.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

10, జనవరి 2012, మంగళవారం

k.j.ఏసుదాస్ - All Time Hits


కొందరు గాయకుల గాత్రంలో సమ్మోహన శక్తి వుంటుంది.
వాళ్ళు పాడిన గీతాలు శ్రోతలను రంజింప చేస్తాయి.
ఆబాల గోపాలాన్ని ఆనంద సాగరంలో తేలియాడిస్తాయి. 
ఆ పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచిపోతాయి.

ప్రేక్షకుల్ని మంత్రముగ్దులి చేసే అటువంటి గాయకుల్లో  
k.j.ఏసుదాస్ గారు ఒకరు..అనేక భారతీయ భాషల్లో 
55 వేలకు పైగా పాటల్ని పాడి,అనేక జాతీయ,రాష్ట్రీయ అవార్డుల్ని గెలుచుకున్న ఈ సమ్మోహన గాయకుడి
పుట్టినరోజు సందర్భంగా 


నాకు నచ్చిన k.j.ఏసుదాస్ - All Time Hits 
 "నా సంగీత ప్రపంచం"లో..




  1.  మహాగణపతిం మనసా స్మరామి
  2. మా పాపాలు తొలగించు దీపాలు 
  3. ఓ నిండు చందమామా నిగనిగల భామా
  4.  దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
  5.  స్వర రాగ గంగా ప్రవాహమే
  6.  ఆకాశ దేశాన ఆషాఢ మాసానా
  7.  శీత వేళ రానీయకు .. రానీయకు
  8.   నవరస సుమ మాలికా ..
  9.  సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
  10.  ఎవ్వరిది ఈ పిలుపు ఎక్కడిది ఈ వెలుగు 
  11.  మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి
  12.  తెలవారదేమో స్వామీ 
  13.  ఆది దంపతులే అభిమానించే ..
  14.  ఆలనగా పాలనగా ... అలసిన వేళల అమ్మవుగా
  15.  ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో
  16.  మిడిసి పడే దీపాలివి మిన్నెగసి పడే కెరటాలివి
  17.  సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే 
  18.  మరచిపో నేస్తమా హృదయముంటే సాధ్యమా
  19.  ఓ బాటసారి ఇది జీవిత రహదారి 
  20.  గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
  21.  సృష్టికర్త ఒక బ్రహ్మ .. అతనిని సృష్టించినదొక అమ్మ
  22.  లలిత ప్రియ కమలం విరిసినదీ
  23.  పచ్చని చిలకలు తోడుంటే 
  24.  సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని
  25.  సొగసు చూడతరమా .. నీ సొగసు చూడ తరమా
  26.  అపురూపమైనదమ్మ ఆడజన్మ 
  27.  నువ్వేమి చేశావు నేరం  నిన్నెక్కడంటింది పాపం
  28.  ఇదేలే తర తరాల చరితం జ్వలించే జీవితాల కధనం
  29.  దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా
  30.  ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
  31.  కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
  32.  ముసిముసి నవ్వులలోనా 
  33.  




15 కామెంట్‌లు:

  1. Thanks for the songs of Jesudas.I too admire his music along with. Ghantasalagari music .

    రిప్లయితొలగించండి
  2. మంచి కలెక్షన్ .
    " కా కరూం సజనీ ఆయేనా బాలం " , ఈ పాట చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ఒక హిందీ సినిమాలోది . ఇది కూడా జేసుదాస్ పాడినట్లే గుర్తు . కొన్ని రోజుల నుంచి ఈ పాట తెగ గుర్తొస్తోంది . ఏ సినిమా లోదో గుర్తురావటం లేదు :) ఇది షబ్నా ఆజ్మీ సినిమా . మీకు తెలుస్తే చెప్పండి ప్లీజ్ . వీలైతే పాట వినిపిస్తే మరీ సంతోషం :)

    రిప్లయితొలగించండి
  3. థాంక్యూ మాలా కుమార్ గారూ..
    మీరు అడిగిన పాట 1977 లో వచ్చిన స్వామి అనే సినిమాలోదండీ.
    మీకోసం ఈ పాట నా "Gataa Rahe Mera Dil"
    బ్లాగ్ లో పెట్టాను చూడండి..
    నాకు కూడా ఒక మంచి పాటని గురించి చెప్పినందుకు థాంక్స్ అండీ :)

    http://raaji-hindisongs.blogspot.com/2012/01/1977.html

    రిప్లయితొలగించండి
  4. ధన్యవాదములు రాజి గారు సాంగ్స్ కోసం గూగుల్ సెర్చ్ చేయకుంట మీ బ్లాగ్ లో పెట్టేశారు... సాంగ్ కావలి అంటే మీ బ్లాగ్ లోకి వస్తే చాలు..

    రిప్లయితొలగించండి
  5. రాజి గారూ! జేసుదాస్ గారి పేరు వింటేనే పులకించిపోతాను. అటువంటి మహానుభావుడి పాటలు మీ బ్లాగులో చూసి చాలా ఆనందం కలిగింది. మీరు పెట్టిన పాటలన్నీ నా దగ్గర ఉన్నాయి. అంతే కాకుండా హిందీలో పాడిన పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.మంచి విషయాలు చెప్పారు. అభినందనలు. ఫణి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణి గారూ.. నాకు నచ్చిన జేసుదాస్ గారి పాటల సేకరణ
      మీకు నచ్చినందుకు,మీ స్పందన తెలియచేసినందుకు థాంక్సండీ.

      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.