.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, మార్చి 2020, మంగళవారం

We gonna fight corona ఏదేమైనా



We gonna fight corona ఏదేమైనా  
చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా 



We gonna fight corona ఏదేమైనా
చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా 
జాగ్రత్తలు పాటిస్తూ ఎదిరిద్దాం చిన్నా
ఏముంది విలువైంది మన ప్రాణం కన్నా

నీ చేతల్లోనే కదా భవిత .. నీవైపుకంటూ రాదే నలత

Lets fight this virus
Lets kill this virus
Lets do it together
Lets live healthier

కడిగేసి తరిమేసేద్దాం ఈ కరోనా
షేక్ హాండ్సు వద్దు గాని దండం మిన్న
సబ్బూ సానిటజైరు వాడోయ్ అన్నా
symptoms ఉంటే ఐసోలేషన్ మిన్న 

నీ చేతల్లోనే కదా భవిత .. నీవైపుకంటూ రాదే నలత

Lets fight this virus
Lets kill this virus
Lets do it together
Lets live healthier

బ్రతుకంటే ఓ పోరాటం మన తల వంచం
విజ్ఞానం వైద్యం మనకు ఉన్నాయ్ సాయం
దేశాలు ఒకటై చేస్తున్నాయి యుధ్ధం
మనవంతుగ ముందడుగేస్తే మనదే విజయం 

నీ చేతల్లోనే కదా భవిత .. నీవైపుకంటూ రాదే నలత

Lets fight this virus
Lets kill this virus
Lets do it together
Lets live healthier



Corona Song - March - 2020
 సంగీతం - కోటి 
గీతరచన - శీనివాస మౌళి 
గానం - కోటి



30, మార్చి 2020, సోమవారం

స్వాతి చినుకు సందెవేళలో



స్వాతి చినుకు సందెవేళలో.. హొయ్
లేలేత వణుకు అందగత్తెలో... హొయ్



చిత్రం - ఆఖరిపోరాటం (1988)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు,S.జానకి



28, మార్చి 2020, శనివారం

#Corona Song - ChowRaasta Music




చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కుడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా



చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కుడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా
చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కుడా మొక్కుతా.. అడుగు బయట పెట్టకురా

ఉన్నకాడే ఉండరా గంజి తాగి పండరా
మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా
ఉన్నకాడే ఉండరా గంజి తాగి పండరా
మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా

సిగరెట్లు చాక్లెట్లు రోడ్లమీద ముచ్చట్లు
బతికుంటే సూసుకుందాం ఇప్పుడైతే బంద్ పెట్టు

ఓ.. హో..హో..హో.. ఓ.. హో
ఓ.. హో..హో..హో.. ఓ.. హో

ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయ్ రా
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా
ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయ్ రా
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా

ఏ.. యుద్దానికి సిద్ధమా రోగం తరిమేద్దమా
ఆయుధాలు లేవురా హృదయం ఉంటే చాలదా
ఏ..యుద్దానికి సిద్ధమా రోగం తరిమేద్దమా
ఆయుధాలు లేవురా హృదయం ఉంటే చాలదా

ఏ.. కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా
కాలం మారేదాకా ఓపికంత పట్టారా

ఓ.. హో..హో..హో.. ఓ.. హో…
ఓ.. హో..హో..హో.. ఓ.. హో…

నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలనకా రాత్రనకా సైనికులై సాగినారు
నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలనకా రాత్రనకా సైనికులై సాగినారు

ప్రాణాలే పనం పెట్టి మన కోసం పోరుతుంటే
భాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదామా
ప్రాణాలే పనం పెట్టి మన కోసం పోరుతుంటే
భాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదామా

అరె.. లోకం అంటే వేరు కాదు నువ్వే ఆ లోకం రా
నీ బతుకు సల్లగుంటే లోకానికి చలవరా

ఓ.. హో..హో..హో.. ఓ.. హో
ఓ.. హో..హో..హో.. ఓ.. హో

చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కుడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా
చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కుడా మొక్కుతా.. అడుగు బయట పెట్టకురా


