.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

1, జులై 2011, శుక్రవారం

నింగీ నేలా నాదే



నాకు చాలా ఇష్టమైన పాట... ఈ పాటకు పరిచయం అవసరం లేదు..జీవితాన్ని ఎలాంటి వోటమి,వైకల్యం ఆపలేదని,భగవంతుడు మనకిచ్చిన జీవితాన్నిమనకి ఇష్టమైనట్లుగా జీవించే ధైర్యం ప్రతి మనిషికీ అవసరమని, మనిషికి తనమీద తనకు నమ్మకం వుంటే, ఏదయినా సాధించాలన్న పట్టుదల వుంటే, ఆత్మబలం తప్ప మరెవెరి చేయూత అవసరంలేదన్న నిజాన్ని చెప్తుందీ పాటలోని " చంద్రబోస్ " గారి సాహిత్యం ... వేరే భాషలో డబ్బింగ్ పాట  వింటున్నట్లుగా అనిపించకపోవటమే  ఈ పాట గొప్పదనం.
ఓ దుర్ఘటనలో రెండు చేతులనూ కోల్పోయినా అధైర్యపడక, అన్ని కష్టాలనూ ధైర్యంగా ఎదుర్కుని,శక్తితో ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న ఒక అమ్మాయి కధే ఈ సినిమా 


నింగీ నేల నాదే..



 
 
సినిమా - నింగి నేలా నాదే (2009)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
 గీతరచన - చంద్రబోస్ 
గానం - K.S.చిత్ర
 

2 కామెంట్‌లు:

  1. rajya lakshmi gaaru aaraatam mundu paataku naa peru vesthe santoshishta--chandrabose

    రిప్లయితొలగించండి
  2. "Kavi Chandrabose" గారూ.. నమస్తే అండీ మీరు నా సంగీతప్రపంచానికి వచ్చినందుకు,నాకు ఎంతో నచ్చే మీ పాట గురించి మీ ద్వారానే తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా వుంది.

    ఈ "ఆరాటం ముందు" పాటకి మంచి వీడియో కానీ, ఆడియో కానీ ఇంతవరకు దొరకలేదు.. అందుకే ఆ పాటని అలా వదిలేశాను.నాకు చాలా ఇష్టమైన పాటల్లో మీ పాటలు చాలా ఉంటాయి.. అందులో "చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని" పాట కూడా ఒకటి..

    పాట డిటైల్స్ అన్నీ తప్పకుండా యాడ్ చేస్తాను

    Thank you very much for your Comment ..

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.