.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

28, మార్చి 2020, శనివారం

#Corona Song - ChowRaasta Music
చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కుడా మొక్కుతా అడుగు బయట పెట్టకురాచేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కుడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా
చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కుడా మొక్కుతా.. అడుగు బయట పెట్టకురా

ఉన్నకాడే ఉండరా గంజి తాగి పండరా
మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా
ఉన్నకాడే ఉండరా గంజి తాగి పండరా
మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా

సిగరెట్లు చాక్లెట్లు రోడ్లమీద ముచ్చట్లు
బతికుంటే సూసుకుందాం ఇప్పుడైతే బంద్ పెట్టు

ఓ.. హో..హో..హో.. ఓ.. హో
ఓ.. హో..హో..హో.. ఓ.. హో

ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయ్ రా
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా
ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయ్ రా
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా

ఏ.. యుద్దానికి సిద్ధమా రోగం తరిమేద్దమా
ఆయుధాలు లేవురా హృదయం ఉంటే చాలదా
ఏ..యుద్దానికి సిద్ధమా రోగం తరిమేద్దమా
ఆయుధాలు లేవురా హృదయం ఉంటే చాలదా

ఏ.. కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా
కాలం మారేదాకా ఓపికంత పట్టారా

ఓ.. హో..హో..హో.. ఓ.. హో…
ఓ.. హో..హో..హో.. ఓ.. హో…

నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలనకా రాత్రనకా సైనికులై సాగినారు
నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలనకా రాత్రనకా సైనికులై సాగినారు

ప్రాణాలే పనం పెట్టి మన కోసం పోరుతుంటే
భాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదామా
ప్రాణాలే పనం పెట్టి మన కోసం పోరుతుంటే
భాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదామా

అరె.. లోకం అంటే వేరు కాదు నువ్వే ఆ లోకం రా
నీ బతుకు సల్లగుంటే లోకానికి చలవరా

ఓ.. హో..హో..హో.. ఓ.. హో
ఓ.. హో..హో..హో.. ఓ.. హో

చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కుడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా
చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కుడా మొక్కుతా.. అడుగు బయట పెట్టకురా


#Corona Song
Written and Composed
By - 
 Ram Miriyalaవ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.