.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Movies - 2020 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Movies - 2020 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఏప్రిల్ 2020, శనివారం

ఉండిపోవ నువ్విలా



ఉండిపోవ నువ్విలా రెండు కళ్ళ లోపల
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా



నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా
O i fall in love నీ మాయల్లోనే
O i fall in love తెలిసిందా

ఉండిపోవ నువ్విలా రెండు కళ్ళ లోపల
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా
నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా
O i fall in love నీ మాయల్లోనే
O i fall in love తెలిసిందా

నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను
కన్ను కన్ను కలిసే వేళా మూగై పోతాను
మధురముగా ప్రతీ క్షణమే జరగనిదే 
నేను మరువడమే

O i'm feeling high నీ ప్రేమల్లోనే
O i'm flying now నీ వలనే

ఉండిపోవ నువ్విలా రెండు కళ్ళ లోపల
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా
నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా

ఎంతో ఆలోచిస్తూ ఉన్నా ఏమి అర్ధం కాదు
అంతా నీవే అయిపోయాక నాకే నే లేను
చిలిపితనం తరిమినదే
జత కలిసే చిరు తరుణమిదే

O i wanna say నా పాటల్లోనే
O i wanna stay నీతోనే

ఉండిపోవ నువ్విలా రెండు కళ్ళ లోపల
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా
నువ్వే నాకు సొంతమై నా ఏకాంతమంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా


చిత్రం - సవారి (2020)
సంగీతం - శేఖర్ చంద్ర 
గీతరచన - పూర్ణాచారి 
గానం - స్ఫూర్తి జితేందర్


23, ఏప్రిల్ 2020, గురువారం

నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే



నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే .. ఒసే
ఓ పయ్యల గిరగిరా చుట్టూరా తిరుగుతున్నానే



నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే ..పిల్లా
నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే .. ఒసే
ఓ పయ్యల గిరగిరా చుట్టూరా తిరుగుతున్నానే
అరెరె సిన్నదాన యమా కిరాక్ ఉన్నావే
ఎనకే నేను రానా నా గిరాకీ నువ్వే

నీ సెకలు తైతక్కలు కిక్కే ఎక్కిందే
పిల్లా నా అకలు దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే

హొ... ఛార్మినారు మీదనే వాలిన పావురమై
తీనుమారు జేస్తున్న బోనాల్లో పోతరాజై
छोड़ दिया खाना पीना तेरे ख़याल में
जीना या मरना तेरे बिना
 నా వల్ల అవ్వదు లే

నా అంగికి ఓ అత్తరు కొట్టినట్టుందే
అరె నా లుంగికి చామంతుల్ అత్కవెట్టినట్టుందే .. పిల్లో

అరెరెరె నా గుర్రానికి makeup ఎషి తెస్తానే बारात కే 
Old city గల్లీల్లో తెస్తానే చాందిని రాతే
దోస్తులందరికి दावत ఇస్తా మన शादी లోన
ముక్క సుక్క అన్ని వెడ్తా  dinnerల DJ వెడ్తా

నీ పక్కన నేనున్నట్టు తలుసుకుంటుంటే
అరె కలకత్తా మీనాక్షి పాన్ నోట్ల వెట్టినట్టుందే

నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే .. ఒసే
ఓ పయ్యల గిరగిరా చుట్టూరా తిరుగుతున్నానే
అరెరె సిన్నదాన యమా కిరాక్ ఉన్నావే
ఎనకే నేను రానా నా గిరాకీ నువ్వే

నీ సెకలు తైతక్కలు కిక్కే ఎక్కిందే
పిల్లా నా అకలు దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే


చిత్రం - సవారి (2020)
సంగీతం - శేఖర్ చంద్ర 
గీతరచన - కాసర్ల శ్యామ్ 
గానం - రాహుల్ సిప్లిగంజ్ 


17, ఏప్రిల్ 2020, శుక్రవారం

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా



మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా


మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా 
పరుగులు తీస్తావు ఇంటా బయట

అలుపని రవ్వంత అననే అనవంట
వెలుగులు పూస్తావు వెళ్లే దారంత
స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స
గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా

నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా

ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా 
అంతులేని నీ శ్రమా అంచనాలకందునా
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా 
నీవులేని జగతిలో దీపమే వెలుగునా

నీదగు లాలనలో ప్రియమగు పాలనలో 
ప్రతి ఒక మగవాడు పసివాడేగా 
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా 
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా

స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స
గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ.స

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా 
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా


చిత్రం - వకీల్ సాబ్ (2020)
సంగీతం - S.S. థమన్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - సిధ్ శ్రీరామ్ 

15, ఏప్రిల్ 2020, బుధవారం

నీ కన్ను నీలి సముద్రం



నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం



इश्क़ शिफ़ाया इश्क़ शिफ़ाया
इश्क़ परदे में किसी की आँखों में लबरेज़ है
इश्क़ शिफ़ाया महबूब का साया
इश्क़ मलमल में ये लिपटा हुआ तबरेज़ है

इश्क़ है पीर पयम्बर
अरे, इश्क़ अली दम मस्त कलंदर
इश्क़ है पीर पयम्बर
अरे, इश्क़ अली दम मस्त कलंदर

इश्क़ कभी कतरा है
अरे, इश्क़ कभी है एक समंदर
इश्क़ कभी कतरा है
अरे, इश्क़ कभी है एक समंदर

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నల్లనైన ముంగురులే ముంగురులే
అల్లరేదో రేపాయిలే రేపాయిలే
నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే
ఘల్లుమంటే నీ గాజులే ..  నీ గాజులే
ఝల్లుమంది నా ప్రాణమే ..  నా ప్రాణమే
అల్లుకుంది వాన జల్లులా ప్రేమే
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చేరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా
ఆ గోరువంక పక్కన రామ చిలుక ఎంత చక్కనా
అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కనా

అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని
తప్పుకున్నాయే భూమిపైన భాషలన్నీ
చెప్పలేమన్నా ఏ అక్షరాల్లో ప్రేమని

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నీ అందమంతా ఉప్పెన నన్ను ముంచినాది చప్పునా
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా
చుట్టూ ఎంత చప్పుడొచ్చిన్నా నీ సవ్వడేదో చెప్పనా
ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా

నీ ఊహలే ఊపిరైన పిచ్చోడినీ
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడినీ
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపనీ 
 

చిత్రం - ఉప్పెన (2020)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - శ్రీమణి 
గానం - జావేద్ ఆలీ 


13, ఏప్రిల్ 2020, సోమవారం

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా



నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా 
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా



నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా 
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా 
నెలవంకకు ఇద్దామనుకున్నా
ఓహో ఓహో .. నీ నవ్వుకు సరిపోదంటున్నా

నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే 
నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే 
ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే 

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా 
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా 

ఓహో వానవిల్లులో ఉండని రంగు నువ్వులే 
ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే 
నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే 
ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే 

చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే
నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే

ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా 
ఏది నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా 

 నీలి నీలి ఆశాశం ఇద్దామనుకున్నా 
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా 

ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే 
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే 
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే 
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే

దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే 
వరమొసగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే

ఏదో ఇవ్వాలి కానుకా ఎంతో వెతికాను ఆశగా 
ఏది నీ సాటి రాదిక అంటూ అలిసాను పూర్తిగా 
కనుకే మళ్లి మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా

 నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
 మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా


 చిత్రం - 30 రోజుల్లో ప్రేమించటం ఎలా (2020)
సంగీతం - అనూప్ రూబెన్స్
గీతరచన - చంద్రబోస్
గానం - సిధ్  శ్రీరామ్ , సునీత

3, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా



ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా



ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

కదలని ఓ శిలనే అయినా
తృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితె నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ  ప్రశ్నయి ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనద్దు
అనొద్దు దయుంచి ఎవరూ 
ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక  స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎదలయను కుశలము అడిగిన
గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనగా
అనగనగా అంటూనే ఉంటా ఎపుడూ  పూర్తవనే అవకా
తుది లేని కధ నేనుగా

గాలివాటంలాగా ఆగే అలవాటే లేక
కాలు నిలువదు ఏ చోటా 
నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేకా  .. మౌనంగా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనద్దు
అనొద్దు దయుంచి ఎవరూ 
ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక  స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎదలయను కుశలము అడిగిన
గుసగుస కబురుల ఘుమఘుమలెవరివీ

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
 నాకే సొంతం అంటున్నా
విన్నారా..  నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా

అమ్మ ఒడిలో మొన్నా  అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది
జాబిల్లి..  అంత దూరానున్నా వెన్నెలగా చెంతనె ఉన్నా
అంటూ ఊయలలూపింది .. జోలాలి

తానే నానే నానినే తానే నానే నానినే
తానే నానే నానినే తానే నానే నానినే
తానే నానే నానినే తానే నానే నానినే
తానే నానే నానినే తానే నానే నానినే

చిత్రం - జాను (2020)
సంగీతం - గోవింద్ వసంత 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం - ప్రదీప్ కుమార్

22, జనవరి 2020, బుధవారం

సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో



సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో మా ఊపిరి కన్న కలవో


చిత్రం - సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం -దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - బీ ప్రాక్ (B Praak)


20, జనవరి 2020, సోమవారం

అల వైకుంఠపురంలో నిను చూసిన క్షణంలో



ఎలా..  ఇంకెలా .. అల వైకుంఠపురంలో 
నిను చూసిన క్షణంలో మైమరచి పోయానిల్లా



అల వైకుంఠపురం లో Private Song 
సంగీతం - నవీన్. J
గీతరచన - దేవా 
గానం - నవీన్. J

18, జనవరి 2020, శనివారం

రాములో రాములా నన్నాగం చేసిందిరో



రాములో రాములా నన్నాగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో



చిత్రం - అల  వైకుంఠపురంలో (2020)
సంగీతం - S.థమన్ 
గీతరచన - కాసర్ల శ్యామ్ 
గానం - అనురాగ్ కులకర్ణి, మంగ్లీ

8, డిసెంబర్ 2019, ఆదివారం

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు


నీ కాళ్ళని  పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు 
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు



చిత్రం - అల వైకుంఠపురంలో (2019)
సంగీతం - S.థమన్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - సిద్ శ్రీరామ్



Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.