.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

24, డిసెంబర్ 2012, సోమవారం

దివిని తిరుగు మెరుపులలన ... సామజవరగమనా



  దివిని తిరుగు మెరుపులలన 





 సినిమా - లాయర్ సుహాసిని (1987)
సంగీతం - S.P.బాలు
రచన - సిరివెన్నెల
గానం - S.P.బాలు, S.P.శైలజ

2 వ్యాఖ్యలు:

  1. అద్భుతమైన ఈ పాట అప్పట్లో రోజూ రేడియోలో వినపడేది. హీరో పొగడుతూ ఉంటే ఆ పొగడ్తకు దగ్గట్టు హెచ్చు తగ్గుల గళంతో - ఆ పొగడ్తలకు సంతోషపడ్డట్టు, ఎక్కువ పొగడుతున్నావు ఆపు అన్నట్లు, మరో పొగడ్తకు నవ్వు వచ్చినట్లు ఇలా రకరకాల భావాలను "సామజవరగమనా" అన్న ఒక్క పద ప్రయోగంతోనే హీరోయిన్ పలికిస్తుంది. సిరివెన్నలగారి రచన, బాలుగారి సంగీతగానంతో బాటు శైలజ గారి శ్రావ్యమైన గానం ఈ పాటకు జీవం పోసింది. మీ బ్లాగులో చాలా పాటలు విన్నాను - మీ టేస్ట్ చాలా బాగుంది, ఎన్నో మంచిమంచి పాటలన్నీ ఒక దెగ్గర పొందుపరచారు.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. పాట గురించి,పాటలో హీరోయిన్ భావాల గురించి చక్కగా వర్ణించారండీ ..
      నాకు ఎప్పటికీ నచ్చే పాట ఇది ..
      నా బ్లాగులో నేను సేకరించిన పాటలు నచ్చినందుకు, మీ అభినందనలకు చాలా Thanks "Mahesh" గారు ..,

      ఆలస్యంగా రిప్లై ఇస్తున్నాను ఏమీ అనుకోకండి.

      తొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.