.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, మే 2020, ఆదివారం

ముదినేపల్లి మడిచేలో



ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా



ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా

బుట్ట మీద బుట్టపెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి
వాగల్లే నడిచావే
నీ బుట్టలోన పువ్వులన్నీ గుట్టులన్నీ రట్టుచేసి
నన్నీడ పిలిచేనే

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
పల్లి పల్లి ముదినేపల్లి .. పల్లి పల్లి ముదినేపల్లి

కాటుక కళ్ల వాడల్లో కట్టుకుంటా గుడిసెంటా
పసుపుతాడు పడకుండా ఆగడాలే వద్దంటా
చింతపల్లి చిన్నోణ్ని చూడు నీకు వరసంటా
వరస కాదు నాకంట మనసు ఉంటే చాలంటా

పగలు రేయి .. నీతో ఉంటా
ఉన్నావంటే .. అది తప్పంట
కలిసి వస్తే ఎన్నెలమాసం చెయ్యాలి జాగారం

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా

బుట్టమీద బుట్టపెట్టి నేను పువ్వులమ్ముతుంటే
కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు
గాలాలే యేస్తావే

తమలపాకు తడిలోనా  పండెనే నీ నోరంటా
నోటి పంట కాదంటా  పాడిపంట చూడంటా
నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట
ఆశపడిన మావయ్యది అందమైన మనసంట

అందం చందం .. నీకే సొంతం
ఎన్నెల్లోనే .. యేస్తా మంచం
పైరగాలుల పందిరిలోన కరిగిపోదాం మనం

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా

బుట్టమీద బుట్టపెట్టి నేను పువ్వులమ్ముతుంటే
కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు
గాలాలే యేస్తావే


 చిత్రం - జెంటిల్‌మెన్ (1993)
సంగీతం  - ఎ.ఆర్.రెహమాన్
గీతరచన - రాజశ్రీ
గానం - సాహుల్ హమీద్,స్వర్ణలత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.