడి పొరాదే
మన మాటలింక చినుకవక
మనసు తడిసి మొలకవకుండ
మెరుపల్లె నువ్వు పొతె మసకల్లే నేనుంటా

ఇంకా కొంచెం సేపుకూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా

కనపడని వలే వేసి హృదయమునే ఒడిసి పట్టి
ఒడిసి పట్టి… ఒడిసి పట్టావే
వినపడని ఈలె వేసి పరువమునే హడలు గొట్టి
హడలు గొట్టీ .. హడలు గొట్టావే 

ఇటు రావా రావా రావా అలలాగ వచ్చి పో వా
వచ్చి నీ చేతిని చుట్టెయనా చిట్టి గాజు లాగా
అరే ఆలస్యాలే అమృతం అలవాటు చేసుకో  సహనం
ఆ అమృతం ఏదొ చేదంటా నీ మాటలే మధురం

ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వు
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు నీకు
ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వూ
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు నీకు
 
కడదాక కడలిలోని నీరల్లె నిలుచుంటా 
నీకొసమే .. నీ కొసమేలే
నా చెంపల్లోన  ఎరుపయే ఎరుపయే
నీకది ఎరుకనీ  బెరుకయ్యే 

ఉప్పు గాలుల్లోన ఎగసెనే 
కుప్పల తెప్పల తీయదనం
కప్పుకుందాం కప్పుకుందాం వడగాలి వెచ్చదనం 

నీ మేను చేప వాసన
నిన్ను పట్టుకుంటె ఫూల పరిమళం
ఈ రేయంతా మాట్లాడు మాటల్తో వేటాడు

ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా

నువ్వే రెప్పవి నా కంటి పాపకి
నువ్వు  తండ్రివి నా చంటి పాపలకి
అలలాగా మన పాపలు ఆడి పాడుకొవాలే
నీ మాటలన్ని నిజమై ఇక నువ్వు నేను మనమై
మన తనివి తీరా మునుగుదాం మది సంధ్రమే


చిత్రం - మరియన్ (2015)
సంగీతం  - A.R. రెహమాన్
గీతరచన - చంద్రబోస్
గానం - విజయ్ ప్రకాష్, సునీత 
 

9, సెప్టెంబర్ 2020, బుధవారం

చిటికెలు వినవే బేబీ ..



హంసరో .. మ్యారీ మీ మ్యారీ మీ హంసరో
ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరో



చిటికెలు వినవే బేబీ .. కిలకిలమనవే బేబీ

అకటా ఏమననే నిను చూసి కాస్త మతిచెడెనే
జాలైనా చూపలేవా బింకమా బిడియమా
ఓ లలనా నీ వలన పిచ్చిపట్టి ఇలా తిరుగుతున్నా
ఈ నేరం నీదేనంటే నిందిస్తున్నాననుకున్నావా

హంసరో .. మ్యారీ మీ మ్యారీ మీ హంసరో
ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరో
ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ
హంసరో ఓహ్ హంసరో
హంసరో ఓహ్ హంసరో

హంసరో .. మ్యారీ మీ మ్యారీ మీ హంసరో
ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో .. సిద్ధంగా నేను ఉన్నా బీ రెఢీ
హంసరో  ఓహ్ హంసరో

ఆశకొద్దే అడిగానే అనుకోవే ఆ టెక్కెందుకే
పిడివాదం మాని పోనీలే అంటే పోయిందేముందే
వెతకగనే కలిసొచ్చే వేళ పిలిచిందే బాలా 
సందేహించాలా మరుగెందుకే
తగువేలనీ తెరదాటనీ దరిచేరనీ .. నీ నీ నీ నీ నీ

హంసరో .. మ్యారీ మీ మ్యారీ మీ హంసరో
ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరో
ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ
హంసరో ఓహ్ హంసరో
హంసరో ఓహ్ హంసరో


చిత్రం - చెలియా (2017)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన -  - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం - అర్జున్, హరిచరణ్, జొనిత

