.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

29, ఏప్రిల్ 2020, బుధవారం

వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ళ మంటరా



వద్దురా సోదరా అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో పడొద్దురా



వద్దురా సోదరా అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో పడొద్దురా
అరేయ్... వద్దురా వద్దు

చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి
తాళి కట్టొద్దు ఖర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి
కల్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా
నీ కొంపముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర

డోంట్ మ్యారీ... బీ హ్యాపీ
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ

వద్దురా సోదరా అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో పడొద్దురా

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్
లవ్‌లో పడి పెళ్లి చేసుకున్నాడు
కాలేజీలో వాడు గ్రీకువీరుడు
మ్యారేజ్ కాకముందు రాకుమారుడు

అంతా జరిగి జస్ట్ ఒన్ మన్త్ కాలేదు
ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టూ
బక్కచిక్కి పోయి మంచి లుక్ పోయి
ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి

ఈ దేవదాసు వాలకం దేనికంటే
తను దేవిదాసు కావడం వల్ల అంటూ
గుక్కపట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు

పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి
మరి ఏపూటకాపూటే తనకి ఐ లవ్ యూ చెప్పాలి
ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం
కత్తిసామైందిరా కాపురం పెళ్లి క్షమించరాని నేరం

డోంట్ మ్యారీ... బీ హ్యాపీ
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ

అంతెందుకు మా మల్లిగాడు
మా ఊళ్లో వాడంతటోడు లేడు
మామూలుగానే వాడు దేశముదురు
పెళ్లితోటే పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు పళ్లేక ఇంటిపోరు
చల్లారి పోయింది వాడి నెత్తురు

ఒక్కపూట కూడ ఉండదనుకుంటా
కస్సుమనకుండా బుర్ర తినకుండా
వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి
తరుముతూనే ఉంటదంటా వీధి వెంటా
కోడెనాగులాంటి వాణ్ణి వానపాము చేసింది
ఆలి కాదురా అది అనకొండ

ఆ గయ్యాళి యమగోల
కలిగించింది భక్తియోగం
ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తిమార్గం
సంసారమే వేస్టనీ ఇక సన్యాసమే బెస్టనీ
కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా

డోంట్ మ్యారీ... బీ హ్యాపీ
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ

వద్దురా సోదరా అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో పడొద్దురా

డోంట్ మ్యారీ... బీ హ్యాపీ
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ 


చిత్రం - మన్మథుడు (2003)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన - సిరివెన్నెల
గానం - ఎస్.పి.బాలు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.