.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

16, జులై 2020, గురువారం

మచిలీపట్నం మామిడి చిగురులో



మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట



ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి

ఊ..లలల్లా ఉహూ..లలల్లా  ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా  ఉహూ లల లలలలా

మెట్టదారి ఇదే బండికి వాలు ఇదే ఓ పొంకాల పోరి ఒకతి
పోరి కట్టుకున్న చీర పొగరు చూశా వాన విల్లు వర్ణం ఆహా
మనసున మల్లె వాన చింది చింది సుధ చిలికే నయగారం
మరి ఎద వాలి గిల్లి కొత్త తాళమడిగినదే చెలగాటం

ఊ..లలల్లా ఉహూ..లలల్లా  ఉహూ లల లలలలా

తందానా తందానా తాకి మరి తందానా  
ఏ తాళం వాయించాడే
తందానా తందానా పాట వరస తందానా 
ఏ రాగం పాడిస్తాడే

సిరి వలపో మతిమరుపో అది హాయిలే
సిరి పెదవో విరి మధువో ప్రియమేనులే
తందానా తందానా కన్నె ప్రేమ తందానా 
వచ్చిపోయె వాసంతాలే

మనసిజ మల్లెవీణ సిగ్గు సిగ్గు లయలొలికే వ్యవహారం
అది అలవాటుకొచ్చి గుచ్చి చూసి మనసడిగే చెలగాటం

హూ ..లలల్లా ఉహూ..లలల్లా  ఉహూ లల లలలలా
ఓహో హూ..లలల్లా ఉహూ..లలల్లా  ఉహూ లల లలలలా

మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి

తందానా తందానా ఊసుకనుల తందానా 
ఊరించే తెట్టు తేవె
తందానా తందానా పాటకొక తందానా 
చెవి నిండా గుమ్మత్తేలే

వయసులలో వరసలలో తెలియందిదే
మనసుపడే మౌన సుఖమే విరహానిదే
తందానా తందానా మేఘరాగం తందానా
వచ్చె వచ్చె వానజల్లే

మధురస మాఘ వేళ కన్నుగీటి కథ నడిపే సాయంత్రం
తొలిచెలి గాలి సోలి కొత్త తోడు కలిసినదే చెలగాటం

ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా

మచిలీపట్నం మామిడి చిగురులో
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మా చిలక మా చిలక మా చిలక
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా


చిత్రం - మెరుపుకలలు (1997)
సంగీతం - A.R.రెహమాన్ 
గీతరచన -  వేటూరి
గానం - శ్రీని, ఉన్నిమీనన్, చిత్ర
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.