7, సెప్టెంబర్ 2020, సోమవారం

మైమరుపా మెరుపా మెరుపా



మైమరుపా మెరుపా మెరుపా
 నిన్నిలా నడిపిందెవరో తెలుసా



మైమరుపా మెరుపా మెరుపా
మైమరుపా మెరుపా మెరుపా
మైమరుపా మైమరుపా
మైమరుపా మైమరుపా
మైమరుపా మెరుపా

నిన్నిలా నడిపిందెవరో తెలుసా
ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకునే వన్నెలా వలనే కనవా

సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
 ఏ మంచు ఆమనిలో కుహుహూ అనవా

మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరో తెలుసా
ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకునే వన్నెలా వలనే కనవా

నీతో కలిసి వేసే అడుగు
ఏ తోవంటు తననే అడుగు
తరిమే చొరవా ఏమంటుందో
కొండా కోనల్లో ఆపదుగా తన పరుగు
వెలుగే వెలివేసావనుకో
ఇది కల కాదు ఏ వేళా నీకు

మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరో తెలుసా
ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకునే వన్నెలా వలనే కనవా

సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
 

చిత్రం - చెలియా (2017)
సంగీతం - A.R రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - షషా తిరుపతి


5, సెప్టెంబర్ 2020, శనివారం

ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే



ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే
శ్వాస ఆడనందే అంత దూరముంటే



ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే
శ్వాస ఆడనందే అంత దూరముంటే
నన్నే మల్లెతీగలా నువ్వూ అల్లకుంటే
నిలువెత్తు ప్రాణం నిలవదటే

అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా చిట్టి చిలకా జట్టై అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
ఏమంత అలకా చాల్లే అల్లేయ్

నిను వెతికే నా కేకలకు మౌనమె బదులైందే
మౌనములోని మాటిదని మనసె పోల్చుకుందే
లాలన చేసే వీలే లేని పంతం వదిలి పలకవటే

అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
పుప్పొడి తునకా గాలై అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
పన్నీటి చినుకా జల్లై అల్లేయ్

ముడి పడిపోయాం ఒక్కటిగా విడివడీ పోలేకా
కాదనుకున్నా తప్పదుగా వాదనా దేనికికా
పదునుగ నాటే మన్మథ బాణం
నేరం ఏమి కాదు కదే

అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా జత గువ్వా జట్టై అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా చిరునవ్వా జల్లై అల్లేయ్ 


చిత్రం - చెలియా (2017)
సంగీతం - A.R.రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి
 గానం - అభయ్ జోద్పూర్కర్, చిన్మయి

3, సెప్టెంబర్ 2020, గురువారం

కులుకులే చెలి నడకలుగా



కులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని  తడబడు పరువం నిమిరిన వయసు ఇది



కులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని  తడబడు పరువం నిమిరిన వయసు ఇది
కొసరే  విరహం ముసిరే సమయం అడిగెను వలపు వరం 
పిలిచే ప్రణయం తొలిచే హృదయం మదనుడి విరుల శరం 

అదిరిన చెలి అధరం .. కుదిరిన జత మధురం 
హిమగిరి శిఖరములో సెగలై రగిలే వగల జ్వరం 

కులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని తడబడు పరువం నిమిరిన వయసు ఇది

పొంగే ప్రాయం చేసే మాయా జాలం 
పులకింతేదో కోరిందమ్మా కొత్తగా 
చనువిచ్చే మోజులకి చెంతకొచ్చి స్వప్నమల్లె మెదిలీ 
 

అప్పుడే ముద్దు అప్పు ఇమ్మంది 
కౌగిలింత దుప్పటైనది

కులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని  తడబడు పరువం నిమిరిన వయసు ఇది
కొసరే  విరహం ముసిరే సమయం అడిగెను వలపు వరం 
పిలిచే ప్రణయం తొలిచే హృదయం మదనుడి విరుల శరం 

అదిరిన చెలి అధరం .. కుదిరిన జత మధురం 
హిమగిరి శిఖరములో సెగలై రగిలే వగల జ్వరం 

చలి కాగాలా వెన్నెల్లోనా ఈడు 
తొలి కౌగిలిని వేడిందమ్మా వేడిగా 
విచ్చే ఎదలో మొహం వెచ్చనైన ఇచ్ఛకాలు తెలిపి 
సుందర నేపాల్ నగరం మోజు తీరా నిన్ను నన్ను కలిపే 

