భారత స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు
ఎన్నో భాషలు,ఎన్నో మతాలూ,మరెన్నో సంస్కృతులు.వీటి సమ్మేళనం మన భారతీయత. ఆ భారతీయతను రెండు లైన్లలో పాడుకోగలిగితే అది.. "మిలే సుర్ మేరా తుమ్హారా..తో సుర్ బనే హమారా.." 1988,ఆగస్ట్ 15 న ప్రధానమంత్రి ప్రసంగం అనంతరం దూరదర్శన్ లో ఈ పాట తొలిసారి ప్రసారమైంది.ఈ పాట వినగానే నా మనసు చిన్నప్పుటి DD రోజులకి
వెళ్ళిపోతుంది.అప్పట్లో ఈ పాటకి అర్ధం తెలియకపోయినా మన తెలుగు దంపతులు
పాడే "నా స్వరము నీ స్వరము సంగమమై మన స్వరంగా అవతరించే.." అనే లైన్స్ చాలా బాగుండేవి.ఇప్పటికీ వింటున్నా, చూస్తున్నా మనసుకు సంతోషాన్నిచ్చే ఈ పాట వినటం,చూడటం నాకు చాలా ఇష్టం .
తెలుగు పాట కాకపోయినా మన భారతీయుల పాట
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నా సంగీతప్రపంచంలో
మ్యూజిక్:లూయిస్ బాంక్స్
లిరిక్స్:పీయూష్ పాండే
డైరెక్టర్:సురేష్ మాలిక్
గానం :భీంసేన్ జోషి
ప్రొడ్యూసర్ :లోక్ సేవా సంచార్ పరిషత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి