.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

15, ఏప్రిల్ 2020, బుధవారం

నీ కన్ను నీలి సముద్రం



నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం



इश्क़ शिफ़ाया इश्क़ शिफ़ाया
इश्क़ परदे में किसी की आँखों में लबरेज़ है
इश्क़ शिफ़ाया महबूब का साया
इश्क़ मलमल में ये लिपटा हुआ तबरेज़ है

इश्क़ है पीर पयम्बर
अरे, इश्क़ अली दम मस्त कलंदर
इश्क़ है पीर पयम्बर
अरे, इश्क़ अली दम मस्त कलंदर

इश्क़ कभी कतरा है
अरे, इश्क़ कभी है एक समंदर
इश्क़ कभी कतरा है
अरे, इश्क़ कभी है एक समंदर

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నల్లనైన ముంగురులే ముంగురులే
అల్లరేదో రేపాయిలే రేపాయిలే
నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే
ఘల్లుమంటే నీ గాజులే ..  నీ గాజులే
ఝల్లుమంది నా ప్రాణమే ..  నా ప్రాణమే
అల్లుకుంది వాన జల్లులా ప్రేమే
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చేరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా
ఆ గోరువంక పక్కన రామ చిలుక ఎంత చక్కనా
అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కనా

అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని
తప్పుకున్నాయే భూమిపైన భాషలన్నీ
చెప్పలేమన్నా ఏ అక్షరాల్లో ప్రేమని

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నీ అందమంతా ఉప్పెన నన్ను ముంచినాది చప్పునా
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా
చుట్టూ ఎంత చప్పుడొచ్చిన్నా నీ సవ్వడేదో చెప్పనా
ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా

నీ ఊహలే ఊపిరైన పిచ్చోడినీ
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడినీ
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపనీ 
 

చిత్రం - ఉప్పెన (2020)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - శ్రీమణి 
గానం - జావేద్ ఆలీ 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.