స్వర్గమీ రాగం సొంతమే బంధం 
సుందరం ప్రేమ సంగమం

కులుకులే చెలి నడకలుగా తొణికిన కవిత ఇది
కలగని  తడబడు పరువం నిమిరిన వయసు ఇది
కొసరే  విరహం ముసిరే సమయం అడిగెను వలపు వరం 
పిలిచే ప్రణయం తొలిచే హృదయం మదనుడి విరుల శరం 

అదిరిన చెలి అధరం .. కుదిరిన జత మధురం 
హిమగిరి శిఖరములో సెగలై రగిలే వగల జ్వరం 


చిత్రం - యోధ  (1992)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - 
గానం - S.P. బాలు, S.P. శైలజ

1, సెప్టెంబర్ 2020, మంగళవారం

మతమేల గతమేల మనసున్ననాడు



మతమేల గతమేల మనసున్ననాడు
హితమేదొ తెలియాలి మనిషైనవాడు
 


మతమేల గతమేల మనసున్ననాడు
హితమేదొ తెలియాలి మనిషైనవాడు
నీ దేశమే పూవనం .. పూవై వికసించనీ జీవితం

కన్నీట కడగాలి కులమన్న పాపం
మన రక్త సింధూర వర్ణాలు అరుణం
గాయాల నీ తల్లికీ కన్నా జోలాలి  పాడాలిరా

సరిహద్దులే దాటు ఆ గాలిలా
ప్రసరించనీ  ప్రేమనే  హాయిగా
నదులన్ని కలిసేది కడలింటిలో
తారల్లు మెరిసేది గగనాలలో

కలలోకి  జారేను ఈ రాత్రులే
వెలిగించి నవ్యోదయం 

మతమేల గతమేల మనసున్ననాడు
హితమేదొ తెలియాలి మనిషైనవాడు
నీ దేశమే పూవనం .. పూవై వికసించనీ జీవితం

తల ఎత్తి నిలవాలి నీ దేశమూ
ఇల మీద నీ స్వర్గమై
భయమన్నదే లేని భవితవ్యమూ
సాధించరా సంఘమై

ఒక మాట ఒక బాట ఒక ప్రాణమై
సాగాలిరా ఏకమై

మతమేల గతమేల మనసున్ననాడు
హితమేదొ తెలియాలి మనిషైనవాడు
నీ దేశమే పూవనం .. పూవై వికసించనీ జీవితం


 చిత్రం - బొంబాయి (1995)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - వేటూరి 
గానం - సుజాతా మోహన్ 

30, ఆగస్టు 2020, ఆదివారం

నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు



నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు
ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు



 నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు
ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు

నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు
ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు
హత్తుకున్న ఆడ మగ మొత్తుకునే ముద్దు సద్దు
వూగుతున్న పట్టె మంచం ఊసులడు కిర్రు సద్దు
కోడి కూసే దాక ఆగేది కాదు సద్దు

నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు
ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు

చీర చెంగు మాటున పాల పొంగు సుడులు
అందగాడి చూపులో అంతులేని ఊహలు
ముద్దులేసే ముద్దర జారుకుంది నిద్దర
గుండె చాటు గుట్టులోన గోల చేసే వయసే

ఒళ్ళే తూలేనులే అహ కళ్ళే సోలేనులే
ఆశే పక్కేసెనే అహ సిగ్గే సిందేసెనే

నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు
ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు

కట్టుకున్న వాడే సిటికనేలు పట్టే
వేలు పట్టగానే వేడి సద్దు చేసే
కమ్మనైన రాతిరంత మోజు మొగ్గలేసే
కన్నెపిల్ల గాజులన్ని సందడేమో చేసే

కోకే కేకేసెనే అహ రైకె రంకేసెనే
తూలే నీ కళ్ళలో అహ స్వర్గం కనిపించెనే

నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు
ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు
హత్తుకున్న ఆడ మగ మొత్తుకునే ముద్దు సద్దు
వూగుతున్న పట్టె మంచం ఊసులడు కిర్రు సద్దు
కోడి కూసే దాక ఆగేది కాదు సద్దు