#Corona Song
Written and Composed
By - 
 Ram Miriyala



26, మార్చి 2020, గురువారం

ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల



ఎప్పుడు ఎప్పుడు 
గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో 



చిత్రం - ఆఖరి పోరాటం (1988) 
సంగీతం  - ఇళయరాజా 
గీతరచన - వేటూరి 
గానం - S.P.బాలు, K.S చిత్ర 


24, మార్చి 2020, మంగళవారం

ఝుమ్మనే తుమ్మెద వేట



ఝుమ్మనే తుమ్మెద వేట 
ఘుమ్మనే వలపుల తోట 



చిత్రం - మెకానిక్ అల్లుడు (1993) 
సంగీతం - రాజ్ - కోటి 
గీతరచన -  భువన చంద్ర 
గానం - S.P.బాలు, K.S.చిత్ర

22, మార్చి 2020, ఆదివారం

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా



ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా 
ఏటవాలు చూపులో మౌనగీతమా



చిత్రం - ముఠామేస్త్రి (1993) 
సంగీతం - రాజ్ కోటి 
గీతరచన - వేటూరి 
గానం -S.P.  బాలు, K.S.చిత్ర 

20, మార్చి 2020, శుక్రవారం

కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట



కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట
కోకిలమ్మా పేరంటాలే వచ్చేనంట



చిత్రం - రాజా విక్రమార్క (1990)
సంగీతం - రాజ్-కోటి
గీతరచన  - వేటూరి
గానం - S.P.బాలు,S.జానకి

18, మార్చి 2020, బుధవారం

నీతోనే ఠంకాపలాసు



నీతోనే ఠంకాపలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా 
నువ్వే నా కళావరాసు



చిత్రం - స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ (1991) 
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - వేటూరి 
గానం - బాలు, చిత్ర 
 

16, మార్చి 2020, సోమవారం

చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం



చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం 
చీర దాచలేని సోకు నాకు సంబరం 


చిత్రం - స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ (1991) 
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - వేటూరి 
గానం - బాలు, చిత్ర

14, మార్చి 2020, శనివారం

భలేగ ఉందిరా ..



భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా
పడింది ముద్దర చెడింది నిద్దర



చిత్రం - స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ (1991)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, K.S.చిత్ర

12, మార్చి 2020, గురువారం

ఆలారే ఆలారే ముకుందా మురారే



ఆలారే ఆలారే ముకుందా మురారే
కృష్ణయ్యా వచ్చేదీనాడే మా ఇంట విందారగించగా



చిత్రం - తేనెమనసులు 1987
సంగీతం - బప్పీలహరి
గీతరచన -  వేటూరి
గానం - P. సుశీల

10, మార్చి 2020, మంగళవారం

కిల కిల కిలకిల కిల పడుచు కోకిల



కిల కిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెళ్ళికిలా



 చిత్రం - పెళ్లి సందడి (1996)
సంగీతం - M.M.కీరవాణి 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు,K.S. చిత్ర 
 

8, మార్చి 2020, ఆదివారం

సంపంగి రెమ్మ పూబంతివమ్మ



సంపంగి రెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా
అందాలబొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా


చిత్రం - సంపంగి (2001)
సంగీతం - ఘంటాడి కృష్ణ 
గీతరచన - వరికుప్పల యాదగిరి
గానం - ఉన్ని కృష్ణన్ 


6, మార్చి 2020, శుక్రవారం

సరిగమ పదనిస రాగం త్వరపడుతున్నది మాఘం



సరిగమ పదనిస రాగం త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం ఎపుడెపుడన్నది మేళం



చిత్రం - పెళ్లి సందడి [1996]
సంగీతం - M M కీరవాణి
గీతరచన - చంద్ర బోస్
గానం - S P బాలు, మనో,M M . శ్రీలేఖ & Others 
 

4, మార్చి 2020, బుధవారం

చెమ్మచెక్క చెమ్మచెక్క చారెడేసి మొగ్గ



చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా



చిత్రం - పెళ్ళిసందడి (1996)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు,K.S. చిత్ర


2, మార్చి 2020, సోమవారం

సౌందర్య లహరి స్వప్న సుందరి



సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి 
శృంగార నగరి స్వర్ణ మంజరి రావే రస మాధురి



చిత్రం - పెళ్లి సందడి (1996)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - సిరివెన్నెల 
గానం - S.P.బాలు


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.