"ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ..దీక్షకన్న సారధెవరురా" "నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్నగువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా" ఇంత కన్నా గొప్పగా ఎవరు చెప్పగలరు.. సిరివెన్నెల గారి అద్భుతమైన సాహిత్యంతో మనసుని ఉత్తేజ పరిచే ఈ పాట నాకు చాలా ఇష్టం
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ Video By -- Raaji
సినిమా - పట్టుదల ( 1992) లిరిక్స్ - సిరివెన్నెల సంగీతం - ఇళయరాజా గానం - k.j జేసుదాస్
చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి.. ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ.. ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం.. కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి.. కొన్ని పులకరింపజేస్తాయి.. కొన్ని నిద్ర పుచ్చుతాయి.. కొన్ని మేలుకొలుపు పాడుతాయి.. మరి కొన్ని స్పందింపజేస్తాయి.. కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి.. కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి.. కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి.. కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి.. రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను. ఇందులో పాటలన్నీ నాకుఇష్టమైనపాటలు.. ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.
♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫ నాబెస్ట్ఫ్రెండ్సంగీతం...మనసుకుహాయికలిగినా, బాధఅనిపించినాపాటలు నాకుమంచితోడు.
$రాజి గారు
ప్రత్యుత్తరంతొలగించుభావోద్వేగాలని రెచ్చగొడుతూ జవసత్వాల జడత్వాన్ని వదలగొట్టే పాట.. సాహిత్యం చదివినప్పుడల్లా నూతనోత్తేజం..బాలసుబ్రహ్మణ్య౦ గారు పాడి ఉంటే ఇంకా బావుండేది..
మంచి పాటని సాహిత్యంతో సహా అందించినందుకు ధన్యవాదాలు :)
రాజేష్.జి గారు ధన్యవాదములండీ...
ప్రత్యుత్తరంతొలగించునాకు కూడా చాలా ఇష్టమైన పాట ఇది