చిత్రం - రోజా (1992)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - రాజశ్రీ 
గానం - S.P. బాలు, సుజాత


28, ఆగస్టు 2020, శుక్రవారం

ఆకాశం ఎంతుంటుందో నాలో వున్న ప్రేమ అంతుందే



ఆకాశం ఎంతుంటుందో నాలో వున్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే



ఆకాశం ఎంతుంటుందో నాలో వున్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దే లోకం అంటే జంకొద్దే

ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టం లేదే
ప్రేమించాక స్నేహం అంటె మనసుకి పడదే
ముందుకు వెళ్ళే కాలం ఎపుడూ వెనకకి రాదే

హే నేస్తమని హింసించకిలా
నీ ప్రేమనని ఊహించవెలా
హే నేస్తమని హింసించకిలా
నీ ప్రేమనని ఊహించవెలా

ఆకాశం ఎంతుంటుందో నాలో వున్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దే లోకం అంటే జంకొద్దే

ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే

ప్రాణం చెప్పే మాటే వింటే
అన్నీ నీకే అర్థం కావా
ఇష్టం వున్నా కష్టం అంటూ
నిన్నే నువ్వు మోసం చేసుకుంటావా

ఎంతో మౌనంగా వున్న ముద్దిచ్చేవేళ
నించో దూరంగా అన్న ఆశని కాల్చేలా
ఎంతో మౌనంగా వున్న ముద్దిచ్చేవేళ
నించో దూరంగా అన్న ఆశని కాల్చేలా

ఆకాశం ఎంతుంటుందో నాలో వున్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దే లోకం అంటే జంకొద్దే

ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే
ప్రేమించాక స్నేహం అంటె మనసుకి పడదే
ముందుకు వెళ్ళే కాలం ఎపుడూ వెనకకు రాదే

హే నేస్తమని హింసించకిలా .. హింసించకిలా
నీ ప్రేమనని ఊహించవెలా
హే నేస్తమని హింసించకిలా .. హింసించకిలా
నీ ప్రేమనని ఊహించవెలా .. ఊహించవెలా


చిత్రం -  ఏం మాయ చేసావే (2010)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - నరేష్ అయ్యర్

 

26, ఆగస్టు 2020, బుధవారం

కుందనపు బొమ్మ



కుందనపు బొమ్మ .. కుందనపు బొమ్మ



ఆహా.. అహహ.. బొమ్మ నిను చూస్తూ
నే రెప్ప వేయడం మరిచా .. హే
అయినా హే.. ఏవో.. హే..
కలలు ఆగవే తెలుసా.. హే తెలుసా
నా చూపు నీ బానిస

నీలో.. నాలో.. లోలో
నును వెచ్చనైనది మొదలయిందమ్మా
ఓ..ఓ..కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ

కుందనపు బొమ్మ .. కుందనపు బొమ్మ
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన
కుందనపు బొమ్మ .. నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ .. నిన్నే మరువదు ఈ జన్మ

హో.. నీ పాదం నడిచే ఈ చోట
హో.. కాలం కలువై నవ్విందే .. అలలై పొంగిందే
నీకన్నా నాకున్న..ఆ .. వరమింకేదే.. ఏదే

వెన్నెల్లో వర్షంలా కన్నుల్లో చేరావే నువ్వే
నన్నింక.. నన్నింక నువ్వే 
నా ఆణువణువూ గెలిచావే

కుందనపు బొమ్మ .. కుందనపు బొమ్మ
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన
కుందనపు బొమ్మ .. నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ .. నిన్నే మరువదు ఈ జన్మ

చల్లనైన మంటలో స్నానాలే చేయించావే
ఆనందం అందించావే
నీ మాట ఏటిలో ముంచావే తేల్చావే
తీరం మాత్రం దాచావేంటే .. బొమ్మా

కుందనపు బొమ్మ .. కుందనపు బొమ్మ
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన
కుందనపు బొమ్మ .. నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ .. నిన్నే మరువదు ఈ జన్మ

