.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

15, ఆగస్టు 2015, శనివారం

మిలే సుర్ మేరా తుమ్హారా .. తో సుర్ బనే హమారా


భారత స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు


ఎన్నో భాషలు,ఎన్నో మతాలూ,మరెన్నో సంస్కృతులు.వీటి సమ్మేళనం మన భారతీయత. ఆ భారతీయతను రెండు లైన్లలో పాడుకోగలిగితే అది.. "మిలే సుర్ మేరా తుమ్హారా..తో సుర్ బనే హమారా.."  1988,ఆగస్ట్ 15 న ప్రధానమంత్రి ప్రసంగం అనంతరం దూరదర్శన్ లో ఈ పాట తొలిసారి ప్రసారమైంది.ఈ పాట వినగానే నా మనసు చిన్నప్పుటి DD రోజులకి వెళ్ళిపోతుంది.అప్పట్లో ఈ పాటకి అర్ధం తెలియకపోయినా మన తెలుగు దంపతులు పాడే "నా స్వరము నీ స్వరము సంగమమై మన స్వరంగా అవతరించే.." అనే లైన్స్ చాలా బాగుండేవి.ఇప్పటికీ వింటున్నా, చూస్తున్నా మనసుకు సంతోషాన్నిచ్చే ఈ పాట వినటం,చూడటం నాకు చాలా ఇష్టం .

తెలుగు పాట కాకపోయినా మన భారతీయుల పాట  
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నా సంగీతప్రపంచంలో 
మ్యూజిక్:లూయిస్ బాంక్స్
లిరిక్స్:పీయూష్ పాండే
డైరెక్టర్:సురేష్ మాలిక్
గానం :భీంసేన్ జోషి
ప్రొడ్యూసర్ :లోక్ సేవా సంచార్ పరిషత్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.