.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

Friday, July 1, 2011

నింగీ నేలా నాదే


నాకు చాలా ఇష్టమైన పాట... పాటకు ఎలాంటి పరిచయం అవసరం లేదు..
జీవితాన్ని ఎలాంటి వోటమి,వైకల్యం ఆపలేదని,భగవంతుడు మనకిచ్చిన జీవితాన్నిమనకి ఇష్టమైనట్లుగా
జీవించే ధైర్యం ప్రతి మనిషికీ అవసరమని, మనిషికి తనమీద తనకు నమ్మకం వుంటే, ఏదయినా సాధించాలన్న పట్టుదల వుంటే, ఆత్మబలం తప్ప మరెవెరి చేయూత అవసరంలేదన్న నిజాన్ని చూపుతుందీ సినిమా
...
ఓ దుర్ఘటనలో రెండు చేతులనూ కోల్పోయినా అధైర్యపడక, అన్ని కష్టాలనూ ధైర్యంగా ఎదుర్కుని,
ఆత్మశక్తితో ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న ఒక అమ్మాయి కధే

నింగీ నేల నాదే..




ఆరాటం ముందు ఆటంకం ఎంత
సంకల్పం ముందు వైకల్యం ఎంత
ధృడచిత్తం ముందు దురదృష్టం ఎంత
ఎదురీత ముందు విధిరాత ఎంత

నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా
ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా

ఆరాటం ముందు ఆటంకం ఎంత
సంకల్పం ముందు వైకల్యం ఎంత
ధృడచిత్తం ముందు దురదృష్టం ఎంత
ఎదురీత ముందు విధిరాత ఎంత

చేజారెను చేతులు చెదిరేను గీతలు
చేజారెను చేతులు చెదిరేను గీతలు
బెదిరించిన భాదలే వివరించెను భోదలు
పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా
పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా
మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా

ఆరాటం ముందు ఆటంకం ఎంత
సంకల్పం ముందు వైకల్యం ఎంత
ధృడచిత్తం ముందు దురదృష్టం ఎంత
ఎదురీత ముందు విధిరాత ఎంత

పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం
అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం
చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం
సహనంతో ఉంటే దొరికింది సైన్యం
చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం

పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం
అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం
చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం
సహనంతో ఉంటే దొరికింది సైన్యం






0 వ్యాఖ్యలు:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ పాడే పాట నుంచి..
ఇప్పటి అమ్మాయి /అబ్బాయి కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


Raaji.