హే.. కుందనపు బొమ్మ
నువ్వే మనసుకి వెలుగమ్మ


చిత్రం - ఏ మాయ చేశావే (2010)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - అనంత్ శ్రీరామ్
గానం - బెన్నీ దయాళ్,కళ్యాణి మీనన్

24, ఆగస్టు 2020, సోమవారం

తొలిసారి తలుపులు తీసి



తొలిసారి తలుపులు తీసి
పిలిచిందీ మననే పచ్చని సీమా




తొలిసారి తలుపులు తీసి
పిలిచిందీ మననే పచ్చని సీమా
మనదే ఈ ప్రాంతం మొత్తం
తొలిజంటై పరిపాలిద్దాం రామ్మా

మంచిమూర్తం మించకముందే
వలసపోయే పిట్టల మవుతూ
ఈ వనం లో మజిలీ చేద్దాం చల్
గోరువంకల గానం విందాం
వాగువంకల వేగం చూద్దాం
కొండకోనల నేస్తం చేద్దాం చల్

నువ్వు నేనే లోకం  నవ్వులోనే స్వర్గం
ఆరారు ఋతువుల రాగం ఆనందమే
సంకురాత్రే నిత్యం  సంబరాలే సాక్ష్యం
ఏడేడు జన్మలు ఉన్నవి మనకోసమే

తొలిసారి తలుపులు తీసి
పిలిచింది మననే పచ్చని సీమా
మనదే ఈ ప్రాంతం మొత్తం
తొలిజంటై పరిపాలిద్దాం రామ్మా

ఏనాడు మన ఏకాంతం జంటను వీడదూ
మనతోట విరులకు బరువై ఎన్నడు వాడదూ
ఇటు రారే ఎవ్వరూ ఇటుగా చూసేదెవ్వరూ
ఈ భావనలో శ్రుతి మించిన స్వరఝరి 
చల్ చల్ చల్ అంటే
అయ్యయ్యో వెల్లువ ఈ వన్నెల జిలుగులలో
నవ యవ్వన లీలలో మనసెటు పయనించునో

కడలి చేరే ఏరే చెలి చిందులూ
మొలక నవ్వే ఎదకీ గిలిగింతలూ
దాహం తో దాడి చేసి మేఘాన్ని వేడి చేసి
దివి గంగై ప్రణయం రాదా రాదా
రాదా రాదా రాదా  రాగం తీసీ

తొలిసారి తలుపులు తీసి
పిలిచింది మననే పచ్చని సీమా
మనదే ఈ ప్రాంతం మొత్తం
తొలిజంటై పరిపాలిద్దాం రామ్మా 

మంచిమూర్తం మించకముందే
వలసపోయే పిట్టల మవుతూ
ఈ వనం లో మజిలీ వేద్దాం చల్
గోరువంకల గానం విందాం
వాగువంకల వేగం చూద్దాం
కొండకోనల నేస్తం చేద్దాం చల్

నువ్వు నేనే లోకం నవ్వులోనే స్వర్గం
ఆరారు ఋతువుల రాగం ఆనందమే
సంకురాత్రే నిత్యం  సంబరాలే సాక్ష్యం
ఏడేడు జన్మలు ఉన్నవి మనకోసమే

కనికట్టే కట్టీ కట్టీ ముడి వేసే చూపూ
పసిపెట్టే రహస్యమేదో నాక్కూడా చెప్పూ
ఆ చూపుల్లో మెరుపూ  కాలానికి మైమరపూ
తన కళ్ళెదుటే జత వేడుక సాగుతూ
నిలూ నిలూ నిలూ అంటే
ఆహాహ అంటూ కాలం శిలగా మారినదా
మన కథగా ఆగినదా  వింతగ అనిపించదా

ప్రణయగీతం అంటే జలపాతమే.
శిలను సైతం మీటే అనురాగమే
అడుగడుగూ పూల పొందు
హృదయం లో వలపు వాగు
ప్రతి సంధ్యా మన్నూ మిన్నుల వలపే పాడూ

తొలిసారి తలుపులు తీసి
పిలిచింది మననే పచ్చని సీమా
మనదే ఈ ప్రాంతం మొత్తం
తొలిజంటై పరిపాలిద్దాం

మంచిమూర్తం మించకముందే
వలసపోయే పిట్టల మవుతూ
ఈ వనం లో మజిలీ వేద్దాం చల్
గోరువంకల గానం విందాం 
వాగువంకల వేగం చూద్దాం
కొండకోనల నేస్తం చేద్దాం చల్


చిత్రం - ప్రేమంటే ప్రాణమిస్తా (1999)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - సిరివెన్నెల
గానం - ఉన్నికృష్ణన్, K.S. చిత్ర

22, ఆగస్టు 2020, శనివారం

హలో హల్లో ప్రేమలేఖా ఫోను చేశా రాయలేకా



హలో హల్లో ప్రేమలేఖా ఫోను చేశా రాయలేకా
L O V E లవ్ టెల్ మి ఎనీ హౌ



హలో హల్లో ప్రేమలేఖా 
ఫోను చేశా రాయలేకా
L O V E లవ్ టెల్ మి ఎనీ హౌ

లైనేసిన లవ్.. ఎల్ బోర్డిది నౌ
చెలి ఫోనిది మారెను పోను పోను
ఓ ప్రేమ ట్యూనుగా .. హయ్

హలో హల్లో ప్రేమలేఖా  ఫోను చేశా రాయలేక

అందె నాకు లేఖా చందమామ కేక 
నన్నింక కవ్వించకా
తోటలోని రోజా తోటమాలి పూజ 
వేళాయే వేధించకా 

ఈ దూరమే మధురం నీ ఫోను అధరం
సన్నాయి ముద్దుల్లో అమ్మాయి ప్రేమల్లో
అందాల వాణి విన్నాను ఈ వేళ

హలో హల్లో ప్రేమలేఖా 
 ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి ఎనీ హౌ

లైనేసిన లవ్ ఎల్ బోర్డిది నౌ 
చెలి ఫోనిది మారెను పోను పోను 
ఓ ప్రేమ ట్యూనుగా హోయ్

హలో హల్లో ప్రేమలేఖా ఫోను చేశా రాయలేక

అర్దరాత్రి దాకా నేను ఆగలేక 
కొట్టాను లవ్ గంటలే
తెల్లవారేదాకా తేనె విందు లేక 
కోరాను నీ జంటనే

రాశాను లవ్ లెటరే ఓహ్హో..ఓఓ.. అందాల అడ్రస్ కే
చిన్నారి సిగ్గుల్లో శృంగార తెలుగుల్లో
ఆకాశవాణి చెప్పిందీ శుభవార్త

హలో హల్లో ప్రేమలేఖా  
ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి ఎనీ హౌ
లైనేసిన లవ్ ఎల్ బోర్డిది నవ్

చెలి ఫోనిది మారెను పోను పోను 
ఓ ప్రేమ ట్యూనుగా
హలో హల్లో ప్రేమలేఖా  ఫోను చేశా రాయలేక


చిత్రం - గ్యాంగ్ మాస్టర్ (1994)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన -  వేటూరి
గానం - S.P.బాలు, K.S.చిత్ర


20, ఆగస్టు 2020, గురువారం

సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి



సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా



సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా

చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో

నువ్వు రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చిన తాకవద్దయ
రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చిన తాకవద్దయ

కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య

ఆకు వక్క వేసినా నోరు పండదేమి
ఒక్క పంటి గాటుకే ఎర్రనౌను సామి
స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి
 ఓ.. వీధి అరుగు మీదే దోచుకున్న వలపూ 
వడ్డీ లాగ పెరిగే నెలలు నిండా నింపు

కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య

సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
 చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో

మేడ మిద్దెలేల చెట్టు నీడ మేలు
మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు
ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు
చప్ప ముద్దు పెడితే ఒళ్ళు మండిపోదా
సాహసాలు చేస్తే చల్ల పడిపోనా

కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య

సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో


చిత్రం - యువ (2004)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - వేటూరి 
గానం - A.R. రెహమాన్ , మధుశ్రీ

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.